STOCKS

News


క్యు3లో ఎఫ్‌ఐఐలు వాటా తగ్గించుకున్న స్టాకులివే!

Thursday 10th January 2019
news_main1547109957.png-23507

మూడోత్రైమాసికంలో ఎఫ్‌ఐఐలు నికర అమ్మకందారులుగా మారారు. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు దాదాపు 29వేల కోట్ల రూపాయల విక్రయాలు జరిపారు. తిరిగి నవంబర్‌, డిసెంబర్‌లో కొంతమేర కొనుగోళ్లు జరిపినా త్రైమాసికం మొత్తానికి అమ్మకాలు ఎక్కువ. క్యు3లో ఎఫ్‌ఐఐలు రూ. 20వేల కోట్ల రూపాయల విక్రయాలు జరిపాయి. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్‌ స్టాకుల నుంచి ఎఫ్‌పీఐలు ఎక్కువగా వైదొలిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 12 కంపెనీల్లో ఎఫ్‌ఐఐలు సుమారు ఒక్క శాతం వాటాకు మించిన షేర్లను విక్రయించాయి. మరోపక్క 7 కంపెనీల్లో దాదాపు ఒక్క శాతం మేర వాటాకు సమానమైన షేర్లను కొన్నాయి. ఎఫ్‌ఐఐలు ఎక్కువగా వైదొలిగిన షేర్లలో రెప్కోహోమ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంకు, సౌత్‌ఇండియన్‌ బ్యాంకు, బీఓబీ, ఎల్‌అండ్‌టీ, భెల్‌, ఇక్రా ఉన్నాయి. 
క్యు2లో రెప్కోహోమ్‌ ఫైనాన్స్‌లో దాదాపు 90 విదేశీ సంస్థాగత మదుపరులకు సుమారు 29.4 శాతం వాటా ఉంది. క్యు3 చివరకు ఈ వాటా 21.4 శాతానికి తగ్గింది. ఈ మూడు నెలల్లో కంపెనీ షేరు దాదాపు 3 శాతం పతనమైంది. సౌత్‌ ఇండియన్‌ బ్యాంకులో ఎఫ్‌ఐఐలు తమ వాటాను 30.2 నుంచి 25.7 శాతానికి తగ్గించుకున్నాయి. యాక్సిస్‌లో వాటాను 50 నుంచి 47. 2 శాతానికి, బీఓబీలో వాటాను 10.4 నుంచి 9.4 శాతానికి తగ్గించుకున్నాయి. ఎల్‌కేపీ ఫైనాన్స్‌లో 1.5 శాతం వాటాను, ఎల్‌అండ్‌టీలో 1.7 శాతం వాటాను, భెల్‌లో 1.5 శాతం వాటాను, ఇక్రాలో 1.9 శాతం వాటాను వదిలించుకున్నాయి. మరోవైపు అనూహ్యంగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో విదేశీ మదుపరులు క్యు3లో వాటాలను కొనుగోలు చేశాయి. 


FPI

You may be interested

ఇన్ఫీ ఫలితాలు ఎలా ఉంటాయి?

Thursday 10th January 2019

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ఈ నెల 11న మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ దఫా లాభాల్లో స్వల్ప మెరుగుదలను కంపెనీ ప్రకటించవచ్చని అంచనాలున్నాయి. అయితే రెవెన్యూ గ్రోత్‌ మాత్రం సరాసరిన 1.5 శాతానికి పరిమితం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. లాభాల్లో వృద్ధి మైనస్‌ 3.8 నుంచి 5.2 శాతం వరకు ఉండొచ్చు. ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు - లాభంలో- 1.7 నుంచి - 3.8 శాతం

ఆగని టాటా మోటార్స్‌ ర్యాలీ

Thursday 10th January 2019

 టాటామోటర్స్‌ షేర్ల ర్యాలీ ఆగడం లేదు. వరుసగా ఐదోరోజూ షేర్లు లాభాల పట్టాయి. బీఎస్‌ఈలో గురువారం మరో 2శాతం ర్యాలీ చేసింది. గతేడాదిలో కంపెనీ తన అనుబంధ సంస్థ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) రికార్డు స్థాయిలో జరిపిన విక్రయాలు.... షేర్ల ర్యాలీకి అండగా నిలిచాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.183.65ల వద్ద ప్రారంభమైంది. జేఎల్ఆర్‌ 2018లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపినట్లు గణాంకాలు వెలువడంతో కంపెనీ

Most from this category