STOCKS

News


‘యస్‌ బ్యాంకు’ విషయంలో ముందున్న మార్గం?

Friday 21st September 2018
Markets_main1537554030.png-20456

యస్‌ బ్యాంకు విషయంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ గాయపడినట్టు శుక్రవారం నాటి పతనం తెలియజేస్తోంది. బ్యాంకు సీఈవో, ఎండీగా రాణా కపూర్‌ పదవీకాలాన్ని వచ్చే ఏడాది జనవరికి ఆర్‌బీఐ తగ్గించడం ఈ పరిస్థితికి కారణం. ఇంట్రాడేలో 34 శాతం పతనమై 210.10 స్థాయిల వరకు వెళ్లింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి. అంతేకాదు కొన్ని సంవత్సరాల కనిష్ట స్థాయి కూడా. చివరికి 28 శాతం నష్టంతో బీఎస్‌ఈలో రూ.227.05 వద్ద క్లోజయింది. ఆర్‌బీఐ నిర్ణయంతో పలు అంతర్జాతీయ, దేశీయ బ్రోకరేజీ సంస్థలు యస్‌ బ్యాంకు టార్గెట్‌ను తగ్గించడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపించింది. 

 

యస్‌ బ్యాంకు ఆరంభం నుంచి నేటి వరకూ రాణా కపూరే సారథ్యం వహిస్తున్నారు. అద్భుత పనితీరు, లాభదాయకతతో దేశంలో నాలుగో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు స్థాయికి తీసుకెళ్లారు. ఆయన పదవీకాలం గత నెలతో ముగిసిపోగా, మరో మూడేళ్లకు ఆయన పదవీకాలాన్ని బ్యాంకు పొడిగించింది. ఇందుకు వాటాదారులు సైతం ఆమోదం తెలిపారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఆర్‌బీఐ నిర్ణయం వెలువడింది. రాణా కపూర్‌ తప్పుకుంటే ఇప్పటి వరకు ఉన్న బలమైన పనితీరును బ్యాంకు కొనసాగిస్తుందా అన్న ఆందోళన నెలకొన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ నెల 25న బ్యాంకు బోర్డు సమావేశమై ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే, దీర్ఘకాలానికి ఈ స్టాక్‌లో ఇన్వెస్టర్లకు మంచి విలువ సమకూరుతుందని ఫిలిప్‌ క్యాపిటల్‌ అభిప్రాయపడింది. కొనుగోలుకు సిఫారసు చేస్తూ రూ.460 టార్గెట్‌ ఇచ్చింది. 

 

‘‘ఆర్‌బీఐ వార్షిక ఆడిట్‌లో బ్యాంకులకు సంబంధించి అంతరాలు బయటపడ్డాయి. యస్‌ బ్యాంకు 2016-17కు రూ.6,355 కోట్ల తేడాలను చూపించింది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. తాజా పరిణామాల వెనుక ఇది కూడా కీలక కారణంగా పేర్కొంది. ‘‘అయితే, ప్రతిదీ స్టాక్‌కు ప్రతికూలమేనా అంటే కాకపోవచ్చు. గతంలో ఈ తరహా ప్రతికూల సందర్భాల్లో స్టాక్‌ ప్రతికూలంగానే స్పందించింది. ఆ తర్వాత ఏడాది కాలంలో స్టాక్‌ పనితీరు అద్భుతంగా ఉంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ వివరించింది. ‘‘చారిత్రకంగా చూస్తే యస్‌ బ్యాంకు స్టాక్‌ పోటీ సంస్థలతో పోలిస్తే తక్కువకే ట్రేడ్‌ అవుతోంది. ఆర్‌బీఐ చర్య అన్నది బ్యాంకులో కీలక పదవీ మార్పును సూచిస్తోంది. మరో వ్యక్తి వచ్చి దీన్ని నడిపించొచ్చు’’ అని ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ కృష్ణ కుమార్‌ కర్వ తెలిపారు. బలమైన బ్యాంకులో ఈ తరహా కరెక్షన్‌ కారణంగా విలువలు ఆకర్షణీయంగా మారాయని, దీర్ఘకాలం కోసం మంచి అవకాశమని ఆయన సూచించారు.
 You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Saturday 22nd September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 25 పాయింట్ల లాభంతో 11,197 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11,166 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కాగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు

మంచి స్టాక్స్‌ను పట్టుకునే అవకాశం ఇదే...

Friday 21st September 2018

స్టాక్‌ మార్కెట్లలో శుక్రవారం సాగిన తీవ్ర ఆటుపోట్లు, నష్టాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకుపైగా పతనం కావడం, నిఫ్టీ-50 11,346 స్థాయి నుంచి 10,866 స్థాయి వరకూ పడిపోవడంతో ఏం జరుగుతుందోనన్న కంగారు ఏర్పడింది. ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల్లో విస్తృత అమ్మకాలే మార్కెట్‌ సెంటిమెంట్‌ను గాయపర్చాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కమర్షియల్‌ పేపర్లపై వడ్డీ చెల్లింపులు విఫలం కావడంతో, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ తదితర ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలపైనా సందేహాలు

Most from this category