STOCKS

News


టాటా మోటర్స్‌ జూమ్‌

Tuesday 5th March 2019
Markets_main1551775698.png-24439

టాటామోటర్స్‌ షేర్లు మంగళవారం 10శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.183.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తన అనుబంధ కంపెనీ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) అమెరికా మార్కెట్లో ఫిబ్రవరి వాహన విక్రయ గణాంకాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. జాగ్వర్‌ విభాగపు అమ్మకాల్లో 59శాతం వృద్ధిని, లాండ్‌ రోవర్‌ విభాగంలో 19శాతం వృద్ధిని సాధించాయి. ట్రేడ్‌వార్‌ కారణంగా గత కొంతకాలంగా అమ్మకాలు నిరాశజనకంగా ఉన్న నేపథ్యంలో ఈ ఫిబ్రవరి విక్రయాలు అంచానలకు మించి నమోదు కావడంతో ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చింది. మరోవైపు ఈ కంపెనీ షేరుపై బ్రోకరేజ్‌ సంస్థల సానుకూల రేటింగ్‌ సైతం షేరు ర్యాలీకి కారణమైంది. మొత్తం 38 బ్రోకరేజ్‌ సంస్థల్లో 16 సంస్థలు షేరుకు బై రేటింగ్‌ను కేటాయించగా, 18 సంస్థలు ‘‘హోల్డ్‌’’ రేటింగ్‌ను, 3 సంస్థలు ‘‘అండర్‌ఫెర్ఫామింగ్‌’’ రేటింగ్‌ను ఇవ్వగా, ఒకటి మాత్రం ‘‘సెల్‌’’ రేటింగ్‌ను ఇచ్చింది. బ్రోకరేజ్‌ సంస్థలో ముఖ్యమైన మెర్క్యూరీ బ్రోకజేస్‌ కంపెనీ టార్గెట్‌ ధరను రూ.260లకు పెంచుతున్నట్లు తెలిపింది. కంపెనీ వ్యయ నియంత్రణపై దృష్టిసారించిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరపు ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావచ్చని బ్రోకరేజ్‌ సం‍స్థ అంచనావేస్తుంది. ఇటీవల టాటామోటర్స్‌ జేఎల్‌ఆర్‌లో వాటా విక్రయంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కంపెనీ స్పష్టతనివ్వడం కూడా షేరు ర్యాలీ కలిసొచ్చిందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సానుకూలాంశాల నేపథ్యంలో నేడు కంపెనీ షేరు దాదాపు 10శాతం ర్యాలీ చేసి రూ.198.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. గతమూడేళ్లలో షేరు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గతముగింపు(రూ.180.1)తో పోలిస్తే 7.70శాతం లాభపడి రూ.193.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో మొదటిస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 500 పాయింట్లు జంప్‌

Tuesday 5th March 2019

ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 537 పాయింట్లు(2శాతం) లాభపడింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 27,068 వద్ద ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు ఇంట్రాడే బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల తెరలేపడంతో ఇండెక్స్ పరుగులు తీసింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అత్యధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ, యాక్సి్‌స్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు లాభపడటం ఇండెక్స్‌​ర్యాలీకి కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇంట్రాడేలో 537

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Tuesday 5th March 2019

లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీలకు ప్రభుత్వరంగ షేర్ల ర్యాలీ అండగా నిలుస్తుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. నేడు పీఎస్‌యూ ఇండెక్స్‌ 2,826ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఐడీబీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) బ్యాంక్‌ షేరు 6శాతం లాభపడింది. సెంట్రల్‌ బ్యాంక్‌ 5శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 4శాతం, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌

Most from this category