STOCKS

News


పతనం పొంచి ఉంది!

Saturday 13th April 2019
Markets_main1555146334.png-25115

కానీ భారీగా ఉండదు
నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్లు ఈ వారం పోటాపోటీ దశలోకి చేరాయి. అటు బుల్స్‌, ఇటు బేర్స్‌ సమానంగా పోరాటం జరపడంతో సూచీల్లో ఎవరికీ పట్టు చిక్కలేదు. అయితే నిజానికి టెక్నికల్‌గా ఇది కరెక‌్షన్‌ దశని నిపుణులు చెబుతున్నారు. 10600- 11800 పాయింట్ల వరకు అలుపు లేకుండా ర్యాలీ జరిపిన సూచీలు పతనం మూడ్‌లోకి జారాయి. ఇలాంటి పతనాలు గతంలో దాదాపు నెల రోజులపాటు కొనసాగాయి. అందువల్ల తాజా పతనం కూడా మే మధ్య వరకు కొనసాగవచ్చని నిపుణుల అంచనా. అయితే మార్కెట్‌ అంతర్గతంగా మాత్రం చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పతనం ఎంతవరకు అనే అంశాన్ని గట్టిగా చెప్పలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ మే వరకు మాత్రం ఇదే మూడ్‌ ఉండడం మాత్రం ఖాయమంటున్నారు. తాజాగా ఆరంభమైన క్యు4 సీజన్‌ సూచీల్లో మరికొంత అలజడిని తీసుకురావచ్చు. అయితే ఎలాంటి ఆటుపోట్లయినా స్వల్పకాలానికే పరిమితం అవుతాయి. ఇలాంటి దశ చాలా బోరింగ్‌గా ఉంటుందని, ట్రేడర్లు సాధ్యమైనంతవరకు తక్కువగా ట్రేడ్‌ చేయడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు సైతం పేలవంగా ఉండడంతో ట్రేడర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. 
టెక్నికల్స్‌
నిఫ్టీ 11550- 11700 పాయింట్ల మధ్య కన్సాలిడేషన్‌ చెందుతోంది. దిగువ అవధి వద్దకు వచ్చిన ప్రతిసారీ రివ్వున పైకి లేస్తోంది. అయితే చార్టుల్లో నిఫ్టీ తన అప్‌సైడ్‌ ట్రెండ్‌ ఛానెల్‌ దిగువకు వచ్చినట్లు కనిపిస్తోంది. అందువల్ల ఇకపై కరెక‌్షన్‌కే ఎక్కువ ఛాన్సులున్నాయని టెక్నికల్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ దఫా కరెక‌్షన్‌ కాలం పరంగా నెల రోజులున్నా, ధరల పరంగా తక్కువ రేంజ్‌లోనే ముగిసిపోవచ్చని అంచనా. కచ్ఛితమైన స్టాప్‌లాస్‌తో ‘తగ్గినప్పుడు కొను’ సూత్రాన్ని పాటించవచ్చు. ఈ తరుణంలో చాలా మిధ్యా బ్రేకవుట్స్‌ కనిపిస్తుంటాయి. అందువల్ల బ్రేకవుట్స్‌ను నమ్మకుండా రేంజ్‌లో దిగువ అవధి వద్ద కొనుగోళ్లు జరపడం మంచిది. ఫలితాల సీజన్‌లో కొన్ని కంపెనీల ఫలితాలు అప్పుడప్పుడు సూచీలకు ఊపు తీసుకురావచ్చు. ఐటీ సూచీ ట్రిపుల్‌ టాప్‌ ఏర్పరిచినందున ఇకపై అప్‌సైడ్‌ చాలా పరిమితంగా ఉంటుంది. మెటల్స్‌ ధరలు ఒత్తిడిలో ఉన్నందున ఈ రంగ షేర్లకు దూరంగా ఉండడం మంచిది. పై స్థాయిల వద్ద ఎంపిక చేసిన స్టాకుల్లో షార్ట్స్‌' తీసుకోవచ్చు. 


పైవన్నీ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు. ట్రేడింగ్‌కు ముందు సొంత అధ్యయనం మంచిది. You may be interested

టాప్‌ ఫండ్స్‌ మార్చిలో ఏం చేశాయ్‌?

Saturday 13th April 2019

ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి నిధుల ప్రవాహం మార్చిలో ఐదు నెలల గరిష్ఠాన్ని చేరింది. అక్టోబర్‌ తర్వాత తిరిగి మార్చిలో ఫండ్స్‌ భారీగా కొనుగోళ్లను చేపట్టాయి. ఈ నేపథ్యంలో గత నెల టాప్‌ 5 ఎంఎఫ్‌లు వేటిని కొని, వేటిని విక్రయించాయో చూద్దాం.. 1. హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌: ఈ ఫండ్‌ నిర్వహణలో 1.5 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఎక్కువగా ఫైనాన్షియల్స్‌(33 శాతం), యుటిలిటీస్‌, ఇండస్ట్రీస్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. మార్చిలో బీఓబీ, భెల్‌,

స‍్వల్పకాలానికి యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు

Saturday 13th April 2019

షార్ట్‌టర్మ్‌లో 7- 11 శాతం రాబడినందించే నాలుగు స్టాకులను యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రికమండ్‌ చేస్తోంది. 1. అశోక్‌ లేలాండ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 103. స్టాప్‌లాస్‌ రూ. 90. డైలీ చార్టుల్లో కప్‌ అండ్‌ హాండిల్‌ పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించినట్లు చూపుతోంది. బ్రేకవుట్‌ వేళ వాల్యూంలు కూడా బాగున్నాయి. ప్రస్తుతం స్టాకు తన కీలక డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతోంది. ఇండికేటర్లు బుల్లి్‌ష్‌గా ఉన్నాయి. 2. భెల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ.

Most from this category