STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Wednesday 14th November 2018
Markets_main1542166577.png-21965

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ అమెరికా మార్కెట్లు మంగళవారం దాదాపుగా నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.4 శాతం లేదా 101 పాయిం‍ట్ల నష్టంతో 25,286 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.15 శాతం లేదా 4 పాయింట్ల నష్టంతో 2,722 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ స్థిరంగా 7,200 పాయింట్ల వద్ద ముగిసింది. ఎనర్జీ షేర్లు నష్టపోవడం వల్ల ఎస్‌అండ్‌పీ 500 నష్టాల్లోనే ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500లో ఎనర్జీ షేర్లకు అధిక వెయిటేజీ ఉంది. క్రూడ్‌ ధరలు భారీగా పడిపోవడం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. టెక్నాలజీ స్టాక్స్‌ రిబౌండ్‌ అవ్వడం వల్ల నాస్‌డాక్‌ నిలకడగానే ఉంది.

♦ అమెరికా మార్కెట్ల నష్టాల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 18 పాయింట్ల నష్టంతో 3,036 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 1 పాయింటు లాభం 9,776 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 6 పాయింట్ల నష్టంతో 2,648 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 6 పాయింట్ల నష్టంతో 2,064 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 131 పాయింట్ల నష్టంతో 25,661 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 26 పాయింట్ల నష్టంతో 21,784 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 34 పాయింట్ల లాభంతో 10,639 పాయింట్ల వద్ద ఉంది. 

♦ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 7 శాతం పడిపోయాయి. గ్లోబల్‌ డిమాండ్‌పై నెలకొన్న ఆందోళనలు, ఓవర్‌సప్లై వంటి అంశాలు ఇందుకు కారణం. అమెరికా ఫ్యూచర్స్‌ 7.1 శాతంమేర పతనమయ్యాయి. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 55.66 డాలర్ల వద్ద ఉంది. 

♦ మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ పారదర్శకత లక్ష్యంగా క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలకు కొత్త నిబంధనలను విడుదల చేసింది. 

♦ రూపాయి మంగళవారం 22 పైసలు రికవరీ అయ్యింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 72.67 వద్ద ముగిసింది. 

♦ మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు అక్టోబర్‌లో 42 శాతం వృద్ధితో రూ.7,985 కోట్లకు పెరిగాయి.

♦ ఆర్‌బీఐ నవంబర్‌ 15న మార్కెట్‌లో లిక్విడిటీని పెంచేందుకు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుంది. 

♦ దాదాపు 1,395 కంపెనీలు బుధవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో ఎంఅండ్‌ఎం, మదర్‌సన్‌ సుమి, పేజ్‌ ఇండస్ట్రీస్‌, పీసీ జువెలర్‌, స్పైస్‌జెట్‌, యూనిటెక్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, కాఫీ డే వంటి సంస్థలు ఉన్నాయి. 



You may be interested

లాభాల్లో మార్కెట్లు

Wednesday 14th November 2018

10,600 మార్క్‌కు పైన నిఫ్టీ సెన్సెక్స్‌ 180 పాయింట్లు అప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,582 పాయింట్లతో పోలిస్తే 52 పాయింట్ల లాభంతో 10,634 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,144 పాయింట్లతో పోలిస్తే 186 పాయింట్ల లాభంతో 35,330 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. అమెరికా మార్కెట్లు మంగళవారం దాదాపుగా నష్టాల్లోనే ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ..

Wednesday 14th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 34 పాయింట్ల లాభంతో 10,639 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,615 పాయింట్లతో పోలిస్తే 24 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇక

Most from this category