STOCKS

News


బంధన్‌బ్యాంక్‌పై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయ్‌?

Tuesday 8th January 2019
news_main1546931646.png-23462

గృహ్‌ ఫైనాన్స్‌ను విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బంధన్‌ బ్యాంక్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 2 శాతం పతనమయ్యాయి. ఈ విలీనంపై బ్రోకరేజ్‌ సంస్థలు న్యూట్రల్‌గా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బ్యాంకు రేటింగ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని బ్రోకరేజ్‌లు తెలిపాయి. అయితే ఒప్పంద అనంతరం ఇరు కంపెనీల సమన్విత సహవాసంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గృహ్‌ ఫైనాన్స్‌ క్రమానుగతంగా లాభదాయక కంపెనీగా ఎదిగింది. అందువల్ల దీన్ని కొనుగోలు చేయడం బంధన్‌కు మంచిదేనని నిపుణుల అభిప్రాయం. దీంతో పాటు బంధన్‌బ్యాంకు ఎక్కువగా తూర్పు భారతంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, గృహ్‌ ఫైనాన్స్‌ ఎక్కువ పశ్చిమ భారతంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ రెండిటి కలయికతో రెండు ప్రాంతాలను కవర్‌ చేసే అవకాశం కలగనుంది.

విలీన నేపథ్యంలో బంధన్‌ బ్యాంకుపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి..
1. మాక్కై‍్వరీ: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 540. గృహ్‌ ఫైనాన్స్‌ విలీనం మైనార్టీ స్టాక్‌హోల్డర్ల దృష్ట్యా మంచి నిర్ణయం కాదు. ముఖ్యంగా గృహ్‌ ఫైనాన్స్‌కు చెల్లించే ధర అభ్యంతరకరం. ఒప్పందం ప్రకారం ప్రతి వెయ్యి గృహ్‌ షేర్లకు 568 బంధన్‌షేర్లు లభిస్తాయి. దీనివల్ల మైనార్టీషేరు హోల్డర్లకు సరైన న్యాయం జరగదు. విలీనానంతరం బంధన్‌లో ప్రమోటర్ల వాటా 82.3 శాతం నుంచి 61 శాతానికి దిగిరానుంది. 
2. జేపీ మోర్గాన్‌: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 525. గృహ్‌ కొనుగోలు చాలా ఖరీదైనది. విలీనానంతరం ఇరు కంపెనీల సమన్విత సహవాసం సులభం కాకపోవచ్చు. అయితే విలీనంతో కంపెనీ మైక్రోఫైనాన్స్‌, రూరల్‌ హౌసింగ్‌ రంగాల్లో అగ్రగామిగా మారుతుంది. దీంతో వాల్యూషన్లు పెరుగుతాయి. విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీకి ఎక్కువ ప్రయోజనం దక్కుతుంది. సంయుక్తకంపెనీలో హెచ్‌డీఎఫ్‌సీకి దాదాపు 15 శాతం వాటా ఉంటుంది. ఆర్‌బీఐ ఆంక్షల నుంచి తప్పించుకుని ప్రమోటర్‌ వాటా తగ్గించుకునేందుకు ఈ కొనుగోలు బంధన్‌కు ఉపకరిస్తుంది. 
3. మోతీలాల్‌ ఓస్వాల్‌: విలీనంతో గృహ్‌లో వాటాలను మంచి లాభాలకు అందుకునే అవకాశం హెచ్‌డీఎఫ్‌సీకి లభిస్తుంది. కేవలం 5 శాతా వాటా విక్రయించినా హెచ్‌డీఎఫ్‌సీకి దాదాపు రూ. 4వేల కోట్లు వస్తాయి. విలీనం ఖరీదు కాస్త ఎక్కువే.
4. ఫిలిప్‌ క్యాపిటల్‌: విలీనం తర్వాత సంయుక్త కంపెనీ ఆర్‌ఓఏ కుంచించుకుపోవచ్చు. గృహ్‌ కొనుగోలు బంధన్‌కు ఖరీదైన డీల్‌. ఆర్‌బీఐ నియమావళికి అనుగుణంగా ప్రమోటర్‌ వాటా ఆశించిన స్థాయికి దిగిరాదు. నియమాలను అందుకునేందుకు బ్యాంకు ప్రమోటర్లు మరింత వాటా తగ్గించుకోవాల్సి ఉంది. రుణాల పరంగా విలీనం బంధన్‌కు మేలు చేయవచ్చు. You may be interested

ఈ స్టాకుల్లో ఎంఏసీడీ బేరిష్‌ సిగ్నల్స్‌

Tuesday 8th January 2019

సోమవారం ముగింపు ప్రకారం 60 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారినకంపెనీల్లో ఐబీ హౌసింగ్‌. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, టాటా ఎలెక్సి, ఎల్‌ఐసీ హౌసింగ్‌, రైన్‌ ఇండస్ట్రీస్‌, విజయా బ్యాంక్‌, గృహ్‌ ఫైనాన్స్‌, వొక్‌హార్డ్‌, ఎంసీఎక్స్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, సీపీసీఎల్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, పీఎన్‌బీ గిల్ట్స్‌ తదితరాలున్నాయి.

మూడు రంగాలపై కోటక్‌ బుల్లిష్‌

Tuesday 8th January 2019

వచ్చే 2- 5 సంవత్సరాల కాలానికి క్యాపిటల్‌గూడ్స్‌, రైల్వే, నిర్మాణం మరియు రియల్టీ రంగాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ మేనేజర్‌ అన్షుల్‌ సైగల్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఏదో చేసేయాలన్న ఆతృతలేకుంటే వీటిలో మంచి కంపెనీల షేర్లు ఎంచుకొని రెండు నుంచి ఐదేళ్లు వేచిచూడాలని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో కొన్ని షేర్లు అత్యంత ఆకర్షణీయ వాల్యూషన్ల వద్ద కనిపిస్తున్నాయని చెప్పారు. గత కొన్నాళ్లుగా రియల్టీ పలు

Most from this category