STOCKS

News


గ్రాఫైట్‌ స్టాక్స్‌ ఎందుకలా పడుతున్నాయ్‌?

Saturday 26th January 2019
Markets_main1548442060.png-23812

గతేడాది ద్వితీయ భాగంలో గ్రాఫైట్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు ప్రస్తుత పరిణామాలు చూసి నిరాశ చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రంగంలోని రెండు ప్రధాన లిస్టెడ్‌ కంపెనీలు గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ స్టాక్స్‌ వాటి 52 వారాల గరిష్ట స్థాయి నుంచి ఆరు నెలల్లోనే ఇప్పటికి 50 శాతం పడిపోయాయి. శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ఈ రెండూ 52 వారాల కనిష్ట స్థాయిలను నమోదు చేశాయి. గ్రాఫైట్‌ ఇండియా 52 వారాల గరిష్ట ధర 2018 ఆగస్ట్‌ 14న రూ.1,126గా ఉంది. ఈ ధర నుంచి 51 శాతం పడిపోయింది. హెచ్‌ఈజీ సైతం 2018 అక్టోబర్‌ 16న నమోదు చేసిన 52 వారాల గరిష్ట ధర రూ.4,950 నుంచి 47 శాతం దిద్దుబాటుకు గురైంది. 

 

అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మాక్వేర్‌ విశ్లేషణ ప్రకారం... 2018 సెప్టెంబర్‌లో గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌పై యాంటీ డంపింగ్‌ డ్యూటీ ఎత్తివేయడం... చైనా నుంచి వచ్చే దిగుమతులతో దేశీయ నాన్‌ యూహెచ్‌పీ ధరలు ప్రభావితం అయ్యాయి. అదే సమయంలో స్టీల్‌ ధరల తగ్గుదలతోనూ యూహెచ్‌పీ ధరలపై ప్రభావం పడింది. అమెరికా ఆంక్షలతో డిసెంబర్‌ త్రైమాసికం నుంచి హెచ్‌ఈజీ, గ్రాఫైట్‌ ఇండియా సంస్థలు ఇరాన్‌కు ఎగుమతులను నిలిపివేశాయి. ఈ సంస్థల ఎగుమతులకు ఇరాన్‌ కీలకం. ఈ రెండు సంస్థలు కలసి మొత్తం మీద 8-10 శాతం వరకు ఇరాన్‌కు ఎగుమతులు చేసేవి. ఎగుమతులను నిలిపివేయడం వీటి మార్జిన్లపై ప్రభావం చూపిస్తుంది. వీటి ఉత్పత్తుల ధరలు ఇంకా తగ్గుతాయని మాక్వేర్‌ అంచనా. ఎందుకంటే 2018లో స్టీల్‌ కంపెనీలు గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ నిల్వలను పెంచుకున్నాయి. స్టీల్‌ ధరలు తగ్గడంతో గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ నిల్వలను అవి ఇప్పుడు తగ్గించుకుంటున్నాయి. ఈ అంశాల నేపథ్యంలో హెచ్‌ఈజీ త్రైమాసికం వారీగా అమ్మకాల్లో వృద్ధి ఉండకపోవచ్చని... గ్రాఫైట్‌ ఇండియా అమ్మకాలు 15 శాతం తగ్గుముఖం పడతాయని మాక్వేర్‌ అంచనా వేస్తోంది. గ్రాఫైట్‌ ఇండియా తన బెంగళూరు ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేయడం ఇందుకు కారణంగా పేర్కొంది. రానున్న రెండు మూడు త్రైమాసికాలు గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ అమ్మకాల మార్జిన్లపై... ధరల తగ్గుదల, వ్యయాల పెరుగుదల భారం ఉంటుందని వివరించింది. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 54 పాయింట్లు జంప్‌

Saturday 26th January 2019

విదేశీ మార్కెట్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి లాభంతో  10,840.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10,786 పాయింట్లతో పోలిస్తే 54 పాయింట్ల లాభంతో ఉంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ నష్టంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సఫలవచ్చనే ఆశావహనంతో శుక్రవారం ఆసియా మార్కెట్లు లాభాలతో

మైండ్‌ట్రీ ఎవరికి దక్కేను...?

Saturday 26th January 2019

మైండ్‌ ట్రీలో అతిపెద్ద నాన్‌ ప్రమోటర్‌ వీజీ సిద్ధార్థ, తన గ్రూపు కంపెనీలకు ఉన్న 21 శాతం వాటాను అమ్మే ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రత్యర్థి ఐటీ కంపెనీలు ఎల్‌అంటీ ఇన్ఫోటెక్‌, టెక్‌ మహీంద్రా, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు కేకేఆర్‌, ఫేర్‌ఫాక్స్‌ తదితర సంస్థలు పోటీ పడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు భంగం కలుగుతుందా...? నిపుణులు ఏమంటున్నారు...?   మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు కృష్ణకుమార్‌ నటరాజన్‌కు కంపెనీలో

Most from this category