STOCKS

News


బిజినెస్‌ వీక్లి రౌండప్‌

Saturday 6th October 2018
Markets_main1538819775.png-20927

 ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి ఈ వారంలో ఈ ఏడాది లాభాలన్నీ కరిగిపోయాయి. 2016 ఫిబ్రవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. బ్రెంట్‌ ధరల పెరుగుదల, రూపాయి పతనం ప్రతికూల ప్రభావం చూపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 5.11 శాతం క్షీణతతో 34,377 పాయింట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 ఇండెక్స్‌ 5.62 శాతం క్షీణతతో 10,316 పాయింట్లకు పడిపోయాయి.

♦ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి తొలిసారిగా 74 మార్క్‌ దిగువకు పతనమైంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో ఒకానొక సమయంలో రూపాయి 74.22 స్థాయికి కూడా పతనమైంది. చివరకు 73.77 వద్ద ముగిసింది. వారంలో చూస్తే రూపాయి 1.7 శాతంమేర క్షీణించింది. క్రూడ్‌ ధరల పెరుగుదల, ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి, డాలర్‌ బలపడటం వంటివి ప్రతికూల ప్రభావం చూపాయి. ఆసియాలో దక్షిణ కొరియా ఒన్‌ (1.9 శాతం క్షీణత), ఇండోనేసియా రుపియ (1.8 శాతం క్షీణత) తర్వాత రూపాయి (1.7 శాతం క్షీణత) ఎక్కువగా పడిపోయింది. 

♦ బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఒకానొక సమయంలో బ్యారెల్‌కు 86 డాలర్లను అధిగమించింది.

♦ ఎనర్జీ కంపెనీలు టాప్‌ లూజర్లు ఉన్నాయి. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎక్కువగా నష్టపోయాయి. మరోవైపు యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో టాప్‌ గెయినర్లుగా ఉన్నాయి.

♦ నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ వరుసగా నాల్గవ వారంలోనూ క్షీణించింది. 7 శాతంమేర పతనమైంది. దీని తర్వాత నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 6.3 శాతంమేర, నిఫ్టీ రియల్టీ 4.9 శాతంమేర తగ్గాయి. 

♦ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ టేకోవర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతినిచ్చింది. 

♦ లిక్విడిటీని పెంచేందుకు ఆర్‌బీఐ అక్టోబర్‌ నెలలో రూ.36,000 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయనుంది. 

♦ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు విదేశీ రుణాల సమీకరణకు సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది.

♦ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూ.2.50 తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. 

♦ చందా కొచర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సందీప్‌ బక్షి కొత్త బాస్‌గా ఎన్నికయ్యారు. 

♦ ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు బిడ్‌ వేసుకునేందుకు ఆర్సెలర్‌ మిట్టల్‌, రష్యాకు చెందిన వీటీబీ బ్యాంకు ఆధ్వర్యంలోని న్యుమెటల్‌కు సుప్రీంకోర్టు మరో అవకాశం కల్పించింది.

♦ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్కెట్‌ వర్గాలకు షాకిస్తూ తాజా సమీక్షలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.50 శాతంగా, రివర్స్‌ రెపో రేటు 6.25 శాతంగా నిలకడగానే ఉన్నాయి.You may be interested

రీబౌన్స్‌ ఉంటుందా?

Saturday 6th October 2018

ఈ వారం బుల్స్‌కు పీడకలగా మిగిలిపోనుంది. కేవలం బుల్స్‌కు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి, నియంత్రణా సంస్థలకు సైతం ఈ వారం చేదు అనుభవాలను మిగిల్చింది. రూపీ పతనాన్ని, క్రూడాయిల్‌ ప్రభావాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ, సెబి పలు యత్నాలు చేశాయి. అయితే వారాంతానికి అవన్నీ ప్రయోజనం చేకూర్చకుండా పోయాయి. రూపాయి 74 స్థాయిని తాకింది. నిఫ్టీ 10400 పాయింట్లను సైతం కోల్పోయింది. అయితే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు కొత్త బోర్డు ఏర్పాటు, ఓఎంసీలకు

ఆటో పరిశ్రమపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిపోర్టు

Saturday 6th October 2018

పలు తలనొప్పులున్నప్పటికీ సెప్టెంబర్‌లో ఆటో కంపెనీల విక్రయాలు అంచనాలకు అటుఇటుగానే నమోదయ్యాయి. కేరళ వరదలు, క్రూడాయిల్‌ ధరల పెరుగుదల ఆటో అమ్మకాలను కుంగదీశాయి. అయితే రూరల్‌ రికవరీ కొనసాగడంతో అమ్మకాలు నిలదొక్కుకున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇకపై అందరి దృష్టి రాబోయే పండుగ సీజన్‌పై ఉంది. పాసింజర్‌, కమర్షియల్‌ వాహనాల విక్రయాల్లో పండుగ సీజన్‌ జోరు తెస్తుందని అంచనా వేసింది. తాజా కరెక‌్షన్‌తో పలు ఆటో స్టాకులు ఆకర్షణీయంగా మారాయని

Most from this category