STOCKS

News


ఉన్నట్టుండి ఎఫ్‌పీఐల నిధుల వరద...!?

Thursday 14th March 2019
Markets_main1552586766.png-24612

గత నెల వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు సాగిస్తూ వచ్చారు. ముఖ్యంగా గతేడాది భారత స్టాక్స్‌ను పెద్దగా పట్టించుకోని ఎఫ్‌పీఐలు ఉన్నట్టుండి నికర కొనుగోలుదారులుగా మారారు. దీని వెనుక కారణాలను పరిశీలిస్తే... లిక్విడిటీ పరిస్థితులు మెరుగయ్యాయి. చమురు ధరలు గతేడాది గరిష్ట స్థాయిలకు చేరిన తర్వాత తిరిగి చల్లబడ్డాయి. కంపెనీల ఎర్నింగ్స్‌ రికవరీ అవుతాయన్న అంచనాలకుతోడు లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరంగా ఎటువంటి మార్పు ఉండకపోచ్చన్న అంచనాలే ఎఫ్‌పీఐలు తిరిగి భారత ఈక్విటీల్లో పెట్టుబడుల వైపు మళ్లేలా చేశాయంటున్నారు విశ్లేషకులు. 

 

ఫిబ్రవరి 1 తర్వాత 15 ట్రేడింగ్‌ సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ.1,000 కోట్ల విలువైన షేర్లను కొనేశారు. దీంతో ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.30వేల కోట్లకు చేరాయి. ఫలితంగానే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,600 పాయింట్లకు పైగా పెరిగింది. జీవిత కాల గరిష్ట స్థాయిలకు మరోసారి చేరువ అయింది. 2017 ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎఫ్‌పీఐలు రూ.40,000 కోట్ల మేర స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టిన తర్వాత... తక్కువ వ్యవధిలోనే ఎఫ్‌పీఐల నుంచి భారీగా నిధులు రావడం మళ్లీ ఇప్పుడే జరిగింది. ‘‘అంతర్జాతీయంగా లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడడం ఇందుకు సాయపడింది. ఎఫ్‌పీఐలు లార్జ్‌క్యాప్‌లోనే కాకుండా మార్కెట్‌ వ్యాప్తంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇక ముందూ పరిస్థితులు స్థిరంగా ఉంటే ఎఫ్‌పీఐల పెట్టుబడుల రాక కొనసాగుతుంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌కు చెందిన సిద్ధార్థ్‌ ఖేమ్కా తెలిపారు. 

 

ఎఫ్‌పీఐలు బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో ఎక్కువగా కొనుగోళ్లు చేసినట్టు ఎన్‌ఎస్‌డీఎల్‌ గణాంకాల ద్వారా తెలుస్తోంది. బ్యాంకింగ్‌లో రూ.9,154 కోట్లు, ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌లో రూ.1,172 కోట్లు, ఐటీ స్టాక్స్‌లో రూ.684 కోట్లు, మీడియా స్టాక్స్‌లో రూ.671 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కెమికల్స్‌, ఫార్మా, ఇన్సూరెన్స్‌, టెలికం షేర్లు కూడా వారి కొనుగోళ్లలో ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎర్నింగ్స్‌ వృద్ధి మంచిగా ఉంటుందని, దీంతో పెట్టుబడుల రాక పెరుగుతుందని సిద్ధార్థ్‌ ఖేమ్కా అంచనా వేశారు.You may be interested

 ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు అప్‌ 

Friday 15th March 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యిందనేవార్తలతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగిన నేపథ్యంలో నాలుగురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు శుక్రవారం సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.35 గంటలకు 11,402 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,382  పాయింట్ల వద్ద ముగిసింది.

40 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలకు భారీ వాటాలు

Thursday 14th March 2019

ఇటీవలి మార్కె్‌ట్‌ ర్యాలీ ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల కారణంగానే అని చెప్పొచ్చు. గతేడాది నుంచి మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ గణనీయంగా నష్టపోయి ఉన్నాయి. తాజాగా విదేశీ పెట్టుబడులతో మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌ నెలకొంది. మళ్లీ మోదీ సర్కారే వస్తుందని, బలమైన సంస్కరణలకు అవకాశం ఉంటుందన్న అంచనాలతో వారు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో రికవరీ ఆరంభమైంది. చాలా వరకు స్టాక్స్‌ 10-40

Most from this category