STOCKS

News


టాటా మోటర్స్‌ షేరులో ఎందుకింత ర్యాలీ?

Friday 19th April 2019
Markets_main1555662333.png-25229

గత కొద్ది కాలంగా టాటామోటర్స్‌ షేరు దూసుకుపోతోంది. ఈ ఒక్క నెల్లోనే షేరు దాదాపు 25 శాతం మేర లాభపడింది. ఈ నేపథ్యంలో షేరును కేవలం రెండు శక్తులే కొనుగోలు చేస్తున్నాయని, అందుకే ఇంతలా ర్యాలీ జరుపుతోందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. టాటామోటర్స్‌ కంపెనీ మౌలికంగా బలమైనదే, పాసింజర్‌ వాహనాల పోర్టుఫోలియో స్థిర ప్రదర్శన చూపుతోంది. కమర్షియల్‌ వాహనాలు సైతం బాగానే విక్రయిస్తోంది. అయితే ఒక్కమారుగా షేరు ధరలో ఇంత ర్యాలీ ఎందుకు వచ్చిందని సాధారణ మదుపరులకు అర్ధం కావడం లేదు. అయితే ఇందులో కన్ఫ్యూజన్‌ ఏమీలేదని, కేవలం టాటా గ్రూప్‌, ఈటీఎఫ్‌లు ఎక్కువగా షేరును కొనుగోలు చేయడంతో ధర పెరుగుతూ పోతోందని మార్కెట్‌ విశ్లేషకుడు దేవన్‌చౌక్సీ చెబుతున్నారు. టాటా గ్రూప్‌ తన హోల్డింగ్‌ కంపెనీల ద్వారా షేరును కొనుగోలు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. గత త్రైమాసిక ఫలితాల అనంతరం షేరు బాగా క్షీణించిందని, అప్పటినుంచి గ్రూప్‌ కొనుగోలు ఆరంభించి తక్కువ ధరల వద్ద పోగు చేయడం మొదలుపెట్టిందన్నారు. మరోపక్క ఈటీఎఫ్‌లు షేరును కాంట్రా బయింగ్‌ అవకాశంగా గమనించి కొనుగోలు చేస్తున్నాయని అంచనా వేశారు. కేవలం ఈ రెండు శక్తుల కొనుగోలు ఫలితమే షేరు ధరలో ర్యాలీకి కారణమని విశ్లేషించారు. తాను సైతం ప్రస్తుతం టాటామోటర్స్‌ షేరుపై పాజిటివ్‌గా ఉన్నానన్నారు. కంపెనీ మౌలికంగా బలమైనదని, క్రమానుగతంగా మెరుగుదల నమోదు చేస్తుందని చెప్పారు. 



You may be interested

స్థిరంగా ముగిసిన పసిడి

Friday 19th April 2019

శుక్రవారం ఆసియాలో 1.10డాలరు స్వల్ప లాభంతో 1,277.90 డాలర్ల వద్ద క్లోజయ్యింది . గత రాత్రి న్యూయార్క్‌ ట్రేడింగ్‌లో పసిడి ధర స్థిరంగా ముగిసింది.నేడు గుడ్‌ఫ్రైడ్‌ సందర్భంగా యూరప్‌, అమెరికా మార్కెట్లు సెలవు కావున అక్కడ పసిడి ట్రేడింగ్‌ జరగదు.  యూరప్‌ తయారీరంగ గణాంకాలు బలహీనంగా నమోదు కావడం పసిడి స్ధిరమైన ముగింపునకు కారణమైంది. అయితే గురువారం రాత్రి అమెరికా డాలరు ఇండెక్స్‌ ర్యాలీ జరిపినా, పసిడి ధర 4నెలల కనిష్టం స్థాయి వద్ద స్థిరంగా ట్రేడయ్యింది. ఇక

విప్రో ఏడీఆర్‌ 3.50శాతం అప్‌

Friday 19th April 2019

అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే మన దేశపు అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌) గురువారం రాత్రి మిశ్రమంగా ముగిశాయి. అత్యధికంగా విప్రో అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌) 3.50శాతం లాభపడింది. టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 2.50శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ అరశాతం చొప్పున పెరిగాయి. మరోవైపు ఐసీఐసీఐ ఏడీఆర్‌ 1శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అరశాతం క్షీణించింది. డోజోన్స్‌ జూమ్‌... మెరుగైన ఆర్థిక గణాంకాల ప్రకటనతో పాటు కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు ఆశించిన

Most from this category