STOCKS

News


ఆప్షన్‌ కొనుగోలుదారులు నష్టపోయేదెందుకు?

Friday 10th August 2018
Markets_main1533902735.png-19149

ప్రపంచవ్యాప్తంగా 80-85 శాతం ఆప్షన్లు ప్రయోజనం లేకుండా ఎక్స్‌పైర్‌ అయ్యేవే. ఆప్షన్ల కొనుగోలు దారులు నష్టపోతుంటే, వాటిని అమ్మిన వారు నిజంగా లాభపడుతున్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఆప్షన్లను కొనుగోలు చేసేవారు సాధారణంగా చిన్న ట్రేడర్లు. ఆప్షన్లను విక్రయించేది పెద్ద ఇనిస్టిట్యూషన్లు. ఆకర్షణీయంగా కనిపించే ఆప్షన్లు పూర్తి ధర పలుకుతాయి. డీప్‌ అవుట్‌ ఆఫ్‌ మనీ (ఎటీఎం) ఆప్షన్లు ఉపయోగం లేనివే. ఆప్షన్ల విక్రయదారులకే కాలం సానుకూలిస్తుంది. 

 

ఆప్షన్ల కొనుగోలులో నష్టం పరిమితంగా ఉంటుంది. కానీ, ఫ్యూచర్స్‌లో లాభం అయినా, నష్టమైన అపరిమితం. ఆప్షన్‌కు మీరు చెల్లించే ప్రీమియం వరకే నష్టం పరిమితం. కానీ, ఒక ఆప్షన్‌ కొనుగోలుకు మీరు చెల్లించిన ప్రీమియంను స్ట్రయిక్‌ ప్రైస్‌ దాటిందంటే, లాభం అపరిమితమే. అంటే నష్టం పరిమితం, లాభం అపరిమితం. అందు వల్లే ఆప్షన్ల కొనుగోలు చాలా మందిని ఆకర్షిస్తుంటుంది. ఉదాహరణకు ఓ స్టాక్‌ స్పాట్‌ ధర రూ.592 ఉంటే 600 కాల్‌ ఆప్షన్‌ను 15 రూపాయల ప్రీమియంతో కొనుగోలు చేశారనుకోండి. అప్పుడు స్ట్రయిక్‌ ధర రూ.600 అవుతుంది. రూ.15 కొనుగోలు ధర అవుతుంది. గరిష్టంగా నష్టపోయేది ఇంతే. స్ట్రయిక్‌ ప్రైస్‌ రూ.600 కంటే ప్రస్తుత ధర తక్కువ ఉందనుకోండి... అది అవుట్‌ ఆఫ్‌ ద మనీ (ఓటీఎం) అవుతుంది. ఎట్‌ ద మనీ (స్ట్రయిక్‌ ధర వద్ద) లేదా ఇన్‌ ద మనీ (స్ట్రయిక్‌ ధరపైన, కొనుగోలు ధరలోపు) స్థాయిలో ఉన్నా కానీ నష్టమే వస్తుంది. స్ట్రయిక్‌ ప్రైస్‌ రూ.600, కొనుగోలు ధర రూ.15 కలిపి రూ.615 దాటితే కానీ సదరు ఆప్షన్‌ లాభాలను ఇవ్వదు. 

 

నష్టాలకు కారణాలు

  • సాధారణంగా ఇన్వెస్టర్లు డీప్‌ ఓటీఎం ఆప్షన్లను ప్రీమియం తక్కువగా ఉందని కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఆ స్థాయిలను చేరుకునే అవకాశాలు తక్కువ. ఇది ఓటీఎం ఆప్షన్‌. 
  • ఆప్షన్‌ను ఎక్స్‌పైరీకి సమీపం వరకు కొనసాగించడం కూడా నష్టాలకు కారణం. ఎక్స్‌పైరీ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కాలం ఆధారిత విలువ వేగంగా కరిగిపోతుంది. కనుక మంచి ధర లభిస్తే కాల వ్యవధి మిగిలి ఉన్నప్పటికీ లాభంతో బయడపడడం మంచిది. 
  • ట్రేడర్లు కీలక ఈవెంట్లకు ముందు లాంగ్‌ ఆప్షన్లను కొనుగోలు చేస్తుంటారు. ఉదాహరణకు ఇన్ఫోసిస్‌ మంచి ఫలితాలను ప్రకటిస్తుందని ఓటీఎం కాల్‌ కొన్నారనుకోండి. ఒకవేళ ఇన్ఫోసిస్‌ ఫలితాలు నిరుత్సాహపరిస్తే ఆ ఓటీఎం కాల్‌ ఆప్షన్‌ విలువ లేకుండా పోతుంది.
  • మరీ బుల్లిష్‌ లేదా మోస్తరు బుల్లిష్‌ ధోరణి అన్నది మంచిది కాదు. ఓ స్టాక్‌పై మోస్తరు బుల్లిష్‌తో ఉంటే నేక్డ్‌ పొజిషన్‌ కంటే బుల్‌ కాల్‌ స్ప్రెడ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. దీంతో మొత్తం మీద ఆప్షన్‌ కొనుగోలు ధర తగ్గుతుంది.
  • ఆప్షన్‌ అన్నది బీమా పాలసీ వంటిది. డౌన్‌సైడ్‌ రిస్క్‌ను తగ్గిస్తుంది. బీమా పాలసీ కొని లాభాలు పొందిన వారి గురించి విన్నారా? మీకు పాలసీలు అమ్మిన బీమా కంపెనీయే లాభాలు గడిస్తుంది. ఆప్షన్లలోనూ ఇంతే. అమ్మిన వారికే లాభాలు.

 

(నోట్‌: ఏంజెల్‌ బ్రోకింగ్‌ సంస్థ అందించిన విశ్లేషణ ఇది)



You may be interested

ఫండ్స్‌లో నాలుగు నిర్ధారకాలు

Friday 10th August 2018

పెట్టుబడులను సులభతరం చేసే వేదికే మ్యూచువల్‌ ఫండ్స్‌. కానీ, 2,000కు పైగా పథకాల నుంచి ఎంపిక చేసుకోవడం అన్నది కొత్త ఇన్వెస్టర్లకు కొరుకుడుపడని అంశమే. ఇటీవలి కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్యలో వేగవంతమైన వృద్ధి కనిపిస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ఆసక్తితో ఉన్న కొత్త ఇన్వెస్టర్లు పథకాల ఎంపిక ముందు నాలుగు అంశాలను అర్థం చేసుకోవాలి. దాంతో ఎంపిక సులభం అవుతుంది. అవేంటన్నది నిపుణులు

హెచ్‌పీసీఎల్‌ ఆకర్షణీయం..

Friday 10th August 2018

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండేషన్‌ టార్గెట్‌ ధర- రూ. 463. సిఫార్సు- కొనొచ్చు. గత ఆగస్టులో టాప్‌ అవుట్‌ అయిన తర్వాత ఈ షేరు దాదాపు 42 శాత పతనమైంది. ప్రస్తుతం స్టాకు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ట్రేడవుతోంది. చమురు ధరల ఒడిదుడుకులు షేరుపై ప్రభావం చూపుతున్నాయి. మార్జిన్లు తక్కువగా ఉన్నా త్వరలో పుంజుకుంటాయని అంచనా. ప్రపంచ ఇంధన డిమాండ్‌ రాబోయే కాలంలో పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ఇదే నిజమైతే కంపెనీకి ప్రయోజనం ఉంటంది. తాజా

Most from this category