STOCKS

News


మార్కెట్‌ ఎటు?

Tuesday 6th November 2018
Markets_main1541475563.png-21730

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగానే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.76 శాతం లేదా 190 పాయిం‍ట్ల లాభంతో 25,461 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.56 శాతం లేదా 15 పాయింట్ల లాభంతో 2,738 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే నాస్‌డాక్‌ కంపొసిట్‌ మాత్రం 0.38 శాతం లేదా 28 పాయింట్ల నష్టంతో 7,328 పాయింట్ల వద్ద ముగిసింది. ఫైనాన్షియల్‌, ఎనర్జీ, డిఫెన్సివ్‌ రంగాల స్టాక్స్‌ పెరుగుదల కారణంగా సోమవారం ఎస్‌అండ్‌పీ 500 లాభాల్లో ముగిసింది. 

♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అయితే సింగపూర్‌ మార్కెట్‌కు మాత్రం సెలవు. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ సోమవారం 56 పాయింట్ల నష్టంతో 3,060 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక మంగళవారం రోజు.. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 86 పాయిం‍ట్ల నష్టంతో 9,803 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 23 పాయింట్ల నష్టంతో 2,642 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 3 పాయింట్ల స్వల్ప లాభంతో 2,079 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 42 పాయింట్ల నష్టంతో 25,892 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 222 పాయింట్ల లాభంతో 22,121 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 21 పాయింట్ల లాభంతో 10,581 పాయింట్ల వద్ద ఉంది. 

♦ క్రూడ్‌ ధరలు మంగళవారం కూడా తగ్గాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మళ్లీ అమల్లోకి రావడంతో ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల ఆయిల్‌ డిమాండ్‌ వృద్ధి తగ్గుతుందనే ఆందోళనలు ప్రభావం చూపాయి. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 62.93 డాలర్లుగా ఉంది. 

♦ రూపాయి సోమవారం నష్టపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 67 పైసలు క్షీణించి 73.12 వద్ద ముగిసింది. 

♦ ఎస్‌బీఐ క్యూ2 నికర లాభం 40 శాతం క్షీణతతో 945 కోట్లుగా నమోదయ్యింది. 

♦ అమెరికా.. ఇరాన్‌పై ఆంక్షల విషయంలో 8 దేశాలకు మినహాయింపునిచ్చింది. ఇందులో భారత్‌, చైనా వంటి దేశాలున్నాయి. ఇవి ఇరాన్‌ నుంచి క్రూడ్‌ను కొనుగోలు చేయవచ్చు.

♦ వచ్చే మార్చి నాటికి రూపాయి 71 స్థాయికి బలపడవచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది. 

♦ పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఐపీవోకు సెబీ అనుమతినిచ్చింది. 

♦ పెన్నా సిమెంట్‌ ఐపీవోకు వచ్చేందుకు సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఐపీవో ద్వారా రూ.1,550 కోట్లు సమీకరించనుంది. 

♦ దాదాపు 46 కంపెనీలు మంగళవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో వోల్టస్‌, మణప్పురం ఫైనాన్స్‌, జేకే ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ లాల్‌ పత్‌ ల్యాబ్స్‌ వంటి పలు కంపెనీలున్నాయి. 



You may be interested

35,000 పైన సెన్సెక్స్‌

Tuesday 6th November 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,524 పాయింట్లతో పోలిస్తే 28 పాయింట్ల లాభంతో 10,552 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,950 పాయింట్లతో పోలిస్తే 126 పాయింట్ల లాభంతో 35,076 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.   అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగానే ట్రేడవుతుండటం (సింగపూర్‌ మార్కెట్‌కు మాత్రం

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Tuesday 6th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 21 పాయింట్ల లాభంతో 10,581 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,550 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category