STOCKS

News


ఆర్‌ఐఎల్‌ పతనం సాంకేతికమే!

Thursday 4th October 2018
news_main1538649090.png-20859

ఇతర ప్రభావాలేమీ కనిపించడంలేదు
మార్కెట్‌ నిపుణులు
గురువారం మార్కెట్లు గజగజలాడాయి. దేశీయ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ పతనంతో మార్కెట్లు దిక్కుతోచని పక్షులయ్యాయి. మార్కెట్‌ లీడర్‌ రిలయన్స్‌ షేరు గురువారం ఒక్కరోజే దాదాపు 7 శాతం పైచిలుకు పతనమైంది. ఒక దశలో 1106 రూపాయల వరకు క్షీణించిన ఆర్‌ఐఎల్‌ చివరకు స్వల్పంగా కోలుకొని 1122 రూపాయల వద్ద ముగిసింది. రిలయన్స్‌ ఢమాల్‌మనడంతో మార్కెట్లు అంతంతకంతకూ పడిపోయాయి. ఉన్నట్లుండి రిలయన్స్‌ షేరు ఇంతలా పడిపోవడం ట్రేడర్లను, ఇన్వెస్టర్లను నివ్వెర పరిచింది. అయితే కంపెనీ మూలాలు బలంగా ఉన్నాయని, ఈ పతనం కేవలం సాంకేతికమని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంపెనీ రిఫైనింగ్‌ వ్యాపారం చాలా బలంగా ఉందని మార్కెట్‌ నిపుణుడు దేవాంగ్‌ చౌక్సీ చెప్పారు. రిఫైనింగ్‌ వ్యాపారం గతంలో కన్నా ఇప్పుడే చాలా మెరుగ్గా ఉందన్నారు. కంపెనీ విక్రయాల్లో సింహభాగం విదేశీ మార్కెట్లలో జరుగుతుందని, అందువల్ల రూపీ పతన ప్రభావం సైతం పెద్దగా ఉండదని చెప్పారు. నిజానికి రూపీ క్షీణత కంపెనీకి కలిసివచ్చేఅంశమన్నారు.

దేశీయంగా పెట్రోకెమికల్‌, పాలీమర్స్‌ వ్యాపారాలు సైతం బాగున్నాయన్నారు. అటు కన్జూమర్‌ వ్యాపారం కానీ, ఇటు టెలికం వ్యాపారం కానీ మంచిగా కొనసాగుతున్నాయని వివరించారు. కంపెనీ బిజినెస్‌ మోడల్‌లో ఎలాంటి లోపం కనిపించడం లేదన్నారు. మార్కెట్లను కలవరపెట్టే కరెన్సీ, క్రూడ్‌ భయాలు ఆర్‌ఐఎల్‌పై ఎలాంటి ప్రభావం చూపలేవని చెప్పారు. ఇవన్నీ గమనిస్తే కేవలం టెక్నికల్‌ కారణాల వల్లనే షేరు పతనం కావడం జరిగిందని భావించవచ్చని చెప్పారు. టెక్నికల్‌చార్టుల్లో షేరు బలహీనంగా ఉందని, అందువల్లే ఈ పతనం వచ్చిందని చెప్పారు. ఈ నెల్లో కంపెనీ షేరు దాదాపు పదిశాతం క్షీణత నమోదు చేసింది. మరోవైపు హాత్‌వే కేబుల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఆర్‌ఐఎల్‌ వివరణ ఇచ్చింది. పుకార్లపై వ్యాఖ్యానించమని, ఒప్పందం ఏదైనా ఉంటే అది కార్యరూపం దాల్చాక వెల్లడిస్తామని తెలిపింది. 



You may be interested

బేర్స్‌ స్వైరవిహారం

Thursday 4th October 2018

సెన్సెక్స్‌ నష్టం 806 పాయింట్లు 10600ల దిగువకు నిఫ్టీ బేర్స్‌ చేసిన వీరవిహారానికి గురువారం మార్కెట్‌ నిలువునా పతనమయ్యింది. క్రితం రోజు నష్టాల ముగింపునకు కొనసాగింపుగా నేడు కూడా బేర్స్‌ హల్‌చల్‌ చేశారు. రూపాయి కొత్త జీవిత కాల కనిష్టానికి పతనం కావడం, ముడిచమురు మంటలు, వాణిజ్య లోటు, దేశీయ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు తరలిపోవడం తదితరకారణాలు మార్కెట్లో బేర్స్‌ పట్టును సాధించడానికి కారణయ్యాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం సాగిన బేర్స్‌లో వేటలో సెన్సెక్స్‌

ముందుంది మరింత పతనం!

Thursday 4th October 2018

నిపుణుల హెచ్చరిక ఇన్‌ఫ్రా కంపెనీల దెబ్బకు దేశీయ మార్కెట్లు కుయ్యోమొర్రో అనడం ఆరంభించాయి. మూలిగే నక్కపై తాటిపండులాగా ఇదే సమయంలో రూపీ మరింత పతనం కావడం, క్రూడాయిల్‌ ధర ఝమ్మని పెరిగిపోవడంతో మార్కెట్లు కకావికలయ్యాయి. గురువారం మార్కెట్లు 2 శాతానికి పైగా పతనమయ్యాయి. ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌ లాంటి దిగ్గజాలు దాదాపు 4 శాతం ఢమాల్‌మన్నాయి. ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దేందుకు ఎన్ని యత్నాలు చేసినా పెద్దగా ఫలితం కానరావడం లేదు. ఈ నేపథ్యంలో

Most from this category