STOCKS

News


నేటి మార్కెట్‌పై ప్రభావిత అంశాలు

Monday 13th August 2018
Markets_main1534132211.png-19192

మార్కెట్‌పై బేర్‌ ఆధిపత్యం కారణంగా ఐదు రోజుల లాభాలకు బ్రేక్‌ వేస్తూ నిఫ్టీ 50 శుక్రవారం క్షీణించింది. ఇండెక్స్‌ రోజంతా నెగటివ్‌ ట్రెండ్‌లోనే కదలాడింది. డైలీ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. వారం మొత్తంగా చూస్తే స్పిన్నింగ్‌ టాప్‌ ప్యాట్రన్‌ను నమోదు చేసింది.
ఇండెక్స్‌ వరుసగా మూడు వారాలుగా బలపడుతూనే వచ్చింది. దాదాపు 3.8 శాతంమేర లాభపడింది. 
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 155 పాయింట్ల నష్టంతో 37,869 పాయింట్లకు క్షీణించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా పడిపోయింది. సెక్టోరల్‌ ట్రెండ్‌ మిశ్రమంగా ఉన్నప్పటికీ ఇది అరశాతంమేర క్షీణించింది.
నిప్టీ 50 శుక్రవారం 11,475 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 11,420 పాయింట్ల కనిష్ట స్థాయిని కూడా తాకింది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, మెటల్‌ షేర్ల తగ్గుదల ఇందకు కారణం. ఇండెక్స్‌ చివరకు 41 పాయింట్ల క్షీణతతో 11,429 వద్ద ముగిసింది.
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. ఇండెక్స్‌కు 11,407, 11,383 వద్ద కీలకమైన మద్దతు లభిస్తుంది. ఇక 11,466, 11,502 కీలక నిరోధ స్థాయిలు. 
బ్యాంక్‌ నిఫ్టీ.. శుక్రవారం 196 పాయింట్ల క్షీణతతో 28,124 వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 28,015, 27,906 కీలక మద్దతు స్థాయిలు. ఇక 28,305, 28,486 కీలక నిరోధ స్థాయిలు.
సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం క్షీణించాయి. టర్కీ ఆర్థిక సంక్షోభ భయాల కారణంగా బ్యాంక్‌ షేర్లు పడిపోవడం ఇందుకు కారణం. వరుసగా ఐదు వారాలుగా లాభపడుతూ వచ్చిన ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్‌ గతవారంలో క్షీణించాయి. అయితే ఎస్‌అండ్‌పీ 500 మాత్రం జనవరి 26 నాటి గరిష్ట స్థాయికి కేవలం 1.4 శాతం దిగువున ఉంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 196 పాయింట్ల క్షీణతతో 25,313 వద్ద, ఎస్‌అండ్‌పీ 500.. 20 పాయింట్ల క్షీణతతో 2,833 వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 53 పాయింట్ల క్షీణతతో 7,839 వద్ద ఉన్నాయి. 
♦ ఆసియా మార్కెట్లు కూడా సోమవారం నష్టాలోనే ట్రేడవుతున్నాయి. టర్కీ లిరా క్షీణించడంతో యూరో ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది. జపాన్‌ ఇండెక్స్‌  నికాయ్‌ 225.. 356 పాయింట్ల క్షీణతతో 21,942 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 500 పాయింట్ల క్షీణతతో 27,867 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెకస్‌ కొస్పి 33 పాయింట్ల క్షీణతతో 2,250 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 40 పాయింట్ల క్షీణతతో 3,245 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 141 పాయిం‍ట్ల క్షీణతతో 10,843 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 38 పాయింట్ల నష్టంతో 2,758 పాయింట్ల వద్ద ఉన్నాయి. 
♦ నెలవారీగా చూస్తే జూన్‌ నెలలో ఐఐపీ ఏకంగా 7 శాతంగా నమోదయ్యింది. గత ఐదు నెలల్లో ఇండెక్స్‌లో ఈ మేర వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. 
♦ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అమెరికా డాలర్లను విక్రయిస్తూనే ఉంది. జూన్‌ నెలలో నికరంగా 6.184 బిలియన్‌ డాలర్లను స్పాట్‌ మార్కెట్‌లో విక్రయించింది. 
♦ ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయి. 
♦ డిసెంబర్‌ 5 తర్వాత కూడా ఇన్వెస్టర్లు షేర్లను ఫిజికల్‌ ఫామ్‌లో ఉంచుకోవచ్చని సెబీ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. అయితే వీటిని వేరొకరికి బదిలీ చేసుకోవడం కుదరదని తెలిపింది. ఫిజికల్‌ ఫామ్‌లోని షేర్లను డీమెటీరియలైజ్‌ చేసిన తర్వాతనే బదిలీ చేసుకోవచ్చని పేర్కొంది.
♦ బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలో జోరందుకుంది. 0.4 శాతంమేర పెరిగింది. 
♦ మ్యూచువల్‌ ఫండ్స్‌ను మరింత ఆకర్ణణీయంగా మార్చేందుకు సెబీ ప్రయత్నిస్తోంది. వ్యయాలను మరింత తగ్గించేందుకు వివిధ చర్యలు తీసుకుంటోంది. అలాగే పలు స్కీమ్స్‌పై ఎక్స్‌పెన్స్‌ రేషియోను సమీక్షించనుంది.
♦ విదేశీ ఇన్వెస్టర్లు గత ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలో రూ.8,500 కోట్లకుపైగా నిధులను ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. కార్పొరేట్‌ ఎన్నింగ్స్‌ బాగుండటం, రూపాయి స్థిరపడుతుండటం, క్రూడ్‌ ఆయిల్‌ ధరల్లో మెరుగుదల వంటి అంశాలు ఇందుకు కారణం. 
♦ గ్లోబల్‌ కరెన్సీ భయాల నేపథ్యంలో ఇండియన్‌ రూపాయి 23 పైసలు బలహీన పడి 68.83 వద్ద ముగిసింది. 
♦ ఐటీ సొల్యూషన్స్‌ సంస్థ నిహిలెంట్‌ ఐపీవో పత్రాలను సెబీకి  సమర్పించింది. 
♦ 700 కంపెనీలు జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో ఆయిల్‌ ఇండియా, టాటా స్టీల్‌, టాటా కెమికల్స్‌, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, గతి, అస్ట్రాజెన్‌కా ఫార్మా, అశోక్‌ బిల్డ్‌కాన్‌ వంటి సంస్థలున్నాయి. You may be interested

మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌

Monday 13th August 2018

అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,869 పాయింట్లతో పోలిస్తే 176 పాయింట్ల నష్టంతో 37,693 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 11,429 పాయింట్లతో పోలిస్తే 60 పాయింట్ల నష్టంతో 11,369 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 68 పాయింట్లు డౌన్‌..

Monday 13th August 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం క్షీణించింది. ఉదయం 8:43 సమయంలో 68 పాయింట్ల తగ్గుదలతో 11,364 పాయింట్లకి పడిపోయింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు కారణం. అలాగే ఆసియా ప్రధాన సూచీలన్నీ కూడా నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. దీంతో నిఫ్టీ నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  ఆసియా మార్కెట్లు పతనం.. జపాన్‌ ఇండెక్స్‌  నికాయ్‌ 225.. 356 పాయింట్ల క్షీణతతో 21,942 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 500 పాయింట్ల

Most from this category