STOCKS

News


మార్కెట్‌కు మద్దతు ఎక్కడ?

Monday 8th October 2018
Markets_main1539012398.png-20932

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో ఆరంభమైన మార్కెట్‌ పతనాన్ని ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం, క్రూడాయిల్‌ ధర పెరగడం, రూపీ బలహీనత మరింత ప్రేరేపించాయి. దీంతో చూస్తుండగానే స్వల్ప వ్యవధిలో సూచీలు అనూహ్య వేగంతో క్షీణించాయి. గతవారమైతే భారీ గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌లతో సూచీలు అతలాకుతలం అయ్యాయి. ప్రస్తుత పతనం ఇప్పట్లో ఆగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎఫ్‌పీఐలు నికర విక్రయదారులుగా మారి విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. యూఎస్‌లో వడ్డీరేట్లను పెంచడంతో విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను అటువైపు మరలిస్తున్నారు. దీంతో దేశీయ సూచీలు నష్టాల్లో విలవిలలాడుతున్నాయి. గతంలో ఎఫ్‌పీఐ అమ్మకాలు వెల్లువెత్తినప్పుడల్లా ఎంఎఫ్‌లు, దేశీయ సంస్థాగత మదుపరులు ముందుకొచ్చి మార్కెట్‌కు మద్దతునిచ్చారు. కానీ ఈ సారి దేశీయంగా లిక్విడిటీ కష్టాలు ముదరడంతో దేశీయ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదుకునే నాధుడు లేక సూచీలు పాతాళానికి పయనమవుతున్నాయి. రెండు నెలల్లో దేశీయ సూచీలు దాదాపు 12 శాతం పైన పతనమయ్యాయి. కరెక‌్షన్‌ నిర్వచనం ప్రకారం ఇప్పటికే మార్కెట్లు ఈ జోన్‌లోకి ప్రవేశించాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పతనం మరికొన్ని నెలలు కొనసాగవచ్చని అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీకి 9900 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌కు 32500 పాయింట్ల వద్ద మద్దతు దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. నగదు లభ్యత మెరుగుపడి ఈక్విటీలకు డిమాండ్‌ పెరిగితే కరెక‌్షన్‌కు తెరపడే అవకాశాలున్నాయన్నారు. చిన్న పాటి పుల్‌బ్యాక్‌ అనంతరం తిరిగి సూచీల్లో పతనం కొనసాగే అవకాశాలే ఎక్కువని అభిప్రాయపడుతున్నారు. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని సలహా ఇస్తున్నారు. 



You may be interested

గతేడాది హీరోలు.. ఈ ఏడాది జీరోలు..

Monday 8th October 2018

మార్కెట్లలో ప్రస్తుతం వచ్చిన కరెక‌్షన్‌ను నిపుణులు ఎప్పటినుంచో అంచనా వేస్తున్నారు. గత మూడు నెలలుగా కేవలం ఐదారు స్టాకుల కారణంగా సూచీలు పైపైకి పోయాయి. ఈ పెరుగుదల నిలిచేది కాదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. పడేందుకు వంక కోసం చూస్తున్న మార్కెట్లకు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం కలిసివచ్చింది. అటుపై ఎన్‌బీఎఫ్‌సీల గోల, ముడిచమురు మంట, రూపీ పతనం...  ఇలా అనేక కారణాలు చూపుతూ మార్కెట్లు కుప్పకూలాయి. తాజా పాలసీలో రేట్లను

ఆరు నెలల కోసం పది సిఫార్సులు

Monday 8th October 2018

వచ్చే ఆరేడు నెలల కాలంలో దాదాపు 30 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. చార్ట్‌వ్యూ ఇండియా రికమండేషన్లు 1. అశోక్‌ లేలాండ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 12. స్టాప్‌లాస్‌ రూ. 103. కొన్నిరోజులుగా ప్రధాన సూచీలు బాగా పతనమవుతున్నా, ఈ షేరు మాత్రం స్వల్ప క్షీణతనే నమోదు చేస్తోంది. మానిటరీ పాలసీలో రేట్లు పెంచకపోవడం పాజిటివ్‌ అంశం. రూ. 110 పైన స్థిరంగా కదలాడితే

Most from this category