STOCKS

News


మార్కెట్లో అప్రమత్తత అవసరం.. ఎందుకంటే!

Thursday 27th September 2018
Markets_main1538029087.png-20637

ఈ నెలారంభంలో నిఫ్టీ 12 నెలల ఫార్వర్డ్‌ పీఈకి 20 రెట్ల వద్ద ట్రేడవుతోంది. మూడేళ్ల సరాసరితో పోలిస్తే ఇది 15 శాతం అధికం. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు జరిపే అధ్యయనంలో ఫార్వర్డ్‌ పీఈ ప్రైస్ చాలా కీలకం. గతంలో సూచీలు 12నెలల ఫార్వర్డ్‌ పీఈకి 18 రెట్లు అధికంగా ట్రేడయిన సందర్భాల్లో అధిక శాతం కరెక‌్షన్‌కు గురైందని గోల్డ్‌మన్‌ సాక్స్‌ అధ్యయనం వెల్లడించింది. ఉదాహరణకు ఎంఎస్‌సీఐ ఇండియా సూచీ ఫార్వర్డ్‌ పీఈకి 18 రెట్లు అధికంగా ట్రేడవడం ఆరంభించగానే 9 శాతం పతనమైంది. నిఫ్టీ సైతం నెలారంభంలో అధిక పీఈ వద్ద ట్రేడవడం ఆరంభించింది. అందుకే ఈ నెల్లో దాదాపు 5 శాతం మేర పతనమైంది. పీఈ పెరగడమంటే సూచీ లేదా స్టాక్‌ వాల్యూషన్లు ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా ఉన్నాయని అర్ధం. మార్కెట్లో వాల్యూషన్లు పెరగడం క్రమంగా కరెక‌్షన్‌కు దారితీస్తుంది. దీంతో పాటు అధిక పీఈ కారణంగా డీరేటింగ్‌ రిస్కులుంటాయి. యూబీఎస్‌ సైతం దేశీయ మార్కెట్లు డీరేట్‌ అవుతాయని, ఎర్నింగ్స్‌ అంచనాలు 8 శాతం వరకు తగ్గవచ్చని అంచనా వేసింది. ఇవన్నీ కలగలిసి మార్కెట్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. షార్ట్‌, మిడ్‌ టర్మ్‌ ఇన్వెస్టర్లు మార్కెట్లో పెట్టుబడులకు ఆచితూచి అడుగులు వేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 



You may be interested

నష్టాల్లో అడాగ్‌ షేర్లు

Thursday 27th September 2018

ముంబై:- ఆటుపోట్ల మధ్య సాగుతున్న మార్కెట్‌లో అనిల్‌ అంబానీ ధీరూభాయ్‌ గ్రూప్‌(అడాగ్‌) షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి.  అడాగ్‌ షేర్లలో భారీ స్థాయిలో అమ్మకాలు చేపట్టారు. ఫలితంగా గురువారం అడాగ్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ షేరు ఏడాది కనిష్టానికి పతనమైంది. రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ 5శాతానికి పైగా నష్టపోయింది. ఏడాది కనిష్టానికి రిలయన్స్‌ క్యాపిటల్‌:-  నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో రూ.318.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  సంస్థకు 10ఏళ్ల పాటు సీఈవో, ఈడీగా

75 స్థాయికి రూపాయి!

Thursday 27th September 2018

ఏయూఎం క్యాపిటల్‌ అంచనా ఈ ఏడాది డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 శాతం మేర పతనమైంది. దీంతో ఆసియాలో అత్యంత అధ్వాన్న ప్రదర్శన జరిపిన కరెన్సీగా రూపీ నిలిచింది. క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, దిగుమతుల భారం పెరగడం, ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలపడడం.. రూపాయిని కుంగదీశాయి. తాజాగా రూపీ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రకటించినా పెద్దగా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో రూపాయి

Most from this category