STOCKS

News


మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Thursday 25th October 2018
Markets_main1540439079.png-21454

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. 

♦ అమెరికా మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఏడాది లాభాలన్నీ ఆవిరయ్యాయి. 2011 నుంచి చూస్తే మార్కెట్లు ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే ప్రథమం. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.41 శాతం లేదా ఏకంగా 608 పాయిం‍ట్ల నష్టంతో 24,583 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 3.09 శాతం లేదా 85 పాయింట్ల నష్టంతో 2,656 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4.43 శాతం లేదా 329 పాయింట్ల నష్టంతో 7,108 పాయింట్ల వద్ద ముగిసింది. గృహ విక్రయాలు బలహీనంగా ఉండటం, చిప్‌ తయారీ కంపెనీల భవిష్యత్‌ వృద్ధి అంచనాలు నిరుత్సాహకరంగా ఉండటం వల్ల ఆర్థిక వృద్ధి, ప్రాఫిట్‌ పెరుగుదలపై ఆందోళలు ఏర్పడ్డాయి. దీంతో మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. సెప్టెంబర్‌లో కొత్త గృహ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన చూస్తే దాదాపు 20 శాతంమేర క్షీణించాయి. గృహ నిర్మాణాలకు సంబంధించిన స్టాక్స్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు 35 శాతంమేర పతనమయ్యాయి. గృహ విక్రయాలు తగ్గడమనేది కన్సూమర్లకు నెగటివ్‌ సంకేతం లాంటిది. అందువల్ల నెట్‌ఫ్లిక్స్‌ దాదాపు 7 శాతంమేర పడిపోయింది. ఎస్‌అండ్‌పీ 100లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన స్టాక్‌. దీని తర్వాత ఏటీఅండ్‌టీ ఎక్కువగా నష్టపోయింది. 

♦ అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 618 పాయింట్ల నష్టంతో 21,472 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 33 పాయింట్ల నష్టంతో 2,999 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 196 పాయిం‍ట్ల నష్టంతో 9,563 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 38 పాయింట్ల నష్టంతో 2,565 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 49 పాయింట్ల నష్టంతో 2,048 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 444 పాయింట్ల నష్టంతో 24,805 పాయింట్ల వద్ద ఉన్నాయి.  

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. ఇది సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:31 సమయంలో ఏకంగా 101 పాయింట్ల నష్టంతో 10,136 పాయింట్ల వద్ద ఉంది. 

♦ క్రూడ్‌ ధరలు గురువారం 1 శాతంమేర తగ్గాయి. గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి చోటుచేసుకోవడం, అమెరికా మార్కెట్లు భారీగా పతనం కావడం వంటి అంశాలు ఇందుకు కారణం. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 75.42 డాలర్ల వద్ద, అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 66.23 డాలర్ల వద్ద ఉంది. 

♦ బీఎస్‌ఈ.. గూగుల్‌తో జతకట్టింది. దీంతో యూజర్లు స్టాక్‌ ధరలు, ఇండెక్స్‌ ఎలా ఉన్నాయి, కార్పొరేట్‌ ప్రకటనలు, బోర్డ్‌ మీటింగ్స్‌, కంపెనీ ఫలితాలు, గెయినర్స్‌, లూజర్స్‌, కొత్త లిస్టింగ్‌లు, ఐపీవో వంటి మార్కెట్‌ సమాచారాన్ని గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా పొందొచ్చు. 

♦ భారత్‌.. చైనాతో వాణిజ్య చర్చలు జరపాలని భావిస్తోంది. ఎగుమతులను పెంచుకోవడం చర్చల ప్రధాన లక్ష్యం. 

♦ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 41 పైసలు బలపడి 73.16 వద్ద ముగిసింది. దీంతో రూపాయి మూడు వారాల గరిష్ట స్థాయికి చేరింది. 

♦ కార్పొరేట్స్‌ జారీ చేసే ఆన్‌-ట్యాప్‌ బాండ్లకి సంబంధించి అతిత్వరలో మార్గదర్శకాలను ప్రకటిస్తామని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి తెలిపారు. 

♦ దాదాపు 78 కంపెనీలు గురువారం క్యూ2 ఎర్నింగ్స్‌ ఫలితాలను వెల్లడించనున్నాయి. 

♦ విప్రో నికర లాభం క్యూ2లో 10 శాతంమేర క్షీణించింది. రూ.1,890 కోట్లుగా నమోదయ్యింది. 

♦ ఆర్థికంగా బలహీనంగా ఉన్న బ్యాంకులను చక్కదిద్దడానికి ఉద్దేశించిన ‘దిద్దుబాటు చర్యల’ (పీసీఏ) మార్గదర్శకాల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  You may be interested

నష్టాలతో ఆరంభం..

Thursday 25th October 2018

సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా పతనం 33,800 మార్క్‌ దిగువున ప్రారంభం నిఫ్టీ 90 పాయింట్లు డౌన్‌ 10,250 దిగువున ఇండెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,033 పాయింట్లతో పోలిస్తే 255 పాయింట్ల నష్టంతో 33,778 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,225 పాయింట్లతో పోలిస్తే 90 పాయింట్ల నష్టంతో 10,135 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  గృహ విక్రయాలు బలహీనంగా

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Thursday 25th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:31 సమయంలో ఏకంగా 101 పాయింట్ల నష్టంతో 10,136 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,228 పాయింట్లతో పోలిస్తే 92 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

Most from this category