News


ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ దెబ్బ ఎవరికి తగిలేనో?!

Saturday 15th September 2018
Markets_main1537022944.png-20296

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌)రేటింగ్‌ను ఇక్రా తాజాగా జంక్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. దీంతో ఈ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్‌ ఫండ్స్‌తో పాటు వీటికి రుణాలిచ్చిన బ్యాంకులు సైతం ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు ప్రైవేట్‌ బ్యాంకుల కన్నా ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువగా రుణాలిచ్చాయి. ఈ గ్రూప్‌లో ఆర్థిక బలహీనతలు ఇలాగే కొనసాగితే పలు పీఎస్‌బీలకు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పీఎన్‌బీ, బీఓబీ, యూబీఐలు ఈ గ్రూప్‌ కంపెనీలకు ఎక్కువ రుణాలిచ్చాయి. వీటి లోన్‌ బుక్స్‌లో ఈ కంపెనీలకు ఇచ్చిన రుణాల వాటా 100 బీపీఎస్‌ వరకు ఉంది. మరోవైపు ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐలకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈబ్యాంకులు చాలా స్వల్ప మొత్తాల్లో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు రుణాలిచ్చాయి. ఇక్రా తాజాగా రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఈ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన 35 ఎంఎఫ్‌లపై భారం పెంచింది. అయితే బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో కేవలం విద్యుత్‌ రంగానికి చెందినవి తప్ప మిగిలినవి ఎన్‌పీఏలుగా మారకపోవచ్చని నోమురా అభిప్రాయపడింది. గ్రూప్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాల్లో పీఎస్‌బీల వాటా 70 శాతం కాగా ప్రైవేట్‌ బ్యాంకుల వాటా 10 శాతంగా ఉంది. మిగిలినవి బడా సంస్థల నుంచి తీసుకున్న రుణాలు. ప్రస్తుతం ఈ గ్రూప్ కంపెనీలన్నింటి నెత్తినా కలిపి దాదాపు 91 వేల కోట్ల రూపాయల రుణ భారం ఉంటుందని అంచనా, ఇందులో బ్యాంకులిచ్చిన రుణాలు దాదాపు 57 వేల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. 
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు రుణాలిచ్చిన బ్యాంకులు, రుణ మొత్తాలు ఇలా ఉన్నాయి...You may be interested

పదేళ్లలో పదివేల శాతం రాబడులను ఇచ్చిన స్టాక్స్‌

Monday 17th September 2018

స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించి పెట్టుబడి నాడి తెలిస్తే సామాన్యులు సైతం కుబేరులవుతారనడానికి ఎన్నో ఉదాహరణలు, నిదర్శనాలు ఉన్నాయి. ఎవరినో చూసి ఫాలో అయిపోకుండా తెలివైన ఇన్వెస్టర్లు పూర్తి అవగాహనతో, సరైన అడుగులు వేస్తే స్టాక్‌ మార్కెట్లో మంచి రాబడులనే సమకూర్చుకోవచ్చు. ఇందుకు ఈ స్టాక్సే నిదర్శనం.   2008లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు పెద్ద పతనా‍న్ని చవిచూశాయి. ఇన్వెస్టర్ల సంపదలో 40 శాతం ఆవిరైపోయింది. లెహమాన్‌ బ్రదర్స్‌ 2008లోనే దివాలా తీసింది. దాంతో

ఉపశమించిన వాణిజ్యలోటు

Saturday 15th September 2018

భారత వాణిజ్యలోటు ఆగస్టులో కాస్త తగ్గింది. అంతకుముందు ఐదేళ్ల గరిష్టానికి చేరిన వాణిజ్యలోటు ఆగస్టులో దిగివచ్చి 1739 కోట్ల డాలర్లకు చేరింది. జూలైలో ఈ లోటు 1800 కోట్ల డాలర్లుగా నమోదయిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో వాణిజ్యలోటు 1272 కోట్ల డాలర్లుగా ఉంది. రూపీలో రీబౌండ్‌ కనిపించి, బాండ్‌ ఈల్డ్స్‌ చల్లబడ్డ తరుణంలో వాణిజ్యలోటు కాస్త ఉపశమించడం ప్రభుత్వానికి ఊరటనిచ్చేఅంశంగా నిపుణులు భావిస్తున్నారు.  గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో మొత్తం

Most from this category