STOCKS

News


విదేశీ ఇన్వెస్టర్లు ఏం కొన్నారు? ఏం అమ్మారు?

Friday 12th October 2018
Markets_main1539337513.png-21091

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌ నెలలో నికరంగా చూస్తే ఈక్విటీ మార్కెట్‌లో విక్రయదారులుగానే మిగిలారు. ఇండియన్‌ మార్కెట్‌ గత రెండు నెలలుగా పడుతూనే వస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ వల్ల తలెత్తిన లిక్విడిటీ భయాలు, క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత వంటి అంశాలు ప్రతికూల ‍ప్రభావం చూపాయి. 
నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ గణాంకాల ప్రకారం చూస్తే.. విదేశీ ఇన్వెస్టర్లు గత నెలలో నికరంగా రూ.10,800 కోట్లు (1.5 బిలియన్‌ డాలర్లు) విలువైన షేర్లను విక్రయించారు. అయితే అదే సమయంలో ఇన్వెస్టర్లు కొన్ని స్టాక్స్‌ను కొనుగోలు కూడా చేశారు. సెప్టెంబర్‌ రెండో అర్ధభాగంలో 91 మిలియన్‌ డాలర్ల విలువైన మెటల్స్‌ అండ్‌ మైనింగ్‌ స్టాక్స్‌ను.. 60 మిలియన్‌ డాలర్ల విలువైన ఫార్మాస్యూటికల్‌ అండ్‌ బయోటెక్నాలజీ షేర్లను కొనుగోలు చేశారు. సెప్టెంబర్‌ తొలి అర్ధ భాగంలో నికరంగా మెటల్స్‌, ఫార్మా షేర్లను విక్రయిస్తే.. రెండో అర్ధభాగంలో నికరంగా ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను కొన్నారు. 
ప్రస్తుత ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుంచి రూ.83,000 కోట్లు వెనక్కు తీసుకెళ్లారు. ఇందులో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.28,000 కోట్లు బయటకు వెళ్లాయి. అమెరికాలో అధిక వడ్డీ రేట్లు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణత, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అధిక క్రూడ్‌ ధరలు, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ భయాల వల్ల ఏర్పడ్డ లిక్విడిటీ ఆందోళనల వల్ల ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. సెప్టెంబర్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6.3 శాతం, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50.. 6.4 శాతం క్షీణించాయి. నిఫ్టీ-50 ఈ సమయంలో దాదాపు రూ.10.5 లక్షల కోట్ల మార్కెట్‌క్యాప్‌ను కోల్పోయింది. ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ స్టాక్స్‌ను ఎక్కువగా అమ్మేశారు. సెప్టెంబర్‌ రెండో అర్ధభాగంలో అర బిలియన్‌ విలువైన షేర్లను విక్రయించారు. నెల మొత్తంగా చూస్తే దాదాపు బిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్స్‌ను అమ్మేశారు. దీని తర్వాత ఆటోమొబైల్స్‌ అండ్‌ ఆటో కాంపొనెంట్స్‌, సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ రంగాలోని షేర్లను ఎక్కువగా విక్రయించారు. 



You may be interested

వెలుగులోకి విద్యుత్‌ షేర్లు

Friday 12th October 2018

విద్యుత్‌ టారీఫ్‌లను పెంచుకునేందుకు ధాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించడంతో విద్యుత్‌  షేర్లు శుక్రవారం వెలుగులోకొచ్చాయి. బీఎస్‌ఈలో పవర్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించిన ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ పవర్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 3శాతం లాభపడింది. విద్యుత్‌ టారీఫ్‌లను పెంచుకోనేందుకు తమ అనుమతినివ్వాలంటూ టాటా, అదానీ పవర్‌ కంపెనీలు గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ను ధాఖలు చేశాయి. నేడు విచారణకు వచ్చిన ఈ పిటిషన్‌పై రెండు వారాల తర్వాత తీర్పున

అనిల్‌ అంబానీ గ్రూప్‌ షేర్ల ర్యాలీ

Friday 12th October 2018

అనిల్‌ అంబానీకి చెందిన ఎడిఎజి(అడాగ్‌) కంపెనీల షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇంట్రాడేలో గ్రూప్‌నకు చెందిన ఐదు కంపెనీల షేర్లు ఒక్క రిలయన్స్‌ డిఫెన్స్‌ మినహా రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్లు 10 శాతం ర్యాలీ చేశాయి. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.305.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 10శాతం పెరిగి రూ.329.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.

Most from this category