STOCKS

News


గతేడాది హీరోలు.. ఈ ఏడాది జీరోలు..

Monday 8th October 2018
Markets_main1539012555.png-20933

మార్కెట్లలో ప్రస్తుతం వచ్చిన కరెక‌్షన్‌ను నిపుణులు ఎప్పటినుంచో అంచనా వేస్తున్నారు. గత మూడు నెలలుగా కేవలం ఐదారు స్టాకుల కారణంగా సూచీలు పైపైకి పోయాయి. ఈ పెరుగుదల నిలిచేది కాదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. పడేందుకు వంక కోసం చూస్తున్న మార్కెట్లకు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం కలిసివచ్చింది. అటుపై ఎన్‌బీఎఫ్‌సీల గోల, ముడిచమురు మంట, రూపీ పతనం...  ఇలా అనేక కారణాలు చూపుతూ మార్కెట్లు కుప్పకూలాయి. తాజా పాలసీలో రేట్లను పెంచుతుందని ఆశిస్తే ఆర్‌బీఐ రివర్స్‌లో న్యూట్రల్‌ నిర్ణయం తీసుకుంది. ఇది మార్కెట్లో మరింత కుంగుబాటు తెచ్చింది. తాజా పతనాన్ని బుల్స్‌ అడ్డుకోలేరని సెంట్రమ్‌ వెల్త్‌ అభిప్రాయపడుతోంది. మరో 6- 8 నెలలు ఇదే ధోరణి ఉండొచ్చని తెలిపింది. ఈ పతనం కొత్త బుల్‌ మార్కెట్‌కు పునాదులు వేస్తుందని అంచనా వేసింది. ఈ దఫా పతనంలో విచిత్రమైన అంశం ఒకటి ఉందని గుర్తు చేసింది. గతేడాది చెలరేగిపోయిన షేర్లు ఈ దఫా పతనంలో ఎక్కువగా కుంగిపోయాయి. మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌, చమురు మార్కెటింగ్‌ కంపెనీలు, వేదాంత, మదర్‌సన్‌సుమి, ఐషర్‌ మోటర్స్‌, పీఎన్‌బీ, ఐడీయా, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ తదితర షేర్లు గతేడాది హీరోల్లాగా రెచ్చిపోయాయి. అలాంటివన్నీ ఈ ఏడాది రెండు నెలల పతనానికి వణికిపోయాయి. వీటన్నింటి మార్కెట్‌క్యాప్‌ దాదాపు 16వేల నుంచి 90 వేల కోట్ల రూపాయల మేర తుడిచిపెట్టుకుపోయింది. గతేడాది దాదాపు 1805 కంపెనీల మార్కెట్‌ క్యాప్‌లో మంచి వృద్ధి నమోదు చేసాయి. అలాంటిది ఈ ఏడాది 1886 కంపెనీలు మార్కెట్‌ క్యాప్‌ ఊడ్చిపెట్టుకుపోయింది. గతేడాది అదరగొట్టిన షేర్లలో కేవలం రెండు షేర్లు మాత్రం ఈ ఏడాది కూడా లాభాల్లో ఉన్నాయి. హెచ్‌ఈజీ షేరు గతేడాది 1455 శాతం, ఈ ఏడాది 38 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇండియా బుల్‌ వెంచర్స్‌ గతేడాది 1200 శాతం, ఈ ఏడాది 65 శాతం దూసుకుపోయింది. తాజా తలనొప్పులు కొంతకాలమేనని, దీర్ఘకాలంలో దేశీ మార్కెట్లు బుల్లిష్‌గానే కొనసాగుతాయని సెంట్రమ్‌ అంచనా వేసింది. You may be interested

ఇటలీ ఇక్కట్లు.. మార్కెట్లకు తలపోట్లు..

Monday 8th October 2018

ప్రపంచ మార్కెట్లకు మరోమారు ఇటలీ తలనొప్పులు తెస్తోంది. బడ్జెట్‌ విషయమై ఈయూ అధికారుల ప్రతిపాదనలకు ఇటలీ నో చెప్పడం ఈక్విటీ మార్కెట్లలో ఆందోళనకు కారణమవుతోంది. అసలే చైనా- యూఎస్‌ ట్రేడ్‌ వార్‌, ఇరాన్‌పై ఆంక్షలు తదితర కారణాలతో సతమతమవుతున్న ప్రపంచ మార్కెట్లను ఇటలీ ధిక్కార ధోరణి భయపెడుతోంది. తమ బడ్జెట్‌లో ఈయూ జోక్యాన్ని ఇటలీ ప్రభుత్వం తిరస్కరిస్తోంది. ఇటలీ ప్రతిపాదించిన బడ్జెట్‌ లక్ష్యాలు విత్తలక్ష్యానికి దూరంగా ఉఉన్నాయని యూరోపియన్‌ కమీషన్‌

మార్కెట్‌కు మద్దతు ఎక్కడ?

Monday 8th October 2018

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో ఆరంభమైన మార్కెట్‌ పతనాన్ని ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం, క్రూడాయిల్‌ ధర పెరగడం, రూపీ బలహీనత మరింత ప్రేరేపించాయి. దీంతో చూస్తుండగానే స్వల్ప వ్యవధిలో సూచీలు అనూహ్య వేగంతో క్షీణించాయి. గతవారమైతే భారీ గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌లతో సూచీలు అతలాకుతలం అయ్యాయి. ప్రస్తుత పతనం ఇప్పట్లో ఆగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎఫ్‌పీఐలు నికర విక్రయదారులుగా మారి విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. యూఎస్‌లో వడ్డీరేట్లను పెంచడంతో విదేశీ

Most from this category