STOCKS

News


మార్కెట్‌ ఎటువైపు?

Monday 17th December 2018
Markets_main1545018559.png-22981

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:54 సమయంలో 36 పాయింట్ల లాభంతో 10,866 పాయింట్ల వద్ద ఉంది. 

♦ అమెరికా.. 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ప్రొడక్టుల దిగుమతులపై టారిఫ్‌ పెంపును మార్చి 2కి వాయిదా వేసింది. కాగా చైనా 200 బిలియన్‌ డాలర్ల ప్రొడక్టులపై జనవరి 1 నుంచి టారిఫ్‌లను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా ఇదివరకు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ పెంపు నిర్ణయాన్ని జనవరి 2కి వాయిదా వేసింది. అమెరికా- చైనా వాణిజ్య చర్చలు వాయిదాకు కారణం. 

♦ చైనా.. అమెరికా నుంచి దిగుమతి అవుతోన్న వాహనాలు, వాహన విడిభాగాలపై అదనంగా విధించిన 25 శాతం టారిఫ్‌లను తాత్కాలికంగా ఎత్తివేయనుంది. జనవరి 1న నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. 

♦ క్రూడ్‌ ధరలు సోమవారం పెరిగాయి. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 51.35 డాలర్ల వద్ద ఉంది. 

♦ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో భారత్‌-22 ఈటీఎఫ్‌ను ఫాలో ఆన్‌ ఆఫర్‌ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 

♦ పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విలువ జనవరి- నవంబర్‌ మధ్య కాలంలో 17.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

♦ దేశీ ఫారెక్స్‌ నిల్వలు డిసెంబర్‌ 7తో ముగిసి వారంలో 16.6 మిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 393.73 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 

♦ ఇండియన్‌ రూపాయి డిసెంబర్‌ 14న అమెరికా డాలర్‌తో పోలిస్తే 22 పైసలు బలహీనపడి 71.90 వద్ద ముగిసింది. 

♦ విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటి దాకా నికరంగా రూ.1 లక్ష కోట్ల నిధులను వెనక్కు తీసుకెళ్లారు. 

♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం లాభాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 39 పాయింట్ల లాభంతో 3,116 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 34 పాయింట్ల లాభంతో 9,807 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 3 పాయింట్ల లాభంతో 2,597 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 3 పాయింట్ల లాభంతో 2,072 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 41 పాయింట్ల లాభంతో 26,135 పాయింట్ల వద్ద, జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225... 162 పాయింట్ల లాభంతో 21,536 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. ఇండెక్స్‌లు 2 శాతం మేర పడిపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.02 శాతం లేదా 497 పాయిం‍ట్ల నష్టంతో 24,100 పాయింట్ల వద్ద ముగిసింది. మే నెల నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే డౌజోన్స్‌ లాభాలన్నీ అవిరయ్యి.. 2.5 శాతం మేర నష్టపోయింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.91 శాతం లేదా 51 పాయింట్ల నష్టంతో 2,600 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఏప్రిల్‌ నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. ఎస్‌అండ్‌పీ కూడా ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే 2.75 శాతం మేర నష్టపోయింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.26 శాతం లేదా 160 పాయింట్ల నష్టంతో 6,910 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే ఈ ఇండెక్స్‌ 0.11 శాతం లాభంతో ఉంది.



You may be interested

10850పైకి నిఫ్టీ గ్యాప్‌అప్‌

Monday 17th December 2018

36,000 పైకి సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,805 పాయింట్లతో పోలిస్తే 48 పాయింట్ల లాభంతో 10,853 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,962 పాయింట్లతో పోలిస్తే 167 పాయింట్ల లాభంతో 36,129 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది.   అమెరికా.. 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ప్రొడక్టుల దిగుమతులపై టారిఫ్‌ పెంపును జనవరి 1

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 17th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:54 సమయంలో 36 పాయింట్ల లాభంతో 10,866 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,820 పాయింట్లతో పోలిస్తే 46 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category