STOCKS

News


మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Wednesday 3rd October 2018
Markets_main1538538222.png-20803

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు స్వల్పంగా నష్టపోతే.. డౌజోన్స్‌ ఇండెక్స్‌ లాభపడింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 123 పాయిం‍ట్ల లాభంతో 26,774 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ట ముగింపు స్థాయి. ఇక ఎస్‌అండ్‌పీ 500.. కేవలం 1 పాయింటు అతిస్వల్ప నష్టంతో 2,923 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నాస్‌డాక్‌ కంపొసిట్‌ 38 పాయింట్ల నష్టంతో 8,000 పాయింట్ల వద్ద ముగిసింది. ఫేస్‌బుక్‌ స్టాక్‌ పడిపోవడం వల్ల నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఫేస్‌బుక్‌కు ఈ రెండు ఇండెక్స్‌లలో అధిక వెయిటేజీ ఉంది. 

♦ఒక్క సింగపూర్‌ ఇండెక్స్‌ మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 13 పాయింట్ల నష్టంతో 24,257 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 4 పాయింట్ల నష్టంతో 27,122 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 18 పాయిం‍ట్ల నష్టంతో 10,902 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 29 పాయింట్ల నష్టంతో 2,309 పాయింట్ల వద్ద  ఉన్నాయి. ఇక సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 25 పాయింట్ల లాభంతో 3,268 పాయింట్ల వద్ద ఉంది. అయితే చైనా మార్కెట్‌కు సెలవు. శుక్రవారం చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 30 పాయింట్ల లాభంతో 2,821 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.   

♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. 

♦ఇటలీ బడ్జెట్‌ సంక్షోభం నేపథ్యంలో యూరో ఆరు వారాల కనిష్ట స్థాయికి క్షీణించింది.

♦అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మళ్లీ చైనాను హెచ్చరించారు. 267 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై కొత్త టారిఫ్‌లను విధిస్తామని పేర్కొన్నారు. అసంబద్ధ వాణిజ్య విధానాలను మార్చుకోకపోతే బీజింగ్‌తో భాగస్వామ్యానికి అవకాశమే లేదని తెలిపారు. 

♦ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌లో వంద శాతం ఎఫ్‌డీఐల అనుమతికి ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఎఫ్‌డీఐలకు 49 శాతం వరకే అనుమతులు ఉన్నాయి.

♦క్రూడ్‌ ధరలు బుధవారం తగ్గాయి. అమెరికా నుంచి సరఫరా పెరగడం ప్రభావం చూపింది. అయితే ఇరాన్‌పై ఆంక్షల భయాలు మాత్రం కొనసాగుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 84.73 డాలర్ల వద్ద ఉంది.

♦అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి సోమవారం 43 పైసలు క్షీణించి 72.91 వద్ద ముగిసింది.

♦ఇన్‌ఫ్రా రంగ వృద్ధి ఆగస్ట్‌లో 4.2 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే నెలలో ఇది 4.4 శాతంగా ఉంది.

♦రెండు డైనమిక్‌ అసెట్‌ అలోకేషన్‌ ఇండెక్స్‌లను ప్రారంభించినట్లు ఎన్ఎస్‌ఈ పేర్కొంది. 

♦గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీవో 1.02 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది.

♦ఆకాశ్‌, సెంచురీ మెటల్‌ రీసైక్లింగ్‌, అమి ఆర్గానిక్స్‌ కంపెనీలకు ఐపీవోలకు సెబీ అనుమతినిచ్చింది. 



You may be interested

నిఫ్టీ రెడ్‌.. సెన్సెక్స్‌ గ్రీన్‌..

Wednesday 3rd October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం మిశ్రమంగా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,526 పాయింట్లతో పోలిస్తే 76 పాయింట్ల లాభంతో 36,602 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,008 పాయింట్లతో పోలిస్తే 26 పాయింట్ల నష్టంతో 10,982 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే సెన్సెక్స్‌ కూడా వెంటనే నష్టా‍ల్లోకి జారిపోయింది. ఉదయం 9:22 సమయంలో సెన్సెక్స్‌ 147 పాయింట్ల నష్టంతో 36,379 వద్ద,

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Wednesday 3rd October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:43 సమయంలో 49 పాయింట్ల లాభంతో 11,006 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 11,061 పాయింట్లతో పోలిస్తే 55 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా

Most from this category