STOCKS

News


కరెక‌్షన్‌కు కారణాలేంటి?

Thursday 11th October 2018
Markets_main1539247192.png-21050

ట్రేడ్‌ టెన్షన్లు, వడ్డీరేట్లు, కరెన్సీలే ప్రధాన భయాలు
ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి తర్వాత మార్కెట్లు మహా పతనం చవిచూస్తున్నాయి. డౌజోన్స్‌ ఒక్కరోజులో 830 పాయింట్లకు పైగా పతనమై కీలక 26000 పాయింట్లను కోల్పోయింది. ఈ దెబ్బకు గురువారం అటు జపాన్‌ నుంచి ఇటు యూకే వరకు ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉన్నట్లుండి ఎందుకు మార్కెట్లలో ఇంతభారీ అమ్మకాలు ఆరంభమయ్యాయని సామన్య ఇన్వెస్టర్లు ఆందోళన పడుతున్నాడు. అయితే ఇది ముందు ఊహించిన కరెక‌్షనేనని, వాల్యూషన్లు సర్దుబాటు జరిగే వరకు కరెక‌్షన్‌ ట్రెండ్‌ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ఎకనమిక్‌ పరిస్థితుల్లో ఆందోళనలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. 
ఎందుకీ పతనం...
1. యూఎస్‌ బాండ్‌​ఈల్డ్స్‌: అమెరికా ఎకానమీ బాగా బలోపేతం అవుతున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీంతో యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌' భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల సంవత్సరమంతా కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. బాండ్‌ ఈల్డ్స్'‌ భారీగా పెరిగితే వడ్డీరేట్లు దిగిరావని, అందువల్ల కార్పొరేట్‌ రుణ సమీకరణ మందగిస్తుందన్న భయాలు ఇన్వెస్టర్లలో ఆరంభమయ్యాయి. 
2. రేట్ల పెంపుదల: యూఎస్‌ ఫెడ్‌ క్రమంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతోంది. ఇదే బాటలో పలు కేంద్ర బ్యాంకులు ఉద్దీపనలు ఉపసంహరించి రేట్లను పెంచే దిశగా చర్యలు చేపడుతున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను నెగిటివ్‌గా ‍ ప్రభావితం చేస్తోంది.
3. కరెన్సీ కష్టాలు: యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌తో పాటు డాలర్‌ సైతం భారీగా బలపడిపోతోంది. వర్దమాన దేశాల కరెన్సీలతో పాటు అభివృద్ధిచెందిన దేశాల కరెన్సీలతో పోల్చినా డాలర్‌ బాగా బలపడింది. ఈ నేపథ్యంలో వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఫండ్స్‌ ఉపసంహరణకు దిగాయి. ఇది ఆయా దేశాల కరెన్సీలపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. కరెన్సీల కల్లోలం వాణిజ్యాలపై ప్రభావం చూపుతుందన్న భయాలు ఎక్కువయ్యాయి.  
4. రూపీ రగడ: రూపాయి ఈ సంవత్సరంలో 16 శాతం పతనమైంది. దీనికి క్రూడాయిల్‌ ధర పెరగడం తోడయింది. ఈ రెండూ కలిసి క్యాడ్‌ను కట్టడి తప్పిస్తాయన్న ఆందోళన ముదిరిపోతోంది. రూపీ రక్షణకు ఆర్‌బీఐ రేట్లు పెంచకపోవడం కూడా ఇన్వెస్టర్లలో అసంతృప్తికి కారణమవుతోంది.
5. ట్రేడ్‌ వార్‌: వాణిజ్యయుద్ధంలో ఇరుపక్షాలూ నష్టపోతాయి. ఇది తెలిసి కూడా యూఎస్‌- చైనా పంతాలకు పోయి ప్రపంచ వాణిజ్యాన్ని టెన్షన్‌ పెడుతున్నాయి. ట్రేడ్‌ వార్‌ ప్రభావం దిగ్గజ కంపెనీల ఫలితాలపై పడుతుందన్న భయాలు ఎక్కువయ్యాయి.
6. మందగమనం: ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ప్రపంచ వృద్ది అంచనాలను ఐఎంఎఫ్‌ తగ్గించింది. వాణిజ్య యుద్ధ ప్రభావంతో ప్రపంచ వృద్ధి మందగిస్తుందని ప్రకటించింది. టారిఫ్‌ యుద్ధం పెరిగితే వృద్ధి ఊడ్చిపెట్టుకుపోతుందని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు సైతం ఆందోళన వెలిబుచ్చారు.
7. ఆల్రెడీ మంటలు: ప్రపంచ మార్కెట్లలో కరెక‌్షన్‌కు ముందే దేశీయ సూచీలు భారీ కరెక‌్షన్‌ బాటలో ఉన్నాయి. గత నెల్లో సూచీలు డౌన్‌ట్రెండ్‌నే నమోదు చేశాయి. దీనికితోడు రష్యాతో కుదుర్చుకున్న డీల్‌పై ట్రంప్‌ స్పందన నెగిటివ్‌గా ఉంటుందన్న భయాలు మార్కెట్‌ను కుంగదీశాయి.
8. రాజకీయ ప్రకంపనలు: నవంబర్‌లో కీలక రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. మేలో కేంద్ర ఎన్నికలు రానున్నాయి. ఈ దఫా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందా?లేదా? అన్న సందేహాలు మార్కెట్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం రెండోసారి కొలువుతీరడం ఆనుమానమేనన్న సంకేతాలు మార్కెట్లలో కరెక‌్షన్‌ను ప్రేరేపిస్తున్నాయి. You may be interested

వెలుగులో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు

Thursday 11th October 2018

ప్రపంచమార్కెట్లో నెలకొన్న అమ్మకాల ట్రెండ్‌ భాగంగా మన మార్కెట్‌ భారీగా నష్టపోయినప్పటికీ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నేడు ముడిచమురు ధరలు రెండువారాల కనిష్టానికి చేరుకోవడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లు వెలుగులోకి వచ్చాయి.  కిరోసిన్‌, ఎల్‌పీజీల సబ్సిడీ భారాన్ని చమురు కంపెనీలపై మోపబోమం‍టూ ప్రభుత్వం  తెలిపింది. ఈ నేపథ్యంలో ఎంఓసీ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలోని టాప్‌-5 గెయినర్లలో 5 షేర్లు అయిల్‌ మార్కెటింగ్‌

9900 పాయింట్ల వద్ద కీలక మద్దతు

Thursday 11th October 2018

10550 పాయింట్ల వద్ద నిరోధం నిఫ్టీకి దిగువన 9900- 9950 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉందని బొనాంజ సెక్యూరిటీస్‌ తెలిపింది. ప్రస్తుతం నిఫ్టీ కన్సాలిడేషన్‌ మూడ్‌లో ఉందని అభిప్రాయపడింది. 10200- 10550 పాయింట్ల మధ్యనే నిఫ్టీ తిరగాడవచ్చని అంచనా వేసింది. దిగువన 10200 పాయింట్లను నిలుపుకోలేకుంటే 9900 పాయింట్ల వరకు దిగజారుతుందని తెలిపింది. కన్సాలిడేషన్‌ రేంజ్‌ను బ్రేక్‌ చేస్తేనే తదుపరి కదలికలు నిర్ధారించుకోవచ్చని తెలిపింది. పైస్థాయిలో 10550 పాయింట్లకు పైన

Most from this category