STOCKS

News


మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Thursday 15th November 2018
Markets_main1542253302.png-22011

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 1 పాయింటు లాభంతో 3,044 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 12 పాయింట్ల లాభం 9,804 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 10 పాయింట్ల నష్టంతో 2,645 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 5 పాయింట్ల నష్టంతో 2,063 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 79 పాయింట్ల లాభంతో 25,733 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 55 పాయింట్ల నష్టంతో 21,791 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

♦ అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.81 శాతం లేదా 206 పాయిం‍ట్ల నష్టంతో 25,080 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.76 శాతం లేదా 20 పాయింట్ల నష్టంతో 2,701 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.9 శాతం లేదా 64 పాయింట్ల నష్టంతో 7,136 పాయింట్ల వద్ద ముగిసింది. ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ నష్టపోవడం వల్ల ఎస్‌అండ్‌పీ 500పై ప్రతికూల ప్రభావం పడింది. ఇండెక్స్‌లు వరుసగా ఐదో రోజు కూడా నష్టపోయాయి. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటెటివ్స్‌లో డెమొక్రాట్స్‌ ఆధిపత్యం పెరిగితే బ్యాంకింగ్‌ పరిశ్రమ నిబంధనలు కఠినతరమౌతాయనే ఆందోళనల వల్ల ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ 1.4 శాతంమేరు పతనమయ్యాయి. ఎస్‌అండ్‌పీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.7 శాతంమేర పడిపోయింది. 

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 16 పాయింట్ల లాభంతో 10,617 పాయింట్ల వద్ద ఉంది.

♦ లిక్విడిటీ సంబంధిత సమస్యల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు ఉపశమనం కలిగించడం, ఎంఎస్‌ఎంఈలకు లెండింగ్‌ నిబంధనలను సరళతరం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆర్‌బీఐ బోర్డ్‌ నవంబర్‌ 19న సమావేశం కానుంది.  

♦ రూపాయి బుధవారం 36 పైసలు లాభపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 72.31 వద్ద ముగిసింది. 

♦ బాగా పడుతూ వచ్చిన ఆయిల్‌ ధరలు బుధవారం మళ్లీ పెరిగాయి. దాదాపు 1 శాతంమేర ఎగశాయి. క్రూడ్‌ ఉత్పత్తి దేశాలు ఆయిల్‌ ఉత్పత్తిని తగ్గించొచ్చనే అంచనాలు ఇందుకు కారణం. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 1 శాతం పెరుగుదలతో 66.12 డాలర్లకు పెరిగింది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 1.01 శాతం పెరుగుదలతో 56.25 డాలర్లకు ఎగసింది. 

♦ సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు అక్టోబర్‌లో పెరిగాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్‌ ఇన్వెస్టర్లు సిప్‌లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అక్టోబర్‌లో ఫండ్స్‌లోకి సిప్‌ ద్వారా రూ.7,985 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 

♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు బడ్జెట్‌ లక్ష్యాన్ని (రూ.11.5 లక్షల కోట్లు) దాటుతాయని సీబీడీటీ చీఫ్‌ సుశీల్‌ చంద్ర తెలిపారు. కాగా వసూళ్లు ఇప్పటికే రూ.5 లక్షల కోట్లను దాటాయి.  



You may be interested

ఫ్లాట్‌ ఓపెనింగ్‌

Thursday 15th November 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,576 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్ల లాభంతో 10,580 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,141 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్ల లాభంతో 35,145 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లోనే ముగియడం, లిక్విడిటీ సంబంధిత సమస్యల నుంచి

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Thursday 15th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 16 పాయింట్ల లాభంతో 10,617 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,605 పాయింట్లతో పోలిస్తే 12 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category