STOCKS

News


ఈ పతనం.. ఎందుకు?

Thursday 4th October 2018
Markets_main1538638435.png-20855

దేశీ స్టాక్‌మార్కెట్‌ ఆరంభంలోనే భారీగా పతనమైంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు 1.5 శాతానికిపైగా పడిపోయాయి. సమయం గడిచే కొద్ది నష్టాలు కూడా పెరిగాయి. మధ్యాహ్నాం కల్లా ఇండెక్స్‌లు 2.5 శాతంమేర క్షీణించాయి. సెన్సెక్స్‌-30 దాదాపు 850 పాయింట్లమేర పడిపోయింది. నిఫ్టీ-50 దాదాపుగా 250 పాయింట్లమేర క్రాష్‌ అయ్యింది. 10,600 మార్క్‌ను పరిక్షీస్తోంది. నిఫ్టీలో సుమారు 41 స్టాక్స్‌ నష్టాల్లోనే ఉన్నాయి. ఐషర్‌ మోటార్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, గెయిల్‌ షేర్లు 2-5 శాతం శ్రేణిలో నష్టపోయాయి. మరోవైపు ఎల్‌అండ్‌టీ, హిందాల్కో, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌, విప్రో షేర్లు 0.50-4 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. 

మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టిన అంశాలేంటివో ఒకసారి చూద్దాం..

రూపీ డీలా..
ఇండియన్‌ రూపాయి రికార్డ్‌ కనిష్ట స్థాయిలకు పతనం కావడం ఇన్వె‍స్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. గురువారం రూపాయి ఒకానొక సమయంలో 73.81 ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం రోజు తొలిసారిగా 73 మార్క్‌ దిగువకు పడిపోయింది. అమెరికా ఆర్థిక గణాంకాలు అంచనాలకు మించి ఉండటంతో ట్రెజరీ ఈల్డ్స్‌ పెరిగాయి. దీంతో డాలర్‌ ఇండెక్స్‌ బాగా బలపడింది. అలాగే ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని అంచనా వేశారు. ‘గత 24 గంటలుగా డాలర్‌ రూపాయిపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. పాలసీ రూపకర్తలు, ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా ఫలితం దక్కడం లేదు. ఆర్‌బీఐ.. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు స్పెషల్‌ డాలర్‌ విండో ఏర్పాటుకు అంగీకరించకపోవడంతో అగ్నికి గాలి తోడైనట్లు అయ్యింది. అలాగే ఇటలీ బడ్జెట్‌ సంక్షోభ భయాల వల్ల యూరో బలహీనపడింది. ఇది కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ వివరించింది. 

క్రూడ్‌ పరుగు..
బ్రెంట్‌ క్రూడ్‌ ధర గురువారం మార్నింగ్‌ సెషన్‌లో బ్యారెల్‌కు 86 డాలర్ల స్థాయికి చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 76 డాలర్లకు ఎగసింది. ‘రూపాయిని స్థిరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మార్కెట్‌ పాజిటివ్‌గా స్పందిచలేదు. ఆసియా, వర్ధమాన కరెన్సీలు చాలా వరకు గత నెల కాలంగా ప్రశాంతంగా ఉంటూ వస్తున్నాయి. మార్కెట్‌ క్రూడ్‌ ధరల కదలికలకు స్పందిస్తోంది. క్రూడ్‌ ధర 88-90 స్థాయికి చేరితే రూపాయి 75కు పడిపోవచ్చు’ అని ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ ఫారెక్స్‌ అండ్‌ రేట్స్‌ హెడ్‌ సాజల్‌ గుప్తా తెలిపారు. 

బాండ్‌ ఈల్డ్స్‌ అప్‌..
బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం దేశీ ఈక్విటీ మార్కెట్‌కు మంచిది కాదు. ఇండియా పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ గురువారం 8.18 శాతానికి పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే బాండ్‌ ఈల్డ్స్‌ 84 బేసిస్‌ పాయింట్లమేర పెరిగాయి. 

బయటకు ఇన్వెస్ట్‌మెంట్ల ‘క్యూ‘
విదేశీ ఇన్వెస్టర్లు దేశీ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అక్టోబర్‌లో ఇప్పటి దాకా రూ.455 కోట్లను వెనక్కు తీసుకున్నారు. సెప్టెంబర్‌లో రూ.1,488 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే ఆగస్ట్‌లో నికర ఇన్వెస్ట్‌మెంట్లు రూ.262 కోట్లుగా ఉన్నాయి.

ఆసియా మార్కెట్లు డౌన్‌..
ఆసియా మార్కెట్లు కూడా పడిపోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత ప్రభావితం చేసింది. 27 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్న జపాన్‌ నికాయ్‌ గురువారం ప్రాఫిట్‌ బుకింగ్‌ వల్ల నష్టాల్లోనే ఉంది. ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 135 పాయింట్ల నష్టంతో 23,975 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 476 పాయింట్ల నష్టంతో 26,614 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 145 పాయిం‍ట్ల నష్టంతో 10,718 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 35 పాయింట్ల నష్టంతో 2,274 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 34 పాయింట్ల నష్టంతో 3,233 పాయింట్ల వద్ద ఉన్నాయి. అయితే చైనా మార్కెట్‌కు సెలవు. శుక్రవారం చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 30 పాయింట్ల లాభంతో 2,821 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.  You may be interested

24 రోజులు.. 3,800 పాయింట్లు పతనం..

Thursday 4th October 2018

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 24 సెషన్లలో ఏకంగా 3,820 పాయింట్లుమేర పతనమైంది. ఆగస్ట్‌ 29 నాటి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 38,989 పాయింట్ల నుంచి చూస్తే గురువారం నాటి ముగింపు స్థాయి 35,169 పాయింట్ల వరకు చూస్తే సెన్సెక్స్‌ దాదాపు 10 శాతం మేర క్షీణించింది. భారత్‌లో బుల్‌ మార్కెట్‌ కరెక‌్షన్‌ సగటున 14 శాతంగా ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. అలాగే సగటున రికవరీ సమయం సాధారణంగా 66 రోజులని

భద్రం బీకేర్‌ఫుల్‌ ఇన్వెస్టరూ!

Thursday 4th October 2018

నిపుణుల సూచన దేశీయ మార్కెట్లలో బేర్స్‌ చెలరేగుతున్న ప్రస్తుత సమయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, అప్రమత్తంగా ఉండాలని మార్కెట్‌ నిపుణులు నొక్కి చెబుతున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఒడిదుడుకులను తీసుకువస్తాయని, జాగ్రత్తగా లేకుంటే పెట్టుబడి మట్టికొట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్లు క్వాలిటీ కంపెనీలనే నమ్ముకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎండమావుల వెంట పరుగెట్టవద్దని సలహా ఇస్తున్నారు. బలమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌, ముందు చూపు, మంచి వ్యాపారం, లాభదాయక ఫలితాలు

Most from this category