STOCKS

News


మార్కెట్లపై వీటి ప్రభావం

Thursday 9th August 2018
Markets_main1533786377.png-19058

రెండు రోజులుగా కన్సాలిడేట్‌ అవుతూ వస్తున్న నిఫ్టీ ఇండెక్స్‌ని బుల్స్‌ బుధవారం 11,460 స్థాయికి తీసుకెళ్లాయి. ఇండెక్స్‌ కీలకమైన నిరోధ స్థాయిలకు సమీపంలో కదలాడుతుండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
వరుసగా రెండు సెషన్‌లలో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరచిన ఇండెక్స్‌ బుధవారం డైలీ చార్ట్స్‌లో బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇండెక్స్‌కు 11,500, 11,530 వద్ద కీలకమైన నిరోధ స్థాయి ఉంది. ఇక 11,330 మద్దతు స్థాయి.  
నిఫ్టీ 50 బుధవారం 11,412 వద్ద ప్రారంభమైంది. తర్వాత 11,459 గరిష్ట స్థాయిని తాకింది. అలాగే 11,379 కనిష్ట స్థాయికి కూడా పడిపోయింది. చివరకు 60 పాయింట్ల లాభంతో 11,450 వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 11,399, 11,349 కీలక మద్దతు స్థాయిలు. ఇక 11,480, 11,510 కీలక నిరోధ స్థాయిలు. 
బ్యాంక్‌ నిఫ్టీ.. బుధవారం జీవిత కాల గరిష్ట స్థాయి 28,128ని తాకింది. 28,062 వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 27,905, 27,747 కీలక మద్దతు స్థాయిలు. ఇక 28,174, 28,287 కీలక నిరోధ స్థాయిలు.
గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..
♦ అమెరికా మార్కెట్లు స్వల్పంగా తగ్గాయి. క్రూడ్‌ ధరల తగ్గడం, వాణిజ్య ఉద్రిక్తతల వల్ల ఎస్‌అండ్‌పీ 500 బుధవారం స్వల్పంగా తగ్గింది. నాస్‌డాక్‌ కంపొసిట్‌ పెరిగింది. డౌజోన్స్‌ స్వల్పంగా తగ్గింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావకేజ్‌ 45 పాయింట్ల క్షీణతతో 25,583 పాయింట్లకు తగ్గింది. ఎస్‌అండ్‌పీ 0.75 పాయింట్ల తగ్గుదలతో 2,857 పాయింట్లకు క్షీణించింది. నాస్‌డాక్‌ కంపొసిట్‌ 5 పాయింట్ల లాభంతో 7,888 పాయింట్లకు పెరిగింది. 
♦ అమెరికా, చైనా మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. నికాయ్‌ 225.. 60 పాయింట్ల నష్టంతో 22,584 వద్ద, హాంగ్‌సెంగ్‌ 242 పాయింట్ల లాభంతో 28,601 వద్ద, కొస్పి స్వల్ప నష్టంతో 2,301 వద్ద, స్ట్రైట్స్‌ టైమ్స్‌ 13 పాయింట్ల నష్టంతో 3,326 వద్ద, తైవాన్‌ ఇండెక్స్‌ 24 పాయింట్ల నష్టంతో 11,051 వద్ద, షాంఘై కంపొసిట్‌ 48 పాయింట్ల లాభంతో 2,792 వద్ద ఉన్నాయి. 
♦ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 16 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రొడక్టులపై అదనంగా 25 శాతం టారిఫ్‌లను విధిస్తామని చైనా హెచ్చరించింది. ఇందులో ఆయిల్‌ నుంచి స్టీల్‌ వరకు, ఆటో నుంచి మెడికల్‌ ఈక్విప్‌మెంట్‌ వరకు పలు రకాల ఉత్పత్తులున్నాయి.
♦ ముడి చమురు ధరలు బుధవారం తగ్గాయి. చైనా దిగుమతి డేటా డిమాండ్‌ నెమ్మదించిందని తెలియజేయడం ఇందుకు కారణం. 
♦ ఇండియాలో 2014-15 నుంచి 2017-18 ఆర్థిక సంవతవ్సరాల్లో తలసరి ఆదాయం
సగటున రూ.79,882గా ఉంది. 2011-12 నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో ఇది రూ.67,594. ప్రభుత్వం లోక్‌సభలో ఈ విషయాలు వెల్లడించింది.
♦ కో-లోకేషన్‌ కేసు అంశంపై ఎన్‌ఎస్‌ఈ తాజాగా మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీతో చర్యలు ప్రారంభించింది.
♦ 2016లో 8.2 శాతానికి తాకిన ఆర్థిక వృద్ధి తర్వాత తగ్గుతూ వస్తోంది. ఉపాధి కల్పన కూడా తగ్గింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1 శాతం పాయింట్‌ తగ్గుదలతో 6.6 శాతానికి క్షీణించింది.
♦ వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌కు సీసీఐ ఆమోదం తెలిపిది.
♦ ఆర్‌బీఐ దాదాపు రూ.50,000 కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి పంపించింది.
♦ రూపాయి బుధవారం 5 పైసలు బలపడి 68.63కు పెరిగింది. 
♦ క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీవో తొలి రోజు 25 శాతం సబ్‌స్క్రైబ్‌ అయ్యింది.
♦ 241 కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. 



You may be interested

సెన్సెక్స్‌ @ 38,000

Thursday 9th August 2018

బుల్‌ రంకెలేస్తోంది. స్టాక్‌ మార్కెట్‌ గురువారం లాభాల్లోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తొలిసారి 38,000 మార్క్‌ను తాకింది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,888 పాయింట్లతో పోలిస్తే 107 పాయింట్ల లాభంతో 37,995 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. వెంటనే 38,050 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,450 పాయింట్లతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 11,493 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు మర్చిపోయారా?

Wednesday 8th August 2018

ఎప్పుడో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఆ విషయమే మర్చిపోయారా? లేదంటే మీ పెద్దలు ఇన్వెస్ట్‌ చేసి ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయి అయినా ఉండొచ్చు. ఎందుకంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల వద్ద ఆచూకీ లేని ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.44,000 కోట్లు ఉండిపోయాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ వద్ద ఉన్న మొత్తం పెట్టుబడుల్లో ఇవి రెండు శాతం. వీటిలో అధిక శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లవే అయి ఉంటాయి. ఇదే నిజమైతే

Most from this category