News


పీ/ఈతో పాటు పీ/ఎస్‌ కూడా అవసరమే!

Saturday 29th September 2018
Markets_main1538218244.png-20717

టెక్నికల్‌ ఎనాలసిస్‌లో కీలకం
మార్కెట్‌తో పరిచయం ఉన్నవారికి పీఈ నిష్పత్తి తెలుసు. పీఈ ఎక్కువగా ఉంటే వాల్యూషన్లు ఎక్కువగా ఉన్నాయని అర్దం. ఒక కంపెనీ వృద్ధి అవకాశాలు పెరిగినా, ఆర్‌ఓఈ పెరిగినా పీఈ పెరుగుతుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పీఈ ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక రంగంలో అఅధిక పీఈ ఉన్న కంపెనీలతో పోలిస్తే అల్ప పీఈ ఉన్న కంపెనీల షేర్లపై మదుపు చేస్తుంటారు. అధిక పీఈ సర్దుబాటు అయ్యేందుకు షేరు ధర పతనం కావడం జరుగుతుంటుంది. ఇవన్నీ లాభదాయక కంపెనీల విషయంలో ఓకే.. కానీ నష్టదాయక కంపెనీల విషయంలో, కొత్త కంపెనీల విషయంలో, పోటీ తక్కువ ఉన్న రంగాలకు చెందిన కంపెనీల విషయంలో, సైక్లిక్‌ మార్పులకు లోనయ్యే రంగాల కంపెనీల షేర్ల విషయంలో పీఈ లెక్క పెద్దగా పనికిరాదు. ఇలాంటి కంపెనీల్లో బాటమ్‌ ఫిషింగ్‌ చేయాలని భావించినప్పుడు ఈవీ- ఎబిటా నిష్పత్తిని చూస్తుంటారు. దీన్ని కన్నా సర్వసాధారణంగా ఉపయోగించే మరో సాధనం పీఎస్‌- ప్రైస్‌ టు సేల్స్‌ నిష్పత్తి.
పీఎస్‌:- కంపెనీ మార్కెట్‌ క్యాప్‌/ కంపెనీ నికర విక్రయాలు.
ఎప్పుడు ఉపయోగం?
పీఈ నిష్పత్తిని మదింపు చేయలేని పరిస్థితుల్లో దీన్ని వాడతారు. అదేవిధంగా పీఈ నిష్పత్తితో పాటు మరింత కచ్ఛితత్వం కోసం కూడా వాడతారు. మల్టీబ్యాగర్లను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. హైగ్రోత్‌, తక్కువ పీఎస్‌ నిష్పత్తి ఉన్న కంపెనీలు భవిష్యత్‌లో మంచి స్టార్లుగా ఎదిగే అవకాశాలుంటాయి. సైక్లిక్‌ రంగాల్లో కంపెనీల షేర్ల పనితీరు పరిశీలనకు వాడతారు. ఈ రంగాల్లో దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌, డౌన్‌ట్రెండ్స్‌ ఉంటాయి. ఇలాంటి సమయంలో పీఈ లెక్క సరిగా ఉపయోగపడదు. కొన్ని సార్లు కంపెనీల విక్రయాలు బాగా ఉండి అవి ఇంకా లాభాలుగా మారి ఉండవు. అలాంటివి త్వరలో మంచి పురోగతి చూపుతాయి. కానీ వీటికి పీఈ సరిగా ఉండదు. ఈకేసులో పీఎస్‌ వాడవచ్చు. కేవలం పీఎస్‌ నిష్పత్తి ఆధారంగా లెక్కలు కట్టి మదుపు చేయడం కూడా మంచిది కాదు. కానీ దీన్ని ఇతర ఇండికేటర్లతో పాటు కలిపి వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయి. You may be interested

ట్రేడింగ్‌ టిప్స్‌ దండగ!

Saturday 29th September 2018

ప్రముఖ అనలిస్టు దీపక్‌ మొహోని   బొంబాయి స్టాక్‌ ఎక్చేంజ్‌ సెన్సిటివ్‌ ఇండెక్స్‌.. తెలుసా మీకు... ఎప్పుడూ వినిపించినట్లు లేదా! పోనీ సెన్సెక్స్‌ తెలుసా.. పైన చెప్పిన పే.. ద్ద పేరును సంక్షిప్తపరిస్తే సెన్సెక్స్‌గా మారింది. ఈ పదాన్ని తొలుత ప్రముఖ అనలిస్టు దీపక్‌ మొహోని వినియోగించగా, బిజినెస్‌ జర్నలిస్టులందరికీ చాలా త్వరగా సుపరిచితమైంది. దేశంలో టెక్నికల్‌ అనాలసిస్‌ చార్టులు, విశ్లేషణలు అందుబాటులోకి తేవడంలో దీపక్‌ పాత్ర ఎంతో ఉంది. స్టాక్‌ మార్కెట్లలో

ర్యాలీల్లో షార్ట్‌ చేయండి!

Saturday 29th September 2018

చార్ట్‌వ్యూ ఇండియా సూచన ఆల్‌టైమ్‌ హై 11760 పాయింట్లను చేరిన తర్వాత ఆగకుండా దాదాపు 8 శాతం మేర నిఫ్టీ పతనమైంది. ఈ నేపథ్యంలో సూచీల్లో కొంతమేర పుల్‌బ్యాక్‌ ర్యాలీ రావచ్చని చార్ట్‌వ్యూ ఇండియా అంచనా వేసింది. అందువల్ల కనిష్ఠస్థాయిల్లో షార్ట్‌ చేయవద్దని, కాస్త పెరిగిన సమయాలను షార్ట్‌ చేయడానికి వినియోగించుకోవాలని సూచించింది. 10866 పాయింట్ల వద్ద నిఫ్టీకి కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోందని విశ్లేషించింది. ఈ స్థాయిని రెండు మార్లు

Most from this category