STOCKS

News


రేట్‌కట్‌ రుచించలేదా?

Thursday 6th June 2019
Markets_main1559813799.png-26137

భారీగా పతనమైన సూచీలు
తాజా సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ రెపోరేట్‌ను పావుశాతం తగ్గించడం, ధక్పథాన్ని న్యూట్రల్‌ నుంచి సర్దుబాటు(అకామిడేటివ్‌)కు మార్చడం చేసింది. ఆర్‌బీఐ చర్యలపై మార్కెట్ల ప్రాథమిక స్పందన నెగిటివ్‌గా ఉంది. సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల మేర నష్టపోయాయి. మార్కెట్లు పావుశాతం రేట్‌కట్‌ను ముందే డిస్కౌంట్‌ చేశాయని, అంతకుమించి రేట్ల తగ్గింపు ఉంటే పాజిటివ్‌గా స్పందించిఉండేవని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు చర్యలను మార్కెట్లు ముందే ఊహించాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. మానిటరీ పాలసీ పెద్దగా నచ్చకపోవడంతో బ్యాంకు నిఫ్టీ దాదాపు ఒకటిన్నర శాతం పడిపోయింది.

రేట్ల ప్రభావిత రంగాలైన బ్యాంకులు, ఆటో, రియల్టీ స్టాకుల్లో చాలా వరకు నష్టాల్లో ఉన్నాయి. ఆర్‌బీఐ కేవలం రేట్‌ కట్‌తో సరిపెట్టడం మార్కెట్‌కు నచ్చలేదని, ప్రస్తుతం ఎకానమీలో తలనొప్పిగా మారిన లిక్విడిటీ సమస్యపై ఆర్‌బీఐ నేరుగా ఎలాంటి స్పందన చేయకపోవడం మార్కెట్‌లో నష్టాలకు కారణమైందని అనలిస్టులు భావిస్తున్నారు. వృద్ధి, లిక్విడిటీ సవాళ్లు కొనసాగుతున్నాయని, వీటిపై ఆర్‌బీఐ ఎలాంటి స్పష్టమైన చర్యలను ప్రకటించలేదని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ నవీన్‌ కులకర్ణి చెప్పారు. మార్కెట్లు 25 బీపీఎస్‌ కన్నా ఎక్కువ రేట్‌కట్‌ను ఆశించాయని సుందరం మ్యూచువల్‌ పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీ సమస్యకు తగిన చర్యలు ప్రకటించకపోవడం కూడా నిరాశపరిచిందని తెలిపింది. క్రూడాయిల్‌ ధరలు చల్లబడడం, ఫెడ్‌ రేట్ల తగ్గింపుపై ఆలోచించడం, ఆసియా మార్కెట్లు లాభాల్లోఉండడంలాంటివేవీ దేశీయ సూచీలు పట్టించుకోలేదు. ఇకపై మార్కెట్ల దృష్టి రుతుపవనాల గమనం, కేంద్ర బడ్జెట్‌పై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 



You may be interested

జీడీపీ అంచనాలు తగ్గించిన ఆర్‌బీఐ

Thursday 6th June 2019

2019-20 సంవత్సరానికి 7 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరజీడీపీ అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ జూన్‌ సమీక్షా సమావేశంలో ప్రకటించింది. 2019-20 సంవత్సరానికి జీడీపీ అంచనాను 7.2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఏప్రిల్‌ సమావేశంలో ఆర్‌బీఐ తెలిపింది. తాజాగా మారోమారు జీడీపీ అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. దేశీయ పెట్టుబడి కార్యకలాపాల్లో మందగమనం ఉత్పత్తి, దిగుమతుల్లో కనిపిస్తోందని ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం ప్రథమార్ధానికి

నష్టాల్లో అనిల్‌ అంబానీ షేర్లు

Thursday 6th June 2019

అనిల్‌ అంబానీ కంపెనీ షేర్లు గురువారం నష్టాల బాట పట్టాయి. ఈ గ్రూప్‌నకు చెందిన షేర్లు దాదాపు 13శాతం క్షీణించాయి. అత్యధికంగా రిలయన్స్‌ ఇన్ఫ్రా షేర్లు 12శాతం నష్టపోయాయి. ఇంట్రాడేలో రూ.85.50ల వద్ద ఏడాది కనిష్టాన్ని నమోదు చేసింది. మిడ్‌సెషన్‌ సమయానికి 11శాతం నష్టంతో రూ.86.25ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్లు 8శాతం నష్టపోయాయి. మిడ్‌సెషన్‌ సమయంలో 7.50శాతం నష్టంతో 112.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రిలయన్స్‌

Most from this category