News


భారత్‌పై అండర్‌వెయిట్‌..

Tuesday 20th November 2018
Markets_main1542695622.png-22220

భారత్‌ మార్కెట్‌పై ప్రస్తుతం అండర్‌వెయిట్‌తో ఉన్నామని జులియస్‌ బేర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మార్క్‌ మాథ్యూస్‌ తెలిపారు. ఈ ఏడాది ఇండియన్‌ మార్కెట్లు కరెక‌్షన్‌కు గురైనా కూడా.. చైనా, ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే ఇంకా వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
వర్ధమాన మార్కెట్లు ప్రస్తుతం పడిపోయాయని మార్క్‌ మాథ్యూస్‌ తెలిపారు. ఈ ఏడాది చివరిలో ర్యాలీ ఉండొచ్చని అంచనా వేశారు. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలకు త్వరితగతి పరిష్కారం  ఇప్పట్లో కనిపించడం లేదన్నారు. వర్ధమాన దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న విషయం తెలిసిందేనని, అయితే ఎక్కువ కాలంలో రేట్లను పెంచలేవని, రేట్ల పెంపు చివరి దశకు చేరుకుందని పేర్కొన్నారు. 2020 వరకు ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుకుంటూ వెళ్తుందని చాలా మంది భావిస్తురన్నారని, అయితే ఫెడ్‌ గత మూడు ప్రకటనలను గమనిస్తే పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తోందన్నారు. అలాగే అమెరికా క్రెడిట్‌ మార్కెట్‌లో సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు. ప్రత్యేకించి అతితక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ అయిన బీబీబీ విభాగంలో సమస్యలను సంకేతాలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. 
ప్రస్తుతం భారత్‌పై అండర్‌వెయిట్‌తో ఉన్నామని, క్రూడ్‌ ధరల తగ్గుదల సానుకూల అంశమే అయినా కూడా తాము దాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని మార్క్‌ మాథ్యూస్‌ పేర్కొన్నారు. ఎన్‌బీఎఫ్‌సీ సమస్యకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నానని, ఇది ఇంకా గట్టెక్కలేదని తెలిపారు. ప్రైవేట్‌ రంగ మూలధన పెట్టుబడులు కూడా తగ్గాయని పేర్కొన్నారు. ప్రైవేట్‌ కంపెనీల వ్యయాలు పెరిగాయని తెలిపారు. భారత్‌ కన్నా ఇతర వర్ధమాన మార్కెట్లు మరింత ఎక్కువగా పడ్డాయని పేర్కొన్నారు. సాధారణంగా చూస్తే భారత్‌ మార్కెట్‌లో ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగానే ఉన్నాయని తెలిపారు. 
అమెరికా-చైనా అధ్యక్షులు సమావేశం కానున్నారని, అప్పుడు దీని వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని అయితే ఫలితం లేదని తెలిపారు. ఇక్కడ వాణిజ్యం మాత్రమే సమస్య కాదని, అంతకు మించిన సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. చైనా ఎనర్జీ, ఇతర కమోడిటీలను ఎక్కువగా అమెరికా నుంచి కొనుగోలు చేస్తోందన్నారు. ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ వంటి అంశాలపై చైనా వెనక్కు తగ్గడం లేదని తెలిపారు. ఈ అంశాలే వచ్చే పదేళ్ల కాలంలో ఆర్థికంగా, సైనిక పరంగా, రాజకీయంగా ఇరు దేశాల బలాన్ని నిర్ణయించనున్నాయని పేర్కొన్నారు.You may be interested

ఫినొలెక్స్‌ కేబుల్స్‌పై పాజిటివ్‌

Tuesday 20th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఫినొలెక్స్‌ కేబుల్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: ఫినొలెక్స్‌ కేబుల్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.476 టార్గెట్‌ ప్రైస్‌: రూ.598 ఆనంద్‌రాఠి.. ఫినొలెక్స్‌ కేబుల్స్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.598గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత క్యూ2లో నిరుత్సాహ ఫలితాలను ప్రకటించిందని తెలిపింది. పీఏటీ వార్షికంగా 7 శాతం తగ్గిందని పేర్కొంది. రెవెన్యూ వృద్ధిలో వార్షికంగా పురోగతి లేదని

నష్టాల్లో పీసీఏ బ్యాంకులు

Tuesday 20th November 2018

ముంబై:- పీసీఏ నిబంధనల పరిధిలో ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు మంగళవారం 7శాతం నష్టపోయాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు సోమవారం ఆర్‌బీఐ బోర్డు సోమవారం సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో పీసీఏ పరిధిలోని 11 ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలన్న నిర్ణయానికి ఆర్‌బీఐ బోర్డు వచ్చింది. అయితే అనూహ్యంగా పీసీఏ పరిధిలోకి 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల బాట పట్టాయి.

Most from this category