STOCKS

News


మందగమనమే అసలు సమస్య!

Saturday 6th April 2019
Markets_main1554546859.png-24996

వచ్చే వారం మార్కెట్‌ రివ్యూ
ఈ వారం నిఫ్టీ ప్రాఫిట్‌ బుకింగ్‌ జోన్‌లోకి ప్రవేశించింది. ఇదే సమయంలో ఆర్‌బీఐ పాలసీ నిర్ణయంతో వృద్ధికి స్థూల అంశాలు సహకరించడం లేదని తెలుస్తోంది. వరుసగా మూడు త్రైమాసికాలుగా ఎకానమీలో మందగమనం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రోత్‌ ఇంజన్లు అలసినట్లున్నాయి. దీంతో పలు కేంద్రబ్యాంకులు ఒక్కమారుగా తమ విధానాన్ని సడలీకరించుకుంటున్నాయి. రేట్ల పెంపు ఆలోచనను పక్కనబెట్టి రేట్‌కట్‌ దిశగా మరలుతున్నాయి. ఇదే తరహాలో ఆర్‌బీఐ కూడా మరో పావు శాతం రేట్‌ కట్‌ ప్రకటించింది. దీంతో సూచీలు అటు సంతోషించాలో, ఇటు భయపడాలో తెలియని పరిస్థితుల్లోకి జారాయి. క్రమంగా వాస్తవాలను సూచీలు జీర్ణించుకుంటున్నాయని, అందువల్ల తాజా వెనకడుగు ఈ వారం కూడా కొనసాగుతుందని నిపుణుల అంచనా. పీఎస్‌యూ, ప్రైవేట్‌ బ్యాంకులు, రియల్టీ, ఇన్‌ఫ్రా, ఎనర్జీ.. ఇలా తాజా బుల్‌రన్‌లో భాగస్వామ్యులైన అన్ని రంగాల్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ ఉండొచ్చు. అయితే షార్ట్‌ చేయాలనుకునేవాళ్లు సరైన రంగాన్ని, సరైన స్టాకులను ఎంచుకోవాలి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఐటీ, ఫార్మా రంగాల్లో పతనం తక్కువగా ఉండొచ్చు. చార్టుల్లో కూడా నిఫ్టీ అలసినట్లు కనిపిస్తోంది. ఆల్‌టైమ్‌ హై వద్ద డబుల్‌ బాటమ్‌ ఏర్పాటు దాదాపు ఖాయంలా ఉంది. ప్రస్తుతం కదలాడుతున్న స్వల్ప రేంజ్‌లో దిగువ అవధిని కోల్పోతే నిఫ్టీలో భారీ పతనం ఉండొచ్చు. 10550 పాయింట్ల దిగువన స్వల్ప శ్రేణి దిగువ అవధి కోల్పోయినట్లు భావించాలి. ఈ స్థాయి దిగువన లాంగ్స్‌ను ఉంచుకోవడం మంచిది కాదని నిపుణుల సలహా. ఒకపక్క ఎర్నింగ్స్‌ సీజన్‌, మరోపక్క ఓటింగ్‌ సీజన్‌ కలగలిసిన సమయమిది. అనేక వార్తలు ఒక్కమాటుగా వస్తుంటాయి. మార్కెట్లలో కదలికలు సైతం అనూహ్యంగా ఉంటాయి. అందువల్ల అత్యంత ఓపికతో వేచిచూడడమే ఉత్తమం. You may be interested

అమిత్‌షాకు షేర్లు.. రాహుల్‌కు ఎంఎఫ్‌లు..

Saturday 6th April 2019

ప్రధాన పార్టీల అధ్యక్షుల పెట్టుబడుల వివరాలు ఎన్నికల సందర్భంగా ప్రతి అభ్యర్ధి తన ఆస్తులు, పెట్టుబడుల వివరాలను బహిర్గతం చేయాల్సిఉంటుంది. ప్రస్తుతం హోరా హోరీగా తలపడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులిద్దరి ఆస్తుల అఫిడవిట్‌లో మార్కెట్‌ మదుపుకు సంబంధించి ఆసక్తికర అంశాలు తెలిశాయి. బీజేపీ ప్రెసిడెంట్‌ అమిత్‌ షాకు సొంతంగా షేర్లలో పెట్టుబడులు పెట్టడం మక్కువ కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రం మూ‍్యచువల్‌ ఫండ్స్‌ ద్వారా మాత్రమే మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు

బ్యాంకు నిఫ్టీ 35వేలకు!

Saturday 6th April 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా ఈ ఏడాది ర్యాలీకి బ్యాంకింగ్‌ రంగమే సారధ్యం వహిస్తోంది. బ్యాంకు నిఫ్టీ చెలరేగిపోవడంతో గత సీరిస్‌లో ప్రధాన సూచీలు సైతం పరుగులు పెట్టాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల జోరు ఏడాది మొత్తం కొనసాగుతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. 2019లో బ్యాంకు నిఫ్టీ 34-35వేల పాయింట్లను చేరుతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సహజ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ సీరిస్‌లో నిఫ్టీకి 11570 పాయింట్ల వద్ద బలమైన మద్దతు

Most from this category