News


లుపిన్‌, జేఎస్‌డబ్ల్యూ విషయంలో ఏం చేయవచ్చు?

Tuesday 11th September 2018
Markets_main1536604811.png-20134

నిఫ్టీ50లోకి కొత్తగా జేఎస్‌డబ్ల్యూ రానుండగా, దీనికి బదులు సూచీ నుంచి లుపిన్‌ బయటకు వెళ్లిపోనుంది. ఈ నెల 28 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అనుసరించాల్సిన విధానం ఏమిటో నిపుణుల సూచనల ఆధారంగా తెలుసుకుందాం.

 

ఆగస్ట్‌ 28న నిఫ్టీ ఇండెక్స్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 10 శాతం వరకు ర్యాలీ చేసింది. అయితే, ఇదంతా తాత్కాలిక ప్రభావమే కానీ, వాటి ఫండమెంటల్స్‌ విషయంలో ఏ విధమైన మార్పులు ఉండబోవని నిపుణులు చెబుతున్నారు. ట్రేడింగ్‌ వ్యాల్యూమ్‌, ఫ్రీ ఫ్లోట్‌, లిక్విడిటీ ఇలాంటి ఎన్నో అంశాల ఆధారంగా స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీల్లో స్టాక్స్‌ మార్పులు, చేర్పులు చేయడం జరుగుతుంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ గత నెలలో 20 శాతం లాభపడగా, ఈ ఏడాది ఇప్పటికే 50 శాతం ర్యాలీ చేసింది. లుపిన్‌ సైతం గత నెలలో 14 శాతం ర్యాలీ చేయగా, ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 5 శాతమే పెరిగింది. నిఫ్టీ50లో మార్పుల తర్వాత కూడా ఈ రెండు స్టాక్స్‌ను ఇన్వెస్టర్లు అట్టే పెట్టుకోవచ్చని, లేదా దీర్ఘకాలం కోసం కొనగోలు చేయవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడులు ఇచ్చేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. 

 

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
‘‘జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తున్న స్టీల్‌ కంపెనీ. అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలతో పోటీ పడుతోంది. ఇతర స్టీల్‌ స్టాక్స్‌తో పోలిస్తే ఈ ఏడాది 47 శాతం పెరిగింది. ఇటీవలి త్రైమాసికంలో అంచనాలకు మించి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. బలమైన విక్రయాలతో లాభం నాలుగింతలు పెరిగింది. మొత్తం మీద ఈ కంపెనీ విషయంలో స్వల్ప కాలం నుంచి దీర్ఘకాలానికి సానుకూలంగా ఉన్నాం. సెప్టెంబర్‌ 28 నుంచి నిఫ్టీలో చేరుస్తున్నందున ఇండెక్స్‌ ఫండ్స్‌ ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. రూ.346, రూ.327(100డీఎంఏ) వద్ద బలమైన మద్దతు ఉంది. మొత్తం మీద బుల్లిష్‌గా ఉంది’’ అని మెహతా ఈక్విటీస్‌ రీసెర్చ్‌ ఏవీపీ ప్రశాంత్‌ తాప్సే తెలిపారు. గడిచిన మూడేళ్ల కాలం జేఎస్‌డబ్యూకు మంచి కాలమని, ఈ సమయంలో రూ.95 నుంచి రూ.408 స్థాయికి స్టాక్‌ వృద్ధి చెందిందని ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఏకే ప్రభాకర్‌ చెప్పారు. ఇప్పటికీ ఈ స్టాక్‌ ఆకర్షణీయంగా ఉందని, అయితే తాను మాత్రం దూరంగా ఉంటానన్నారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లో పెట్టుబడులను కొనసాగించొచ్చని, అధిక వ్యాల్యూషన్ల కారణంగా, ఏడాది కాల టార్గెట్‌ రూ.450గా హేమ్‌ సేక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ ఆస్థా జైన్‌ సూచించారు. 

 

లుపిన్‌
‘‘లుపిన్‌ కౌంటర్‌ పట్ల ఆశావహంగా ఉన్నాం. ఇండెక్స్‌ నుంచి తప్పిస్తున్నప్పటికీ ఈ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తుతాయని భావించడం లేదు. ఎందుకంటే నిఫ్టీలో ఈ షేరు వాటా 0.4 శాతంగానే ఉంది. లుపిన్‌ బయటకు వచ్చినా గానీ, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మాలు కలిసి 2.5 శాతం వెయిటేజీతో ఉంటాయి. సాంకేతికంగా చూస్తే అన్ని ఇండికేటర్లు కూడా కొనుగోలుకు సంకేతమిస్తున్నాయి. కీలకమైన రూ.900 నిరోధ స్థాయిని స్టాక్‌ అధిగమించడం సానుకూలం. ఈ స్టాక్‌ నిరోధ స్థాయిలు అయిన రూ.970, రూ.1,090 వరకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నాం. రూ.860, రూ.830 (100డీఎంఏ) వద్ద బలమైన మద్దతు ఉంది’’ అని ప్రశాంత్‌ తాప్సే వివరించారు. నిఫ్టీ నుంచి బయటకు వస్తున్నందున ఈటీఎఫ్‌ ఫండ్స్‌ లుపిన్‌ను విక్రయించే అవకాశం ఉందని ప్రభాకర్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ గరిష్ట స్థాయి రూ.2,129 నుంచి 58 శాతం పడిపోయిన లుపిన్‌ను దీర్ఘకాలం కోసం కొనుగోలు చేయవచ్చని ఆయన సూచించారు. లుపిన్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు కొనసాగొచ్చని, రూ.1,080 టార్గెట్‌ ధరగా ఆస్థాజైన్‌ పేర్కొన్నారు. You may be interested

ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి: నిపుణులు

Tuesday 11th September 2018

రూపాయి ఒకే రోజు 72 పైసలు పతనం కావడం, ఫలితంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం కుప్పకూలడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసేదే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.    11,200 దిశగా నిఫ్టీ... ‘‘నిఫ్టీ ఆరు నెలల్లోనే ఒకే రోజు 1.3 శాతం పతనమైంది. మార్కెట్‌లో లాభపడిన వాటి కంటే నష్టపోయిన షేర్లే ఎక్కువ ఉన్నాయి. స్వల్ప కాల డౌన్‌ ట్రెండ్‌లోకి మార్కెట్‌ ప్రవేశించింది. ఈ పతనం తదుపరి మద్దతు

సూచీలకు రూపాయి షాక్‌..!

Monday 10th September 2018

  నిఫ్టీకి 150 పాయింట్ల నష్టం 38వేల దిగువకు సెన్సెక్స్‌ ముంబై:- సూచీలకు రూపాయి పతనం షాక్‌నిచ్చింది. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు పెరుగుదల, దేశీయ కరెంట్‌ ఖాతా లోటు తగ్గిపోవడం, బాండ్‌ ఈల్డ్‌ నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పాటు బలహీన అంతర్జాతీయ సంకేతాలు సూచీలపై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ఇంట్రాడేలో అటో, బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, మెటల్‌ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల సునామి నెలకొంది. దీంతో మార్కెట్‌ ముగిసే సమాయానికి ప్రధాన

Most from this category