STOCKS

News


బీఓబీ ఎందుకు తగ్గింది?..దేనా పెరిగిందెందుకు?

Tuesday 18th September 2018
Markets_main1537254070.png-20352

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా బ్యాంకింగ్‌ విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మెరుగైన బ్యాంకుగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) షేరు మంగళవారం నిట్టనిలువునా పతనంకాగా, భారీ ఎన్‌పీఏలతో అధ్వాన్న బ్యాంక్‌గా స్వయానా రిజర్వుబ్యాంక్‌తో ముద్రవేయించుకున్న దేనా బ్యాంక్‌ షేరు భారీగా పెరిగింది. ఒక వైపు బీఓబీ షేరు 14 శాతం వరకూ పతనమై 52 వారాల కనిష్టస్థాయి రూ. 116 వద్దకు పడిపోగా, దేనా బ్యాంక్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ రూ. 20 వద్ద ఫ్రీజ్‌ అయ్యింది. ఎందుకిలా జరిగింది. మరోవైపు ఇదే విలీనంలో భాగస్వామ్యంకానున్న విజయా బ్యాంక్‌ షేరు సైతం నష్టాల్లో చిక్కుకుపోయింది. మెరుగైన బ్యాంక్‌లో బలహీన బ్యాంక్‌ను బలహీనమైన బ్యాంక్‌ను విలీనం చేయడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెపుతున్నారు. విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకులో లభించే స్వాప్‌ షేర్లు...ప్రస్తుత ధర ప్రకారం   బలహీన బ్యాంక్‌కు సంబంధించిన షేర్‌హోల్డర్లకు లబ్ది చేకూరుస్తాయని, బలమైన బ్యాంక్‌లో వున్న షేర్‌హోల్డర్లకు ప్రస్తుత ధర ప్రకారం నష్టం వాటిల్లుతుందని వారంటున్నారు. అందుకే బీఓబీ షేరు పతనమై, దేనా బ్యాంక్‌ షేరు ర్యాలీ జరిపిందని వారు విశ్లేషించారు. మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు 11.6 శాతం వుండగా, ఒక్క దేనా బ్యాంకుకు 22 శాతం ఎన్‌పీఏలున్నాయి. ఈ బ్యాంకుకు రూ. 10,500 కోట్ల అక్యుములేటెడ్‌ నష్టాలున్నాయి. దీంతో ఈ బ్యాంకు రుణ వితరణ, విస్తరణ, డివిడెండు చెల్లింపులపై రిజర్వుబ్యాంక్‌ నియంత్రణలు విధించింది. ఖచ్చితమైన దిద్దుబాటు చర్యల్ని చేపట్టాల్సిన బ్యాంకుగా దేనా బ్యాంక్‌ను ఆర్‌బీఐ వర్గీకరించింది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనంకావడం వల్ల దేనా బ్యాంక్‌ ప్రస్తుత కష్టాలు తీరిపోతాయి. తద్వారా ఈ బ్యాంకు షేరు హోల్డర్లు ప్రయోజనం పొందగలుగుతారు. అయితే ఇంత భారీ మొండి బకాయిలున్న బ్యాంక్‌ను కలుపుకోవడం ద్వారా బీఓబి స్వంత బ్యాలెన్స్‌ షీట్‌ తాత్కాలికంగా దెబ్బతింటుంది. దీంతో ఈ షేరు విలువ ప్రస్తుత స్థాయిలో ఖరీదుగా మారుతుందని విశ్లేషకులు వివరించారు. 
 



You may be interested

తదుపరి వీలీన ప్రక్రియలో ఈ మూడే లీడ్‌ బ్యాంకులు

Tuesday 18th September 2018

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌ల్ని విలీనపరుస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తదుపరి విలీన ప్రక్రియలో మరో మూడు బ్యాంకులు నేతృత్వం వహిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అవి....బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు. ఈ మూడు రాబోయే విలీన ప్రక్రియలో ఆగ్రిగేటర్లు కావొచ్చంటూ ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ జేపీ మోర్గాన్‌ తాజాగా విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది. ఒక

ఇండియా మార్ట్‌ ఐపీఓకు సెబీ ఓకే

Tuesday 18th September 2018

అవన లాజిస్టెక్‌ ఐపీఓకు కూడా న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌, ఇండియామార్ట్‌ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ ‘సెబీ’... ఆమోదం తెలిపింది. ఈ కంపెనీతో పాటు అవన లాజిస్టెక్‌ కంపెనీ ఐపీఓకు కూడా సెబీ పచ్చజెండా ఊపింది. ఐపీఓలో భాగంగా ఇండియామార్ట్‌ కంపెనీ 42.88 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.600 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓకు

Most from this category