STOCKS

News


ఈ ఐపీఓలకు ఏమైంది..?

Wednesday 26th September 2018
Markets_main1537950016.png-20595

ప్రైమరీ మార్కెట్‌లో సందడి చేసిన అనేక కంపెనీల ఐపీఓలు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) సెకండరీ మార్కెట్‌కు వచ్చే సరికి చతికిలపడిపోతున్నాయి. పలు సంస్థల ప్రకటనలు మూలధన సమీకరణకే పరిమితమైపోతున్నాయి. ఐసీఓ సమయంలో అది చేస్తాం, ఇది చేస్తాం.. కంపెనీ సమర్థత ఓ స్థాయిలో ఉందని చెప్పి ఓవర్‌ వాల్యుయేషన్స్‌ కట్టుకున్న అనేక కంపెనీల అసలు రంగు నెమ్మదిగా బయటపడుతోంది. గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ.500 కోట్లకు మించి నిధులను సమీకరించిన కంపెనీల జాబితాలో 33 సంస్థలుండగా వీటిలో ఏకంగా 17 కంపెనీల ప్రస్తుత మార్కెట్‌ ధరలు ఇష్యూధర కంటే కూడా దిగువకు పడిపోయాయి. వీటిలో 3 కంపెనీలు ఇన్వెస్టర్ల పెట్టుబడిని సగానికిపైగా హరించేశాయి.
మార్కెట్‌ పైకి.. షేరు ధర కిందకి
గడిచిన ఏడాదికాలంలో సెన్సెక్స్‌ 12 శాతం వృద్ధిని నమోదుచేసింది. గతేడాదిలో అయితే ఏకంగా 28 శాతం ర్యాలీ చేసింది. మధ్యలో భారీ పతనాలున్నప్పటికీ మొత్తంగా చూస్తే మేజర్‌ గ్లోబల్‌ మార్కెట్ల కంటే అధిక లాభాలనే పంచింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, చైనా, రష్యా మార్కెట్లతో పోలిస్తే అవుట్‌ పెర్ఫార్మర్‌గానే నిలిచింది. ప్రధాన సూచీలు ఇలా ఉంటే.. తాజాగా ఐపీఓకు వచ్చి సెకండరీ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన పలు కంపెనీలు ఇష్యూ ధర కంటే 11- 69 శాతం శాతం దిగువన ట్రేడవుతున్నాయి. ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. దేశంలోనే అతి పెద్ద సాధార‌ణ బీమా సంస్థగా ప్రైమరీ మార్కెట్‌లో సందడిచేసిన ‘న్యూ ఇండియా అష్యూరెన్స్’ ఐపీఓ ఆ తరువాత కాలంలో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. రూ.770- 800 ధ‌ర‌ల శ్రేణినితో వచ్చి రూ.800 వద్ద 1.19 రెట్లు ఓవ‌ర్ స‌బ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ రూ.9,600 కోట్లు స‌మీక‌రించింది. లిస్టింగ్‌ రోజునే 6.39 శాతం డిస్కౌంట్‌తో షాకిచ్చి.. క్రమంగా పడిపోతూ ఏడాది కూడా పూర్తికాకముందే 70 శాతం పెట్టుబడిని ఆవిరిచేసింది. ప్రస్తుతం రూ.244 వద్ద ఉంది. ప్రభుత్వ రంగ సంస్థే ఇంతటి ఓవర్‌ వాల్యుయేషన్స్‌తో వచ్చి తమను దెబ్బతీస్తుందని ఎలా ఊహిస్తామన్నది రిటైల్‌ ఇన్వెస్టర్ల మాట.
జనరల్‌ ఇన్సూరెన్స్‌దీ అదే దారి...
ప్రభుత్వ రంగంలోని మరో బీమా సంస్థ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా ఐపీఓ సైతం ఇదే తీరును ప్రదర్శించింది. రూ.11,373 కోట్ల సమీకరణ లక్ష్యంతో అతిపెద్ద ఐపీఓగా సందడి చేసి చివరకు భారీ నష్టాలను మిగిల్చిందీ సంస్థ. ఇష్యూ ధర రూ.912 కాగా, మంగళవారం నాటి మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.354 వద్ద నిలిచింది. గతేడాది అక్టోబరులో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ ఇప్పటివరకు షేరు ధరలో 63 శాతం పతనాన్ని నమోదు చేసింది. ఇక ఐపీఓ ద్వారా రూ.515 కోట్లను స‌మీక‌రించిన పాఠ్యపుస్తకాల‌ ముద్రణ సంస్థ ఎస్‌ చాంద్ అండ్‌ కంపెనీ కూడా ఇన్వెస్టర్ల పెట్టుబడిని సగం చేసింది. ఇష్యూ ధర రూ.670 ఉండగా, ప్రస్తుతం రూ.300 స్థాయిలో కొనసాగుతోంది. షేరు ధర 54 శాతం కరిగిపోయింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌, హిందూస్తాన్ ఏరోనాటిక్స్, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ సహా పలు కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
అధిక విలువలే అసలు కారణం..!
కొనేవారు ఉండాలే కానీ, కొన్ని పరిమితులకు లోబడి షేరు ప్రీమియంను నిర్ణయించుకునే వెసులుబాటు కంపెనీలకు ఉంది. ఈ పరిమిత స్వేచ్ఛను ఆసరాగా తీసుకునే పలు కంపెనీలు ఐపీఓ ధరల శ్రేణిని ఇష్టానుసారంగా అధిక వాల్యుయేషన్స్‌ వద్ద ప్రకటించేస్తున్నాయి. ఇలా అధిక విలువతో ప్రైమరీ మార్కెట్‌లో ఇన్వెస్టర్లను ఊదరగొడుతున్నప్పటికీ... సెకండరీ మార్కెట్‌లో క్రమంగా అసలు విలువ బయటపడుతోంది. ఈ క్రమంలోనే తాజా 17 కంపెనీల షేరు ధరలో పతనం నమోదైందని ఈక్విటీ మార్కెట్ల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. లిస్టింగ్‌ గెయిన్స్‌తో బయటపడిన వారిని మినహాయిస్తే... దీర్ఘకాలం ఆ షేర్లు అట్టేపెట్టుకుని లాభపడాలనుకున్న ఇన్వెస్టర్లు ఈ కంపెనీల పెట్టుబడిలో నష్టపోయారని వారు చెబుతున్నారు.
సత్తా చూపిన అవెన్యూ సూపర్ మార్ట్స్‌
వాల్యుయేషన్స్‌ పక్కాగా ఉన్న కంపెనీలలో పెట్టుబడి పదిలంగా ఉండడమే కాకుండా, లాభాలు వందల శాతాల్లోనే ఉంటాయనే దానికి ‘డీ మార్ట్‌’ రిటైల్‌ చైన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్‌ ఐపీఓ అద్ధం పట్టింది. ఈ కంపెనీ ఇష్యూ ధర కేవలం రూ.299 కాగా, ప్రస్తుతం రూ.1,534 స్థాయిలో కొనసాగుతోంది. ఏడాదిన్నర కాలంలోనే 413 శాతం రాబడిని అందించింది. 2017 ఐపీఓ మార్కెట్‌ వేడిలోనే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 94 శాతం, బంధన్‌ బ్యాంక్‌ 66 శాతం లాభాలను అందించాయి. విలువ సరిగ్గా ఉండడం, నిర్వహణ సజావుగా కొనసాగడం, వ్యాపార ధోరణిలో సత్తా ఉండడం వంటి అంశాల కారణంగా ఇదే తరహాలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఐపీఓలు ఇష్యూ ధర కంటే 45 శాతానికి మించి రాబడిని అందించాయి.

