STOCKS

News


నేటి మార్కెట్‌పై ప్రభావిత అంశాలు

Wednesday 8th August 2018
Markets_main1533699970.png-19025

మార్కెట్లు మంగళవారం గరిష్ట స్థాయిల్లో ప్రాంభమయ్యాయి. అయితే చివరకు ఫ్లాట్‌గానే ముగిశాయి. దీని కన్నా ముందు ఇంట్రాడేలో ఒకానొక సమయంలో కొత్త గరిష్ట స్థాయిలను తాకింది. నిఫ్టీ ఇండెక్స్‌.. డైలీ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పర్చింది. అందువల్ల ముగింపు స్థాయి..  ప్రారంభ స్థాయి కన్నా తక్కువగా ఉంది. 
సెన్సెక్స్‌ 26 పాయింట్ల నష్టంతో 37,666 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.3 శాతంమేర పడిపోయింది. సెక్టోరల్‌ ఇండెక్స్‌లు మిశ్రమంగా ఉన్నాయి. 
నిఫ్టీ 50.. 10,400 స్థాయికిపైన ప్రారంభమైంది. అటుపైన ఇంట్రాడేలో 11,429 పాయింట్ల కొత్త గరిష్ట స్థాయిని తాకింది. అయితే తర్వాత 11,360 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 2 పాయింట్ల స్వల్ప లాభంతో 11,389 పాయింట్ల వద్ద ముగిసింది. 
పివోట్‌ చార్ట్స్‌ను పరిశీలిస్తే.. నిఫ్టీ 50కి 11,356 కీలక మద్దతు స్థాయి. ఒకవేళ దీని కన్నా కిందకు వస్తే 11,323 మద్దతు స్థాయి. అదే పైకి వెలితే 11,426, 11,462 కీలక నిరోధ స్థాయిలు.
నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ మంగళవారం ఏకంగా 22 పాయింట్ల నష్టంతో 27,876 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఈ ఇండెక్స్‌కు కిందకు వెలితే 27,806, 27,736 కీలక మద్దతు స్థాయిలు. పైకి వెలితే 27,966, 28,058 కీలక నిరోధ స్థాయిలు.

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను పరిశీలిస్తే..
♦ అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. అమెజాన్‌, అల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌ సహా బలమైన క్యూ2 ఎర్నింగ్స్‌ ఇందుకు కారణం. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.5 శాతం వృద్ధితో 25,629 పాయింట్ల వద్ద, ఎస్‌అండ్‌పీ 500.. 2,858 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.31 శాతం పెరుగుదలతో 7,884 పాయింట్ల వద్ద ముగిశాయి. 
♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నికాయ్‌ 225.. 88 పాయింట్ల లాభంతో 22,750 పాయింట్ల వద్ద, హాంగ్‌ సెంగ్‌ 63 పాయింట్ల లాభంతో 28,312 పాయింట్ల వద్ద, కొస్పి 4 పాయింట్ల లాభంతో 2,304 పాయింట్ల వద్ద, తైవాన్‌ ఇండెక్స్‌ 101 పాయింట్ల లాభంతో 11,084 పాయింట్ల వద్ద ఉన్నాయి. ఇక స్ట్రైట్స్‌ టైమ్స్‌ 19 పాయింట్ల నష్టంతో 3,321 పాయింట్ల వద్ద, షాంఘై కంపొసిట్‌ 14 పాయింట్ల నష్టంతో 2,765 పాయింట్ల వద్ద ఉన్నాయి. 
♦ క్రూడ్‌ ధరలు మంగళవారం పెరిగాయి. బ్రెంట్‌ ఫ్యూచర్స్‌ ధర 1.2 శాతం పెరుగుదలతో బ్యారెల్‌కు 74.65 డాలర్లకు చేరింది. 
♦ మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు జూలై నెలలో 5 శాతం వృద్ధితో రూ.24 లక్షల కోట్లకు చేరాయి. జూన్‌ చివరకు ఈ విలువ రూ.22.86 లక్షల కోట్లుగా ఉంది.
♦ భారత్‌ దాదాపు 300 టెక్స్‌టైల్‌ ప్రొడక్టులపై దిగుమతి సుంకాలను రెట్టింపు చేసింది. చైనా నుంచి టెక్స్‌టైల్‌ ప్రొడక్టుల దిగుమతిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 
♦ ఒకవేళ రూపాయి విలువ 70 మార్క్‌కు కిందకు పడిపోయినా, విదేశీ ఇన్వెస్టమెంట్లు పుంజుకోకపోయినా.. రిజర్వు బ్యాంక్‌ ఇండియా (ఆర్‌బీఐ) మూడో త్రైమాసికంలో 30-35 బిలియన్‌ డాలర్ల విలువైన నాన్‌-రెసిడెంట్‌ (ఎన్‌ఆర్‌ఐ) బాండ్లను జారీ చేసే అవకాశముందని అమెరికా మెరిల్‌ లించ్‌ పేర్కొంది.
♦ రూపాయి మంగళవారం రెండు వారాల కనిష్ట స్థాయి నుంచి రికవరీ అయ్యింది. 20 పైసలు బలపడి 68.68 వద్ద ముగిసింది. 
♦ ఎయిర్‌ ఇండియాకు రూ.11,000 కోట్ల బెయిల్‌ఔట్‌ ప్యాకేజ్‌ ఇవ్వాలని పౌర విమానయాన శాఖ యోచిస్తోంది.
♦ 178 కంపెనీలు బుధవారం జూన్‌ క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించనున్నాయి. 



You may be interested

లాభాలతోనే ఆరంభం..

Wednesday 8th August 2018

స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాల్లోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 37,750 మార్క్‌కుపైన, నిఫ్టీ 11,410 మార్క్‌కుపైన ఆరంభమయ్యాయి. సెన్సెక్స్‌ మునుపటి ముగింపు 37,666 పాయింట్లతో పోలిస్తే 90 పాయింట్ల లాభంతో  37,756 పాయింట్ల వద్ద, నిఫ్టీ క్రితం ముగింపు 11,389 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో 11,412 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగానే ట్రేడవుతుండటం, క్రూడ్‌ ధరల పెరుగుదల, మ్యూచువల్‌

క్రెడిట్‌ యాక్సెస్‌ ఐపీవో... కంపెనీ బలాబలాలు

Wednesday 8th August 2018

బెంగళూరు కేంద్రంగా నడిచే సూక్ష్మ రుణాల వ్యాపార సంస్థ ‘క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌’ ఐపీవో ఈ నెల 8న ప్రారంభం కానుంది. ఆగస్ట్‌ 10న ముగిసే ఈ ఐపీవోకు ఒక్కో షేరు ధరల శ్రేణిగా రూ.418-422ను కంపెనీ ఖరారు చేసింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌ అవుతుంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, క్రెడిట్‌ సూసే సెక్యూరిటీస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, కోటక్‌ మహింద్రా క్యాపిటల్‌ కంపెనీలు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఈ

Most from this category