STOCKS

News


ఇన్‌ఫ్రా స్టాకులకు ఏమైంది?

Friday 13th July 2018
Markets_main1531467460.png-18278

దేశీయ ఇన్‌ఫ్రా రంగ కంపెనీల షేర్లు ఈ ఏడాది భారీగా పతనాలు నమోదు చేశాయి. ఇందుకు పలుకారణాలున్నాయని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు నోమురా, సిటీగ్రూప్‌ చెబుతున్నాయి. దిలీప్‌బుల్డ్‌కాన్‌, ఎన్‌సీసీ, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌ సహా పలు ఇన్‌ఫ్రా కంపెనీల షేర్లు ఈ ఏడాది దాదాపు 20- 40 శాతం పతనమయ్యాయి. చాలా స్టాకులు ప్రస్తుతం వాటి రెండేళ్ల ఎర్నింగ్స్‌ మల్టిపుల్‌ కన్నా డిస్కౌంట్‌కు ట్రేడవుతున్నాయి. ఇంతలా ఈ షేర్లు కుంగిపోవడానికి కారణాలను బ్రోకరేజ్‌లు విశ్లేషిస్తున్నాయి..
1. ప్రాజెక్ట్‌​ఫైనాన్స్‌ రిస్క్‌:  ఇన్‌ఫ్రా కంపెనీలు వాటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రుణాలు తెచ్చుకుంటాయి. వీటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా రుణాలు ఇస్తాయి. అయితే కొంతకాలంగా పీఎస్‌బీలు మొండిపద్దుల దెబ్బకు కుదేలైపోవడంతో ఇన్‌ఫ్రా కంపెనీలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరోవైపు ఆర్‌బీఐ వడ్డీలను పెంచడం ఆరంభించడం కూడా ఈ కంపెనీలనై నెగిటివ్‌ ప్రభావం చూపుతోంది.
2. కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం: ఎంతో విస్తృతి ఉన్న ఈ రంగంలో కొన్ని కంపెనీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇటీవల ఎన్‌హెచ్‌ఏఐ దాదాపు రూ.50వేల కోట్ల ప్రాజెక్టులను ఆరంభించగా ఇందులో దాదాపు 40 శాతం వాటా కేవలం ఏడు కంపెనీలే దక్కించుకోవడాన్ని ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దీంతో ఇంక్రిమెంటల్‌ ఈక్విటీ ఫండింగ్‌ రిస్కు పెరుగుతోంది.
3. ఇతర కారణాలు: ప్రాజెక్టుల అమలు, అందజేయడంలో జాప్యాలు, బ్యూరోక్రసీలో నిండిన అవినీతి, నోట్లరద్దు, జీఎస్‌టీ కారణంగా రియల్టీ కుదేలవడం లాంటి ఇతర కారణాలు సైతం ఇన్‌ఫ్రా కంపెనీను కుంగదీస్తున్నాయి.
అయితే ఈ పరిస్థితి మారుతుందని, త్వరలో మంచి రోజులుంటాయని నోమురా, సిటీ చెబుతున్నాయి. ఇన్‌ఫ్రా కంపెనీలకు అనుకూలించే కొన్ని అంశాలను అవి పేర్కొన్నాయి..
1. ప్రాజెక్టు అవార్డులు స్పీడందుకోవడం: గత త్రైమాసికంలో దాదాపు 900 కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులను అవార్డు చేయడం జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. గతంలోలాగా కాకుండా ఈ దఫా రోడ్డు మంత్రిత్వ శాఖ అంచనాలను అందుకుంటుందని అంచనాలున్నాయి. ఎన్నికలు రాబోవుతున్న వేళ మౌలిక వసతుల కల్పనను ప్రభుత్వాలు వేగిరం చేస్తాయి. ఇందుకు తగ్గట్లే ప్రభుత్వం భారత్‌మాలా ప్రాజెక్టును ప్రకటించింది. 
2. జోరందుకున్న నిర్మాణం: రోడ్ల నిర్మాణ సమయం గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది వేగం పుంజుకుంది. ప్రభుత్వం టీవోటీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడం రోడ్‌ నిర్మాణ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చనుంది. 
3. ఇతర కారణాలు: ముందస్తు కేటాయించిన అంచనాల కన్నా ఎక్కువ నిధులను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుండడం, భారత్‌ మాలా కార్యక్రమం, పీఎస్‌బీలు క్రమంగా కోలుకోవడం లాంటి ఇతర కారణాలు ఇన్‌ఫ్రా కంపెనీలకు ఊపిరినిస్తాయిని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి. You may be interested

రూ.1100 దాటిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Friday 13th July 2018

రూ.7లక్షల కోట్లకు చేరిన మార్కెట్‌ క్యాప్‌ ముంబై:- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు రికార్డు ర్యాలీ పరంపర ఆగడం లేదు. శుక్రవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు మరో 2.31శాతం లాభపడి రూ.1107.2ల వద్ద తమ సరికొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. ఆ క్రమంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌మార్కెట్ క్యాపిటలైజేషన్‌ తొలిసారి రూ.7లక్షల కోట్లకు చేరింది. నేడు బీఎస్‌ఈలో రిలయన్స్‌ షేరు రూ.1082.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత వరుస లాభాల ట్రేడింగ్‌ను

తగ్గిన పసిడి..!

Friday 13th July 2018

ముంబై:- డాలర్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా శుక్రవారం పసిడి ధర తగ్గింది. అమెరికా గురువారం విడుదల చేసిన రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు సానుకూలంగా ఉండటంతో పాటు, అమెరికా - చైనా వాణిజ్య యద్ధ భయాల నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యంతో డాలర్‌ బలపడింది. డాలర్‌ ఇండెక్స్‌ గురువారం ఆసియా ట్రేడింగ్లో 94.93 స్థాయిలో ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ స్థిరమైన ర్యాలీతో ప్రస్తుతం ఆసియా ట్రేడింగ్‌లో  ఔన్స్‌ పసిడి ధర 2.20

Most from this category