STOCKS

News


సెప్టెంబర్‌ బేర్స్‌దే!?

Wednesday 5th September 2018
Markets_main1536142133.png-19984

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఆగస్ట్‌లో 1,000 పాయింట్లమేర పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే ఇండెక్స్‌ 14 శాతానికిపైగా ఎగసింది. అంటే దాదాపు 5,000 పాయింట్లు ర్యాలీ చేసింది. ఇలాంటప్పుడు ఇన్వెస్టర్ల మదిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. అదే ర్యాలీ ఈ నెలలోనూ కొనసాగతుందా? లేదా? అని. చరిత్రను విశ్లేషిస్తే.. స్టాక్‌ మార్కెట్‌లో గత పదేళ్లలో సెప్టెంబర్‌ నెలల్లో ఐదు సార్లు బేర్స్‌ ఆధిపత్యం కనబరిచారు. సెన్సెక్స్‌ 2008 సెప్టెంబర్‌లో 11 శాతంమేర పడిపోయింది. 2011 సెప్టెంబర్‌లో 2.1 శాతం క్షీణించింది. 2016, 2017లలో దాదాపు 2 శాతం చొప్పున నష్టపోయింది. 2014లో దాదాపు 1 శాతం తగ్గింది. ఇక 2009, 2010లో ఇండెక్స్‌ 10 శాతం చొప్పున ఎగసింది. ఇక 2012లో 8 శాతం, 2013లో 2.6 శాతం పెరిగింది. 2015లో 1.7 శాతం ఎగసింది. 

సెప్టెంబర్‌ ఔట్‌లుక్ గమనిస్తే..
ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు జూలై, ఆగస్ట్‌ నెలల్లో కొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. అయితే అంతర్జాతీయ పరిస్థితులు రానున్న కాలంలో వృద్ధిని నియంత్రించే అవకాశముందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ ఆజ్యం పోసుకోవడం, క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి పతనం వంటి అంశాలు సెప్టెంబర్‌లో స్టాక్‌ మార్కెట్ల పెరుగుదలను అడ్డుకుంటాయని తెలిపారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమావేశం ఈ నెల 25న ప్రారంభం కానుంది. గ్లోబల్‌ మార్కెట్లకు ఇది టర్నింగ్‌ పాయింట్‌ కావొచ్చు. ఫెడ్‌ మళ్లీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. ‘జీడీపీ గణాంకాలు అంచనాలు మించినప్పటికీ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి జీవిత కాల కనిష్ట స్థాయిలో ట్రేడవుతుండటం, క్రూడ్‌ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయవచ్చు. ద్రవ్యలోటు పెరుగుదల, రూపాయి క్షీణత వల్ల స్టాక్‌ మార్కెట్లపై ఒత్తిడి పెరగొచ్చు’ అని ఈక్విటీ రీసెర్చ్‌ ఆఫ్‌ అజ్‌కాన్‌ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆకాశ్‌ జైన్‌ తెలిపారు. You may be interested

కొనసాగిన నష్టాలు

Wednesday 5th September 2018

మార్కెట్‌ నష్టాల పరంపర ఆగడం లేదు. రూపాయి వరుసగా ఆరోరోజూ కొత్త కనిష్టాలకు పతనం కావడం, బాండ్‌ఈల్డ్స్‌ 4ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూలాంశాలు ఇందుకు కారణమయ్యాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంజీసీ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు వరుసగా ఆరోరోజూ నష్టాలతో ముగిశాయి.  సెన్సెక్స్‌ 140 పాయింట్ల నష్టంతో 38,018 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 11,477 వద్ద ముగిశాయి. ఓ దశలో నిఫ్టీ

రిలయన్స్‌ ఇన్ఫ్రా 6శాతం అప్‌

Wednesday 5th September 2018

అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో 6శాతం లాభపడింది. రేటింగ్‌ ఏజెన్సీ క్రిసెల్ రూ.710కోట్ల విలువైన ఎన్‌సీడీలకు ఇటీవల కేటాయించిన ‘‘డీ’’ రేటింగ్‌ను ఉపసంహరించుకున్నట్లు రిలయన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా రిలయన్స్‌ ఇన్ఫ్రా షేరు ఇంట్రాడేలో 6శాతం లాభపడి రూ.480.00వద్ద చేరుకుంది. ఇటీవల అదానీ గ్రూప్‌ ముంబై విద్యుత్‌ను సరాఫరా వ్యాపారాన్ని విక్రయించడం ద్వారా వచ్చిన నిధులతో కంపెనీ ఎన్‌సీడీలను తిరిగి చెల్లించింది.

Most from this category