STOCKS

News


ఏఎంసీలపై బుల్లిష్‌

Tuesday 7th August 2018
Markets_main1533632573.png-19016

ఐఐఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ నిర్మల్‌ జైన్‌
వచ్చే పదేళ్లలో దేశీయ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమ లక్ష కోట్ల డాలర్లను దాటేస్తుందని ఐఐఎఫ్‌ఎల్‌ వ్యవస్థాపకుడు నిర్మల్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా ఎంఎఫ్‌ పరిశ్రమ విలువ 30 ఏళ్ల క్రితం 20000 కోట్ల డాలర్లని, ఇప్పుడు దాని విలువ 16 లక్షల కోట్ల డాలర్లని చెప్పారు. దేశీయ ఎంఎఫ్‌ పరిశ్రమ ప్రస్తుత విలు 30వేల కోట్ల డాలర్లని, త్వరలో ఇది లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని చేరుకుంటుందని అంచనా వేశారు. ఆర్థిక వృద్ధి, క్రమంగా పొదుపు మొత్తాలు పెట్టుబడులుగా మారడం.. ఎంఎఫ్‌ పరిశ్రమను పరుగులు పెట్టిస్తాయని చెప్పారు. వచ్చే దశాబ్ద కాలంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే పరిశ్రమల్లో ఏఎంసీ పరిశ్రమ ఒకటన్నారు. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ ఎంఏసీ బలంగా లిస్టు కావడాన్ని ఆయన ఉదహరించారు. 
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కొనొచ్చు...
దీర్ఘకాలానికి అంటే కనీసం పదేళ్ల కాలపరిమితికి హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీని కొనుగోలు చేయవచ్చని నిర్మల్‌ సూచించారు. ఈ రంగంలోని మంచి స్టాకుల్లో ఇది ఒకటన్నారు. తాజా ప్రీమియం పెద్ద లెక్కలోనిది కాదన్నారు. దీంతో పాటు పలు ఇతర ఏఎంసీ షేర్లు సైతం బాగున్నాయని, నిజానికి ఇవి వాటి విలువ కన్నా తక్కువకు ట్రేడవుతున్నాయని చెప్పారు. భారత్‌ ఎకానమీలో కనిపించే వృద్ధి ఇంకే ఇతర ఎకానమీలో కనిపించదని, అందువల్ల రాబోయే రోజుల్లో ఎకానమీతో పాటు ఏఎంసీ పరిశ్రమ సైతం మంచి పెరుగుదల నమోదు చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం జీడీపీలో ఎంఎఫ్‌ల వాటా చాలా స్వల్పమని, త్వరలో వీటి వాటా 25 శాతం వరకు ఎగబాగుతుందని అంచనా వేశారు. 



You may be interested

అవంతీ ఫీడ్స్‌కు ఫలితాలకు షాక్‌..!

Tuesday 7th August 2018

ముంబై:- అవంతీ ఫీడ్స్‌ షేర్లకు తొలి త్రైమాసిక ఫలితాలు షాకిచ్చాయి. జూన్‌ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు నమోదుకావడంతో ఆ కంపెనీ షేర్లు మంగళవారం 12శాతం నష్టపోయాయి. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లోఅవంతీ ఫీడ్స్‌ నికర లాభం 42 శాతం క్షీణించి‍ంది. ఈ గతేడాది ఇదే క్యూ1లో రూ.149 కోట్లను ఆర్జించగా, ఆ క్యూ1లో రూ. 90 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం రూ. 998 కోట్ల నుంచి రూ. 1040 కోట్లకు పెరిగింది. నిర్వహణ

సిమెంట్‌ షేర్ల ర్యాలీ

Tuesday 7th August 2018

ముంబై:- సిమెంట్‌ షేర్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. గత కొద్ది రోజులుగా స్తబ్ధుగా కొనసాగుతున్న సిమెంట్‌ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో పలు సిమెంట్‌ కంపెనీల లాభాలు పుంజుకోవడంతో పాటు రానున్న రోజుల్లో నిర్మాణ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందనే అంచానాలతో ఇంట్రాడే లో పలు సిమెంట్‌ షేర్ల ర్యాలీ జోరుగా సాగుతోంది. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌:- నేడు బీఎస్‌ఈలో  రూ. 4177.05ల వద్ద

Most from this category