STOCKS

News


5 నెలలు.. 30-80 శాతం రాబడి..

Saturday 14th July 2018
Markets_main1531543355.png-18308

ఈ ఏడాది జనవరి 29న బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇన్‌ట్రాడేలో 36,443 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ట్రేడర్లు ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోవడంతో అమ్మకాల ఒత్తిడి కారణంగా గత ఐదు నెలలుగా పడుతూ లేస్తూ  వచ్చిన సెన్సెక్స్‌ ఇన్‌ట్రాడేలో గత వారం జూలై 13 శుక్రవారం రోజున మళ్లీ జీవిత కాల గరిష్ట స్థాయి 36,740 పాయింట్లని తాకింది. అంటే జనవరి 29 నుంచి జూలై 12 వరకు చూసుకుంటే సెన్సెక్స్‌లో కొంత పెరుగదల కనిపించింది. అయితే ఇదే కాలంలో బీఎస్‌ఈ 500లోని 22 స్టాక్స్‌ 30-80 శాతం శ్రేణిలో లాభాలను అందించాయి.  
జనవరి 29 నుంచి జూలై 12 మధ్యకాలంలో 50 శాతానికిపైగా లాభాలను అందించింది స్టాక్స్‌లో ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, విమార్ట్‌ రిటైల్‌ ఉన్నాయి. ఇక బ్రిటానియా, అవెన్యూ సూపర్‌మార్కెట్‌, నెస్లె ఇండియా, ఇప్కా, జూబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి స్టాక్స్‌ 30-40 శాతం శ్రేణిలో రాబడులను అందించాయి. 
బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ విషయానికి వస్తే బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, గృహ్‌ ఫైనాన్స్‌, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, వీమార్ట్‌, మైండ్‌ట్రీ, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ వంటి స్టాక్స్‌ 10-100 శాతం శ్రేణిలో ఎగశాయి. ఇక మిడ్‌క్యాప్స్‌ విషయాని వస్తే కేవలం 9 స్టాక్స్‌ మాత్రమే 10-30 శాతం శ్రేణిలో పెరిగాయి. ఎంఫసిస్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బెర్జర్‌ పెయింట్స్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, గ్లాక్సో ఫార్మా, ఎంఆర్‌ఎఫ్‌, మారికో, పీ అండ్‌ జీ హైజీని వంటివి ఇందులో ఉన్నాయి. 
త్వరలో ఆర్‌టైమ్‌ హైకి నిప్టీ!!
నిప్టీ విషయానికి వస్తే ఇది ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి నుంచి 100 పాయింట్ల ఎత్తులో ఉంది. ఫిబ్రవరి 1 నుంచి చూస్తే తొలిసారి గురువారం మళ్లీ 11,000 మార్క్‌ను అధిగమించింది. ఇదే రోజు సెన్సెక్స్‌ ఆల్‌టైమ్ హైకి చేరింది. లిక్విడిటీ, పాజిటివ్‌ సెంటిమెంట్‌ కారణంగా నిఫ్టీ ఈనెలలోనే ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరొచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది ఈ నెలలో జరగకపోతే వచ్చే నెలలో వెళ్లొచ్చని తెలిపారు. టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ సుజుకీ వంటి లార్జ్‌ క్యాప్‌ షేర్లు.. నిఫ్టీ గత 500 పాయింట్ల పెరుగుదలకు కారణమని అభిప్రాయపడ్డారు. ఈ స్టాక్స్‌ నిఫ్టీ 50లో 44 శాతం వెయిటేజ్‌ కలిగి ఉన్నాయి. మే 23 నుంచి చూస్తే.. (అప్పుడు నిఫ్టీ 10,500 పాయింట్లకి దిగువున ఉంది) ఈ స్టాక్స్‌లో సగటున 10 శాతం వరకు వృద్ధి నమోదయ్యింది. 
 You may be interested

ఒప్పొ ‘ఫైండ్‌ ఎక్స్‌’.. ఎందుకంత స్పెషల్‌?

Saturday 14th July 2018

ధర రూ.59,999 స్మార్ట్‌ఫోన్స్‌ ప్రియులు ఇప్పుడు ‘ఫైండ్‌ ఎక్స్‌’ గురించే మాట్లాడుకుంటున్నారు. చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ఒప్పొ దీన్ని ఆవిష్కరించింది. టాప్‌ టెక్‌ ప్రత్యేకతలతో ఈ ఏడాది మార్కెట్‌లోకి వచ్చిన, వస్తోన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో ఇదే టాప్‌ అని చెప్పుకోవచ్చు. ఇందులోని ప్రత్యేకమైన ఫీచర్‌ ఆటోమేటెడ్‌ మోటొరైజ్‌డ్‌ పాప్‌-అప్‌ కెమెరా. ఇందులోనే ఫ్రంట్‌, రియర్‌ కెమెరాలు ఉంటాయి. హ్యాండ్‌సెట్‌ అన్‌లాక్‌ సమయంలో,  కెమెరా యాప్‌ ఓపెన్‌ చేసినా

సెల్లార్‌లో బండరాళ్లొస్తే?

Friday 13th July 2018

  సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ నివాస ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. సెల్లార్‌ తవ్వే క్రమంలో పెద్ద బండరాళ్లు వచ్చాయి. దాన్ని తొలగించేందుకు ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ పనిని మరో సబ్‌–కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు మొదటి కాంట్రాక్టర్‌. పనిముట్లు, కూలీలతో తొలగించలేమని భావించిన సబ్‌–కాంట్రాక్టర్‌ బ్లాస్టింగ్‌ చేయాలని నిర్ణయించుకొని పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి నిర్మాణ స్థలానికి తీసుకొచ్చాడు. అంతే! సమాచారం ఎవరందించారో తెలియదు

Most from this category