STOCKS

News


బాండ్లపై ఎఫ్‌ఐఐల అనాసక్తి

Monday 22nd April 2019
Markets_main1555928269.png-25273

దేశీయ ఈక్విటీలపై మక్కువ చూపుతున్న విదేశీ సంస్థాగత మదుపరులు దేశీయ బాండ్‌ మార్కెట్‌పై శీతకన్నేస్తున్నారు. ఒకపక్క ఈక్విటీల్లో ఇబ్బడిముబ్బడిగా కొనుగోళ్లు చేస్తున్న ఎఫ్‌ఐఐలు డెట్‌ మార్కెట్లో నికర విక్రేతలుగా మారారు. ఈ నెల్లో ఇంతవరకు అంతర్జాతీయ ఫండ్స్‌ సావరిన్‌, కార్పొరేట్‌ బాండ్స్‌ నుంచి రూ. 8950కోట్ల రూపాయలు ఉపసంహరించుకున్నారని ఎన్‌ఎస్‌డీ డేటా చెబుతోంది. మార్చిలో విదేశీ ఫండ్స్‌ బాండ్‌ మార్కెట్లో దాదాపు 17వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపారు. ఉన్నట్లుండి బాండ్‌ మార్కెట్‌పై ఎఫ్‌ఐఐలకు ఆసక్తి తగ్గడానికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌లో పెరుగుదల, ఆర్‌బీఐ అనుకున్నదానికన్నా తక్కువ సరళీకృత విధానాలు అవలంబించడం.. కారణంగా డెట్‌ మార్కెట్లో అవుట్‌ఫ్లో పెరిగిందని స్టాండర్డ్‌ చార్టర్‌ బ్యాంక్‌ విశ్లేషించింది. ముఖ్యంగా కార్పొరేట్‌ బాండ్స్‌ నుంచి ఎక్కువగా ఎఫ్‌ఐఐలు వైదొలుగుతున్నాయి. ఈ నెల్లో కేవలం కార్పొరేట్‌ బాండ్స్‌ నుంచి రూ. 7400 కోట్లను ఉపసంహరించుకున్నాయి. మరోపక్క ఈ నెల్లో ఎఫ్‌ఐఐలు ఈక్విటీల్లో దాదాపు 69 కోట్ల డాలర్ల విలువైన కొనుగోళ్లు జరిపాయి. దీంతో ఈ ఏడాది ఎఫ్‌ఐఐ ఈక్విటీ కొనుగోళ్లు 750 కోట్ల డాలర్లను చేరాయని బ్లూమ్‌బర్గ్‌ గణాంకాలు చెబుతున్నాయి.ఆసియా మార్కెట్లన్నింటిలోకి వచ్చిన విదేశీ నిధుల్లో ఎక్కువ శాతం ఇండియా మార్కెట్లలోకే వచ్చాయి. 



You may be interested

11600 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 22nd April 2019

బలహీన దేశీయ సంకేతాలకు తోడు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ల పతనంతో సోమవారం మార్కెట్‌ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్‌ 495 పాయింట్ల నష్టంతో 38,645 వద్ద, నిఫ్టీ 158 పాయింట్ల నష్టంతో 11,594.50 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల భారీ పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 540(1.75శాతం) నష్టపోయి 29,688 వద్ద స్థిరపడింది. సూచీలకు ఇది వరుసగా రెండో రోజూ

బ్యాంక్‌ నిఫ్టీ 2శాతం డౌన్‌

Monday 22nd April 2019

మార్కెట్‌ పతనంలో సోమవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. నేడు నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 30,282.50ల వద్ద ప్రారంభమైంది. అటు ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఇటు ప్రైవేట్‌రంగ బ్యాంకు షేర్ల పతనంతో ఇంట్రాడేలో 2శాతం నష్టపోయి 29,686.80  కనిష్టానికి పతనమైంది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. మరో​ అరగంటలో

Most from this category