STOCKS

News


కంపెనీ అమ్మకాలు, లాభాలు.. ఏది చూడాలి?

Monday 26th November 2018
Markets_main1543171122.png-22372

ఓ కంపెనీ పనితీరును మదింపు వేసేందుకు ఆ కంపెనీ వ్యాపారం ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం, లాభాలు ఈ రెండూ చాలా కీలకమైన అంశాలవుతాయి. అమ్మకాలు, లాభాలు పెంచుకోవడం అన్నవి వేర్వేరు. ఒకదానితో పోలిస్తే మరొకటి అధికంగా పెరిగినప్పుడు కచ్చితంగా అది చర్చకు తావిస్తుంది. 

 

అమ్మకాలు పెంచుకోవడం అన్నది మార్కెట్‌ వాటా విస్తరణే లక్ష్యమని భావించాల్సి ఉంటుంది. ధరలపై తగ్గింపులు ఇవ్వడం, లేదా తక్కువ ధరలకు వస్తువులను ఆఫర్‌ చేయడం ద్వారా కస్టమర్ల సంఖ్యను పెంచుకోవచ్చు. ప్రారంభంలో ఉత్పత్తి వ్యయానికంటే తక్కువ ధరలకు అమ్ముతూ, ఆ తర్వాత క్రమంగా ధరలను పెంచుతుంటాయి కొన్ని కంపెనీలు. కానీ, ధరలు పెంచిన తర్వాత కస్టమర్లు అదే ఉత్పత్తితో కొనసాగుతారని చెప్పలేం. అదే లాభాలను పెంచుకోవంపై కంపెనీ దృష్టి సారించిందంటే... అందులో ఆదాయం పెంపు, వ్యయ నియంత్రణ చర్యలతో మార్జిన్ల పెంపు చర్యలు భాగంగా ఉంటాయి. అంటే ప్రకటనల వ్యయాలు లేదా ప్రచారంపై వ్యయాలు తగ్గించుకోవచ్చు. ఉత్పత్తి వ్యయాలు తగ్గించుకోవడం, రుణాల పునర్‌వ్యవస్థీకరణ చర్యలు కూడా కావచ్చు. ఈ తరహా చర్యలు స్వల్ప కాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ, దీర్ఘకాలంలో వ్యయ నియంత్రణ చర్యల కారణంగా ఉత్పత్తిపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. బ్రాండ్‌, టెక్నాలజీతో మార్కెట్‌లో బలమైన స్థానం, ధరలను అవసరమైతే కస్టమర్లకు బదిలీ చేసే సామర్థ్యం, రుణాలను తగ్గించుకోవడం, లేదా పునరుద్ధరించుకునే కంపెనీలు పెట్టుబడులకు అనుకూలమని చెప్పొచ్చు. ఆపరేటింగ్‌ ఫ్రాఫిట్‌, ఆదాయానికి మించి నికర లాభంలో వృద్ధి ఉన్న కంపెనీలను చూస్తే...

 

ఏసీసీ: సిమెంట్‌, రెడీమిక్స్‌ కాంక్రీట్‌ వ్యాపారంలోని ఏసీసీకి 10వేల మందికిపైగా డీలర్లు దేశవ్యాప్తంగా ఉన్నారు. అరిహంట్‌ క్యాపిటల్‌ ఈ స్టాక్‌ పట్ల సానుకూలంగా ఉంది. మౌలిక రంగంపై ప్రభుత్వం అధికంగా ఖర్చు పెడుతుండడం, ఈ కంపెనీ దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండడం, పశ్చిమ, మధ్య భారతంలో ధరల పెరుగుదల సానుకూలతలు.

క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రికల్స్‌: ఎలక్ట్రికల్‌ ఉత్పత్తుల అమ్మకాల్లోని ఈ కంపెనీ పట్ల ఎస్‌బీఐ క్యాప్‌ రీసెర్చ్‌ బుల్లిష్‌గా ఉంది. నేరుగా ముడి సరుకులను సమీకరించుకోవడం, వ్యయ తగ్గింపు చర్యల ద్వారా ఎబిట్డా మార్జిన్‌ను 4-5 శాతం మేర పెంచుకునే విషయమై కంపెనీ యాజమాన్యం సానుకూలంగా ఉంది. 

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌: స్టీల్‌ ఉత్పత్తుల తయారీలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, 100 దేశాలకు పైగా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ముడి పదార్థాల ధరలు స్థిరపడడం, స్టీల్‌కు స్థిరమైన డిమాండ్‌ కలిసొచ్చే అంశాలు. దీనికి అదనంగా మూలధన నిధుల వ్యయం, ఇటీవలి కొనుగోళ్లు కంపెనీ భవిష్యత్‌ వృద్ధికి ఉపకరిస్తాయి. 

నెస్లే ఇండియా: ఆహారం, పానీయాల విభాగంలో ఉన్న ఈ కంపెనీ 191 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణల పట్ల కంపెనీ చాలా ఆసక్తితో ఉందని, ఇది కంపెనీ భవిష్యత్తు వృద్ధి చోదకంగా పనిచేస్తుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా వేస్తోంది. ధరల విషయంలో కంపెనీకి ఉన్న బలాలు మార్జిన్లు పెంచుకునేందుకు ఉయోగపడతాయి. 

ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌: రబ్బర్‌ పరిశ్రమ వినియోగించే కార్బన్‌ బ్లాక్‌లను ఇది తయారు చేస్తోంది. పరిశ్రమలో వచ్చిన సానుకూలతలను సొంతం చేసుకునే స్థితిలో కంపెనీ ఉందని ఎస్‌కేపీ సెక్యూరిటీస్‌ భావిస్తోంది. దేశీయంగా కార్బన్‌ బ్లాక్‌లకు డిమాండ్‌ పెరగడం, అంతర్జాతీయంగా టైర్ల కంపెనీల విస్తరణ ఈ కంపెనీ వృద్ధికి కలిసొచ్చే అంశాలు. You may be interested

10550 పైన ప్రారంభమైన నిఫ్టీ

Monday 26th November 2018

గతవారం నష్టాల ముగింపు స్వస్తి చెబుతూ మార్కెట్‌  సోమవారం లాభాల్లో ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ భారీ పతనం, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం సూచీలకు కలిసొచ్చింది. ఆసియాలో పలు మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ కూడా ఇన్వెస్టర్లకు ఉత్సాహానిస్తుంది. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 35000 పైన, నిఫ్టీ సూచీ 10,550పైన ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 81.51 పాయింట్ల లాభంతో 35,062.53 వద్ద, నిఫ్టీ 43

ఓపిక ఉన్న వారికే లాభాలు!

Monday 26th November 2018

ఇటీవలి కరెక్షన్‌ సాధారణ ఇన్వెస్టర్ల పట్టుదలను, సహనాన్ని, ఓపికను తెగ పరీక్షించింది. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు చేయకూడని తప్పులే చేస్తుంటారు. మార్కెట్లు పెరిగినప్పుడు పడడం... అలాగే, పడిన తర్వాత తిరిగి పెరగడం అనేవి ఎప్పుడూ జరుగుతుండే ప్రక్రియలేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈక్విటీలు అంటేనే ఆటుపోట్లతో కూడినవని, ఒక్కసారిగా వచ్చి పడే నష్టాలను ఎదుర్కొనేందుకు మార్గాలు ఉన్నాయని మార్కెట్‌ సీనియర్లు చెబుతున్నారు. లాభాలు గడించాలంటే నష్టాలను

Most from this category