STOCKS

News


ప్రస్తుతం ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు...?

Monday 6th August 2018
Markets_main1533556011.png-18983

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి, ఏ రంగం మార్కెట్‌ తదుపరి ర్యాలీలో పాల్గొంటుంది? అన్న సందేహాలు ఇన్వెస్టర్లకు రావచ్చు. దీనికి మార్కెట్‌ నిపుణులు బ్యాంకింగ్‌ స్టాక్స్‌ను సూచిస్తున్నారు. 

 

కార్పొరేట్‌ ఫలితాల్లో రికవరీ కొనసాగుతుంది

ఐటీ స్టాక్స్‌, ఫార్మా, బ్యాంకింగ్‌ ఇలా పలు రంగాలు ప్రస్తుతం పెట్టుబడులకు ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో ఇన్వెస్టర్లలో అయోమయం నెలకొంది. గత నెలలో రికార్డు స్థాయిలకు చేరిన మార్కెట్లలో అదే మూమెంటమ్‌ ఈ నెలలోనూ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ ర్యాలీ కూడా చాలా స్వల్ప సెషన్లలో జరిగిందే. ఇన్వెస్టర్లు ఆ అవకాశం అందిపుచ్చుకునే లోపే శిఖర స్థాయిలకు వెళ్లిపోయాయి. నిజానికి మార్కెట్ల ర్యాలీ ముగిసిపోలేదని, ఇకపై ర్యాలీ చేసే రంగాలను ఇన్వెస్టర్లు గుర్తించడమే కీలకమంటున్నారు విశ్లేషకులు. ‘‘ఇకపై మార్కెట్‌ రాబడులన్నవి కార్పొరేట్‌ ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. 2018-19, 2019-20 సంవత్సరాల్లో కార్పొరేట్‌కంపెనీల ఫలితాల్లో వృద్ధి రికవరీ ఉంటుందని అంచనా వేస్తున్నాం. గతంలో పనితీరు నిదానించిన రంగాల్లో ఇది ఉంటుందని అంచనా’’ అని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ సీఐవో సంపత్‌రెడ్డి వివరించారు. ఐటీ, ప్రైవేటు ఫైనాన్షియల్స్‌, వినియోగ రంగాల్లోని స్టాక్స్‌ పట్ల సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. రూపాయి బలహీనత వల్ల ఐటీ రంగానికి ప్రయోజనకరంగా ఆయన పేర్కొన్నారు. రుణాల వృద్దితో ప్రైవేటు ఫైనాన్షియల్స్‌ రంగం లబ్ధి పొందుతుందన్నారు. 

 

ఐడియల్‌ పోర్ట్‌ఫోలియో

ఏ రంగానికి చెందిన స్టాక్స్‌ ఎంచుకోవాలన్నది ఇన్వెస్టర్ల రిస్క్‌ ప్రొఫైల్‌, ఎంత కాలానికి అనే అంశాలపైనా ఆధారపడి ఉంటుంది. అలాగే, వ్యక్తులను బట్టి కూడా మారిపోతుంది. అయితే, మొత్తం మీద ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియో కోసం ఎక్కువ శాతం పెట్టబడులను బ్యాంకులు, ఆ తర్వాత ఇన్సూరెన్స్‌ స్టాక్స్‌, ఏఎంసీలు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు, ఫార్మా, వినోద రంగ కంపెనీలకు కేటాయించుకోవచ్చని నిపుణుల సూచనలు. ‘‘కార్పొరేట్‌ ఫలితాల్లో రికవరీతోనే మార్కెట్లు పైకి వచ్చేశాయి. కన్జ్యూమర్‌ విభాగం పుంజుకుంది. రూపాయి క్షీణతతో ఐటీ రంగం లాభపడింది. ప్రైవేటు ఫైనాన్షియల్‌ కంపెనీల్లో చాలా వరకు అంచనాలకు అనుగుణంగా, మెరుగైన ఫలితాలను ప్రకటించాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పీసీజీ హెడ్‌ వీకే శర్మ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లకు చక్కని పోర్ట్‌ఫోలియో కింద 30 శాతం బ్యాంకింగ్‌లో, 10 శాతం ఇన్సూరెన్స్‌, 10 శాతం ఏఎంసీ, 20 శాతం ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో, 15 శాతం ఫార్మా కంపెనీల్లో, మిగిలిన మేర వినోదం, రిటైల్‌ విభాగాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు’’ అని శర్మ సూచించారు. 

 

40 శాతం బాండ్స్‌కు

30-40 ఏళ్ల వయసు వారు అయితే పోర్ట్‌ఫోలియోలో 60 శాతం ఈక్విటీలకు కేటాయించుకోవచ్చుంటున్నారు విశ్లేషకులు. అలాగే, కొంత మేర బాండ్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ‘‘అంతర్జాతీయంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, త్రైమాసిక ఫలితాల వృద్ధితో అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. అధిక శాతం కరెక్షన్‌కు అవకాశం ఉంది. అయితే, అది ఎప్పుడొస్తుందన్నది సమయమే చెబుతుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌ మోదీ తెలిపారు. రికార్డు స్థాయిల్లో మార్కెట్లు ట్రేడవుతున్న ఈ తరుణంలో 40 శాతం పెట్టుబడులను బాండ్స్‌కు కేటాయించుకోవాలని, ఈక్విటీల్లోనూ 30 శాతం మేర లార్జ్‌క్యాప్స్‌కు, 15 శాతం స్మాల్‌క్యాప్‌, 15 శాతం మిడ్‌క్యాప్‌కు కేటాయించుకోవడం సరైన వైవిధ్యం అవుతుందన్నారు.You may be interested

బీమా కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించే ముందు...!

Monday 6th August 2018

ఇంటర్నెట్‌ వినియోగించే వారికి బీమా పాలసీల ప్రకటనలు కనిపించడం సహజం. ప్రతి రోజూ కేవలం రూ.11కే ఇంత మొత్తం బీమా పాలసీ అనేది ఆ ప్రకటనలో ఉంటుంది. క్లిక్‌ చేస్తే అక్కడి నుంచి మీరు మరో పోర్టల్‌కు వెళతారు. వివిధ బీమా సం‍స్థల పాలసీలు, వాటిలో ఉన్న ఫీచర్లు, ప్రీమియం తదితర వివరాలు అందించే సైట్లు అవి. ఈ వివరాలు తెలుసుకునే ముందు తమ పేరు, మొబైల్‌ నంబర్‌, ఈ

సంవత్సరాంతానికి 1,300 డాలర్లకు పసిడి

Monday 6th August 2018

 ఈ ఏడాది కాలంగా చూస్తే పుత్తడి ధరలు బాగా పడిపోయాయి. ఇక నుంచి పసిడి ధరలు పడిపోయే అవకాశం లేదని, పెరుగుతాయని ఐసీబీసీ స్టాండర్డ్‌ బ్యాంక్‌ పేర్కొంది. డిసెంబర్‌ నాటికి బంగారం ధర ఔన్స్‌కు 1,300 డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది. ‘మూడో త్రైమాసికంలో బులియన్‌ ధర సగటున ఔన్స్‌కు 1,260 డాలర్లుగా ఉండొచ్చు. వడ్డీ రేట్ల పెంపు, భౌతికంగా బంగారానికి డిమాండ్‌ పెరగడం కారణంగా అటుపై తర్వాతి మూడు

Most from this category