STOCKS

News


బడ్జెట్‌పై ఫండ్‌ మేనేజర్ల మనోగతం

Sunday 3rd February 2019
Markets_main1549216481.png-23990

రైతులకు నగదు ప్రయోజనాన్ని అందించే కిసాన్‌ సమ్మాన్‌ పథకం, అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్‌, రూ.5 లక్షల వరకు పన్ను వర్తించే ఆదాయం కలిగిన వారికి మినహాయింపు వంటి ఎన్నో ప్రయోజనాలను మధ్యంతర బడ్జెట్‌ తీసుకొచ్చింది. ఇవన్నీ మార్కెట్‌కు సానుకూలమేనని మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్ల అభిప్రాయం. బడ్జెట్‌పై వివిధ మ్యూచువల్‌ ఫండ్స్‌, వాటి మేనేజర్ల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

 

ద్రవ్య క్రమశిక్షణతో కూడిన వృద్ధి అనుకూల బడ్జెట్‌. ఆందోళనలో ఉన్న రైతాంగానికి  ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి, అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు పెన్షన్‌, ఆదాయపన్ను మినహాయింపు పెంపు చాలా ప్రగతిశీలమైనవి. వివిధ వర్గాల ప్రజల వద్ద అదనంగా మిగిలే డబ్బులు మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమకు సానుకూలం. డిపాజిట్లపై టీడీఎస్‌ పరిమితిని పెంచడం కూడా మంచి చర్యే.
- ఎన్‌ఎస్‌ వెంకటేష్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ సీఈవో 

 

మధ్యతరగతి, రైతులకు ఇది కలల బడ్జెట్‌. పన్ను మినహాయింపు, స్టాండర్డ్‌ డిడక్షన్‌, టీడీఎస్‌ పరిమితి పెంపుతో ప్రజల చేతుల్లో ఖర్చు చేసేందుకు అదనపు ఆదాయం మిగులుతుంది. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. మొత్తం మీద ఈ బడ్జెట్‌ మార్కెట్‌కు సానుకూలం.

- జి.ప్రదీప్‌కుమార్‌, యూనియన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో

 

వినియోగం, గ్రామీణ ఆర్థిక రంగానికి బడ్జెట్‌ సానుకూలం. ద్రవ్యలోటుపై ఎటువంటి పెద్ద ప్రభావం పడుతుందని అనుకోవడం లేదు. పన్ను నిబంధనల అమలు కూడా పెరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు వినియోగాన్ని పెంచుతాయి. ద్రవ్యలోటు పెరగడం, రుణాల సమీకరణ పెరగడం బాండ్‌ మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయి.

- రాజ్‌కుమార్‌, ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో

 

వినియోగ అనుకూల బడ్జెట్‌. రైతులు, మధ్యతరగతి వారికి ప్రోత్సాహకాలు ఉన్నాయి. వినియోగ ఆధారిత రంగాలకు ఉత్తేజాన్నిస్తుంది. సమస్యల్లో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కొన్ని చర్యలను కూడా ప్రకటించారు. ద్రవ్యలోటు తప్పడం పరిమితుల మేరకే ఉంది. దీర్ఘకాలంలో ద్రవ్యలోటు స్థిరీకరణకు ఇదేమీ అవరోధం కాదు. ఇటీవలి డిమాండ్‌ బలహీన పడడం, ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల ప్రభుత్వ నిర్ణయాలు అధిక ద్రవ్యోల్బణానికి దారితీయవు. ఆర్‌బీఐ తన విధానాన్ని సులభతరం చేస్తుందని ఇప్పటికీ భావిస్తు‍న్నాం.

- మనీష్‌ గున్వాని, రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో

 

గ్రామీణ, చిన్న, మధ్యతరహా పరివ్రమలు, మధ్యతరగతి వారిపై ఈ బడ్జెట్‌ దృష్టి సారించింది. ఇది మధ్యంతర బడ్జెట్‌. వాస్తవ మార్పులు ఏంటన్నది ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ వరకు వేచి చూడాల్సిందే.

- నవనీత్‌ మునోత్‌, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో

 

రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి కోసం ఖర్చు చేసే రూ.75,000 కోట్లు ద్రవ్యలోటుపై పెద్దగా ప్రభావం చూపవు. 2020 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వసూళ్లు, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు అర్థవంతంగా ఉన్నాయి. బాండ్ల ఈల్డ్‌పై ఒత్తిళ్లు ఉంటాయి. ఆర్‌బీఐ రేట్ల కోత అవకాశాలను బడ్జెట్‌ వెనక్కి నెట్టేసిందని భావిస్తున్నాం.

- అఖిల్‌ మిట్టల్‌, టాటా మ్యూచువల్‌ ఫండ్‌ సీనియర్‌ మేనేజర్‌You may be interested

స్వల్ప నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 4th February 2019

విదేశీ మార్కెట్లలో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం స్వల్ప నష్టాలతో ట్రేడ్‌ అవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపు(10911.50)తో పోలిస్తే ఉదయం 8:30లకు 10 పాయిం‍ట్ల నష్టంతో 10,901 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి(10914)తో పోలిస్తే 14 పాయిం‍ట్ల క్షీణతతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్ప నష్టాల ట్రేడింగ్‌ కారణంగా నేడు నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. లాభాల్లో ఆసియా

నాలుగు రంగాలకు ఎక్కువ ప్రయోజనం: సెంట్రమ్‌

Sunday 3rd February 2019

కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌ ముఖ్యంగా నాలుగు రంగాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని సెంట్రమ్‌ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్పాల్‌ బింద్రా పేర్కొన్నారు. కానీ, రానున్న 8-10 ఏళ్ల కాలంలో ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగేందుకు బాట వేసినట్టుగా బడ్జెట్‌ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్కరణలు గ్రామీణ, మధ్య తరగతి ప్రజానీకానికి ప్రయోజనం కలిగిస్తాయన్నారు. ప్రభుత్వం ద్రవ్యలోటు, సంక్షేమ కార్యక్రమాలను చక్కగా సమతుల్యం చేసిందన్నారు. బడ్జెట్‌తో ఎక్కువగా లబ్ధి పొందే

Most from this category