STOCKS

News


ఈ పరుగులు కొనసాగేనా?

Saturday 23rd March 2019
Markets_main1553336263.png-24772

ఈ వారం మార్కెట్‌ వెనకడుగు అవకాశాలు
ప్రాఫిట్‌ బుకింగ్‌ చేయమని నిపుణుల సలహా
దేశీయ మార్కెట్లు గతవారం కూడా బలంగానే కొనసాగాయి. వారంతంలో చిన్నపాటి పతనం మినహా వారమంతా సూచీలు స్థిరంగా ముందుకే అడుగు వేశాయి. అయితే అంతకముందు వారం కనిపించిన ఉత్సాహం ఈ వారం మార్కెట్లో కనిపించలేదు. కొన్ని రంగాల్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ ఆరంభమైంది. వారంతంలో ప్రాఫిట్‌ బుకింగ్‌ ఎక్కువైంది. మార్చి ఆరంభం నుంచి మార్కెట్‌ పరుగు స్టార్టవగానే అనేక బ్రోకరేజ్‌లు తమ టార్గెట్లను అప్‌గ్రేడ్‌ చేశాయి. కానీ ఇవే బ్రోకరేజ్‌లు కేవలం నాలుగైదు నెలల క్రితం నిఫ్టీ పదివేల పాయింట్లకు వచ్చినప్పుడు ఇంతకన్నా తొందరగా టార్గెట్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేశాయి. అనంతరం వారి అంచనాలు తలకిందులు చేస్తూ సూచీలు పైకి ఎగిశాయి. అలాగే ప్రస్తుతం మార్కెట్లో అంతకంతకూ అంచనాలు పెరిగిపోతూఉన్నాయి. కానీ రిస్కుల్లేకుండా, అంతరాయాలు లేకుండా ప్రస్తుత ర్యాలీ కొనసాగుతుందని నమ్మవద్దని కొందరు ప్రముఖ నిపుణుల సలహా. మార్కెట్‌ నిపుణుడు శ్రీవాస్తవ ప్రకారం క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులేదు, కేవలం ఆశలతోనే సూచీల్లో ర్యాలీ నడుస్తోంది. ఎకానమీలో మందగమన ఛాయలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే ఆటో కంపెనీలు ఉత్పత్తి టార్గెట్లు తగ్గిస్తున్నాయి. సిమెంట్‌ కంపెనీలు మరింత రేట్‌ పెంపుదలలు లేకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఎఫ్‌ఐఐల లిక్విడిటీపై నమ్మకంతో రిటైలర్లు మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఇలాంటి నమ్మకాలు, ఊహల ఆధారిత పెట్టుబడులు దీర్ఘకాలం మంచివి కావు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏమైనా జరిగే అవకాశాలున్నాయి. అందువల్ల ప్రీఎలక‌్షన్‌ ర్యాలీ ఆవిరయ్యేముందే లాభాలను స్వీకరించడం మంచిదన్నది నిపుణుల సలహా. 
టెక్నికల్‌ అవుట్‌లుక్‌
నిఫ్టీ చార్టుల్లో బేరిష్‌గా మారింది. పైస్థాయి నుంచి నిఫ్టీ రివర్స్‌ కావడం చూస్తే పతనం ఆరంభమైనట్లే కనిపిస్తోంది. ఈ ర్యాలీలో వచ్చిన గ్యాప్స్‌ మొత్తం కరెక‌్షన్‌లో పూడ్చేయడం జరుగవచ్చు. ఇదే నిజమైతే నిఫ్టీ ముందు అర్జెంటుగా 11170 పాయింట్ల వరకు పతనం కావచ్చు. 11100 పాయింట్ల వద్ద నిఫ్టీకి మంచి బలమైన మద్దతు లభిస్తుంది. అందువల్ల వచ్చే వారం గత శుక్రవారం హైని స్టాప్‌లాస్‌గా పెట్టుకొని కొత్త షార్ట్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా లిక్విడిటీ మందగించవచ్చు. ఈ పరిస్థితుల్లో కొత్త లాంగ్స్‌ అంత సమర్ధనీయం కాదు. కొత్తగా ఎంటర్‌కాదలిచిన వాళ్లు కరెక‌్షన్‌ పూర్తయ్యేవరకు వేచిచూడడం మంచిది.You may be interested

ఆర్‌ఈఐటీ ఇప్పటికైతే ఆకర్షణీయం కాదు?!

Sunday 24th March 2019

బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూపు రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌ఈఐటీ)ను తీసుకొచ్చింది. ఇది మ్యూచువల్‌ ఫండ్‌ మాదిరిగా పనిచేసే సాధనమే. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులపై ఇన్వెస్ట్‌ చేస్తుంది. విడిగా ఒక్కొకరు ఒక ‍ప్రాపర్టీపై ఇన్వెస్ట్‌ చేయడం కాకుండా, కొంత మంది ఇన్వెస్టర్లు సమూహంగా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టేందుకు ఆర్‌ఈఐటీ వీలు కల్పిస్తుంది. అదే సమయలో ఒక ప్రాపర్టీ కొనుగోలుకు విడిగా ఒకరు అయితే పెద్ద ఎత్తునే

2శాతం పతనమైన అమెరికా మార్కెట్లు

Saturday 23rd March 2019

అంతర్జాతీయ వృద్ధి మందగమన ఆందోళనలు, బలహీన ఆర్థిక గణాంకాలు అమెరికా మార్కెట్లపై నెగిటివ్‌ ప్రభావం చూపాయి. ఫలితంగా ఈ దేశ ప్రధాన సూచీలు శుక్రవారం రాత్రి 2శాతానికిపైగా నష్టపోయాయి. అమెరికా, యూరప్‌ దేశాల్లో వెలువడిన బలహీన ఆర్థిక గణాంకాల నేపథ్యంలో అమెరికా 10ఏళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 10బేసిస్‌ పాయింట్లు నష్టపోయి 2.439 శాతం స్థాయికి పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఏవరేజ్‌ ఇండెక్స్‌ 460 పాయింట్లు నష్టపోయి 25,502 వద్ద, ఎస్‌ అండ్‌ పీ

Most from this category