STOCKS

News


రెండు అంశాలూ మెరుగుపడితేనే బుల్లిష్‌!

Thursday 6th September 2018
Markets_main1536227714.png-20020

మోర్గాన్‌స్టాన్లీ
భారత మార్కెట్లపై స్వల్ప అప్రమత్తతతో ఉన్నామని మోర్గాన్‌స్టాన్లీ ప్రతినిధి స్వనంద్‌ కేల్కర్‌ చెప్పారు. ఎకానమీలో కీలకమైన రెండు అంశాలు మెరుగుపడితేనే తమ ధృక్పథం బుల్లిష్‌గా మారుతుందని వివరించారు. రూపీ క్షీణత, క్రూడయిల్‌ పెరుగుదలకు చెక్‌ పడడం, స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగుపడడం.. అనే రెండు అంశాల పురోగతి ఆధారంగా బుల్లిష్‌గా మారతామని చెప్పారు. కనీసం రెండు మూడునెలలైనా క్రూడ్‌, రూపీ ప్రధానాంశాలుగా లేకుండా పోవాలన్నారు. అప్పుడే నిర్మాణాత్మకంగా ఆలోచించగలమని చెప్పారు. భారత వృద్ధి గాధ బలంగా ఉన్నా, స్థూల ఆర్థిక అంశాలైన విత్తలోటు, క్యాడ్‌, ద్రవ్యోల్బణం లాంటివి క్రమంగా ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పారు. ప్రస్తుత స్థూల ఆర్థిక వాతావరణం ఆశావహంగాలేదన్నారు. భారత్‌లో తమకు దాదాపు 300 కోట్ల డాలర్ల పెట్టుబడులున్నాయని తెలిపారు. భారత్‌లో ఎకానమీ మంచి ప్రదర్శన చూపుతోందని, అయితే పైన పేర్కొన్న అంశాలు స్థిరీకరణ చెందాలని చెప్పారు. భారత మార్కెట్లలో రికార్డు ర్యాలీ తమకు నమ్మకాన్ని కలిగించలేకపోయిందన్నారు. ఈ ర్యాలీని బుల్‌ గర్జనలుగా చెప్పలేమని, ఇది చాలా పెళుసు ర్యాలీ అని చెప్పారు. కేవలం కొన్ని స్టాకుల మద్దతుతో ఈ ర్యాలీ వచ్చిందన్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లు ఇక్కడిక్కడేకదలాడుతాయని అంచనా వేశారు. అయితే చాలా మంది ఇన్వెస్టర్లు మాక్రోఎకనమిక్‌ ఇష్యూలను పట్టించుకోకుండా క్రమంగా తమ పోర్టుఫోలియోలను నిర్మించుకుంటున్నారన్నారు. ఇలాంటి తరుణంలో బాటమ్‌ అప్‌ విధానాన్ని అవలంబించాలని  సూచించారు. కనీసం 15 శాతం ఎర్నింగ్స్‌ వార్షిక వృద్ది నమోదు చేసే కంపెనీలను ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. ఈ తరుణంలో రంగాలవారీగా ఎంచుకోవాల్సిన పనిలేదని, ఏ రంగంలోనైనా మంచి వృద్ధి ఉన్నవాటిని పరిశీలించాలని చెప్పారు. You may be interested

రూపీ సరైన రేంజ్‌ ఎంత?

Thursday 6th September 2018

69-72 అంటున్న ఆదిత్య పురి అగ్రికల్చర్‌ పాలసీ, గవర్నమెంట్‌ డిజిటలైజేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి వంటి వాటి వల్ల మరింత మెరుగైన వృద్ధి నమోదవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ ఆదిత్య పురి తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న కాలంలో ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్‌ బలపడటం వంటి తాత్కాలిక అవరోధాలు కనిపిస్తున్నాయని తెలిపారు. అయితే వీటివల్ల దీర్ఘకాల వృద్ధి అవకాశాలకు వచ్చిన ముప్పేమీ

ఐదు దిగ్గజ షేర్లపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 6th September 2018

అంతర్జాతీయ ప్రముఖ బ్రోకరేజ్‌లు ఐదు దేశీయ బడా కంపెనీల షేర్లపై బుల్లిష్‌గా ఉన్నాయి. వివరాలు.. 1. ఆర్‌ఐఎల్‌: సీఎల్‌ఎస్‌ఏ సంస్థ కొనొచ్చు రేటింగ్‌ను రూ. 1500 టార్గెట్‌ను ఇచ్చింది. బహుళార్ధసాధక వ్యూహం ఆర్‌ఐఎల్‌కు లాభించనుందని, దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తుందని తెలిపింది. జియోతో మరింత మార్కెట్‌ విస్తృతిని చేరుతోందని తెలిపింది. 2. భారత్‌ ఫోర్జ్‌: క్రెడిట్‌ సూసీ సంస్థ అవుట్‌ పెర్ఫామ్‌ రేటింగ్‌ను రూ. 750 టార్గెట్‌ను ఇచ్చింది. రూపీ పతనంతో కంపెనీకి చాలా

Most from this category