కంపెనీ                 ఇష్యూ ధర రూ.         ప్రస్తుత ధర రూ.        పతనం (శాతాల్లో)
న్యూ ఇండియా అస్యూరెన్స్        800        230                71
జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కార్పోరేష‌న్        912        328                64
ఎస్‌ చాంద్ అండ్‌ కంపెనీ        670            270                60
ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌         520            299                43
ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్    572            351                39
క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్‌        422            276                35
హిందూస్తాన్ ఏరోనాటిక్స్        1,215            841                31
భారత్ డైనమిక్స్            428            300                30
రిలయన్స్ నిప్పన్ లైఫ్        252            179                29
భారత్ రోడ్ నెట్‌వర్క్        205            152                26
గెలాక్సీ స‌ర్ఫాక్టెంట్స్            1,480            1,241                16
ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌        190            156                18You may be interested

ఎంఎఫ్‌లకు ఉపసంహరణ ఒత్తిళ్లు

Wednesday 26th September 2018

దేశీయ ఈక్విటీల్లో తాజా పతనం మ్యూచువల్‌ ఫండ్‌హౌస్‌లకు ఇబ్బందిగా మారుతోంది. గతంతో పోలిస్తే ఫండ్స్‌ నుంచి పాయింట్లు రిడీమ్‌ చేసుకొని నిధులు ఉపసంహరించుకునేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మరోపక్క ఇప్పటివరకు ఇబ్బడిముబ్బడిగా వచ్చిన పెట్టుబడుల ప్రవాహాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ఎంఎఫ్‌ల్లోకి నిధుల ఇన్‌ఫ్లో కన్నా అవుట్‌ఫ్లో ఎక్కువయింది. కాని ఇప్పటికైతే పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా మారలేదు. ఇన్‌ఫ్లో తగ్గినా స్థూల నిధుల ప్రవాహం మాత్రం పాజిటివ్‌గానే ఉంది.

ఇండియా మార్కెట్ల డీరేటింగ్‌!

Wednesday 26th September 2018

యూబీఎస్‌ అంచనా అంతర్జాతీయ మార్కెట్లు బలంగా ఉన్నా దేశీయ మార్కెట్లలో భారీ పతనం సంభవిస్తోంది. సూచీల్లో అస్థిరతకు ఈ పతనం సంకేతమని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ యూబీఎస్‌ అభిప్రాయపడుతోంది. ఈ పతనానికి తాత్కాలిక లిక్విడిటీ ఇబ్బందులు కారణమా? లేక కొత్తగా బయటపడిన క్రెడిట్‌ సంక్షోభం తాలుకా స్పందనా? అనేది తెలియాల్సిఉందని పేర్కొంది. సూచీల్లో అధిక వాల్యూషన్లకు నెగిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ తోడవడం ఆందోళనకరమని తెలిపింది. అందువల్ల ఇప్పటికైతే తగ్గినప్పుడు కొను సూత్రాన్ని పాటించలేమని

Most from this category