STOCKS

News


మార్కెట్లు ఆక్టోబర్‌ నుంచి తిరిగి పుంజుకుంటాయి

Saturday 10th August 2019
Markets_main1565409466.png-27675

   ‘జీవితంలో కష్టసుఖాలు ఎలానో మార్కెట్లకు లాభ నష్టాలు అలాంటివే’ అని సీనియర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా అన్నారు. మార్కెట్లు అక్టోబర్‌ నుంచి తిరిగి పుంజుకుంటాయని గత వారం ముంబైలో జరిగిని ఓ ఈవెంట్‌లో ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఆర్థికంగా విపరీత అధ్వాన్న పరిస్థితులన్నింటినీ దాటేశామని, మార్కెట్లు అక్టోబర్‌-నవంబర్‌ నాటికి తిరిగి పుంజుకుంటాయి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. స్టాక్‌ బ్రోకర్లకు ఇచ్చిన లెక్చర్‌లో ఝున్‌ఝున్‌వాలా తన ఇన్వెస్టింగ్‌ కెరీర్‌ను గుర్తుతెచ్చుకున్నారు. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, ఇన్వెస్టర్లు పెట్టుబడి నిర్ణయాలను తీసుకునే ముందు వాస్తవిక ధోరణితో నిర్ణయాలు తీసుకోవాలని, ఇన్వెస్టింగ్‌లో రిస్క్‌లు తీసుకోవాలని సలహా ఇచ్చారు. 
 రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా 1985 లో రూ. 5,000 తో తన ఇన్వెస్టింగ్‌ కెరీర్‌ను దలాల్‌ స్ట్రీట్‌లో ప్రారంభించారు. తన మొదటి కోటి పెట్టుబడిని కేవలం నాలుగేళ్లలోనే చేశారు. తర్వాత నాలుగేళ్లలో రూ. 100 కోట్లను ఇన్వెస్ట్‌ చేసే స్థాయికి చేరుకున్నారు. 2019 అగష్టు 2 నాటికి ఆయన ఫోర్టుపోలియోలో స్టాకుల విలువ రూ. 13,000 కోట్ల పై మాటే. తన ఇన్వెస్టింగ్‌ జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటూ..ఒక వ్యాపారస్తుడి స్థాయి నుంచి దీర్ఘ కాల పెట్టుబడిదారుగా మారనని తెలిపారు. ‘నా దృష్ఠిలో ట్రేడింగ్‌, ఇన్వెస్టింగ్‌ రెండు విభిన్న అంశాలు. వ్యాపారం చేస్తున్నప్పుడు ఉత్సాహాంగా ఉంటుంది. వ్యాపారానికి ఎక్కువ సమయం, ఏకాగ్రత కేంద్రికరించాలి. అందుకే ప్రస్తుతం వ్యాపారానికి దూరంగా ఉన్నాను’ అని స్టాక్‌ బ్రోకర్లకిచ్చిన లెక్చర్‌లో అన్నారు. 
   ఇన్వెస్టర్లు ఎవరికి కూడా బానిసలల ఉండకూడదని, తమకు నచ్చిన మార్గంలో వెళ్లాలని సలహా ఇచ్చారు. ‘ఇతరుల నుంచి పాఠాలు నేర్చుకోండి, కానీ మీకు నచ్చిన దారీలోనే వెళ్లండి. వారెన్‌ బఫెటాకో ఇతరులకో బానిసలుగా మారకండి’ అని అన్నారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ గత సెప్టెంబర్‌-అక్టోబర్‌ వరకు బాగనే నడిచింది. కానీ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో అమ్మకాలు భారీగా పడిపోయాయి. పవర్‌ సెక్టార్ల మందగమనం, దేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపింది’ అని అభిప్రాయపడ్డారు. ‘నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి ప్రభుత్వ చర్యల వలన ఆర్థిక వ్యవస్థ ప్రభావితమయ్యింది. కానీ ఈ సంస్కరణల ఫలాలు ఇక అందనున్నాయి’ అని అన్నారు. స్టాక్సు, సెక్టార్స్‌ గురించి మాట్లాడుతూ..తాను ఫార్మా సెక్టార్‌పై బుల్లిష్‌గా ఉన్నానని అన్నారు. ‘యుఎస్‌ జనరిక్‌ మార్కెట్‌ తిరిగి కోలుకుంటుంది. ఇండియా 10-15 శాతం వృద్ధి రేటును నమోదు చేయగలదు. ఫార్మా పరిశ్రమ ఎప్పటికి కనుమరుగవదు’ అని తెలిపారు. కార్పోరేట్‌ పాలన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పీఎస్‌యూ బ్యాంక్‌ల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు.



You may be interested

ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌..

Saturday 10th August 2019

ప్రభుత్వం, ఆర్‌బీఐ కసరత్తు పన్నుల సమస్యలపై పరిశ్రమ వర్గాలతో సమావేశాలు సీఐఐ సదస్సులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: మందగమన సంకేతాలతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. ఎకానమీకి తోడ్పాటునిచ్చే చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ఆమె చెప్పారు.  శుక్రవారం జరిగిన పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి

రెండు రోజుల్లో భారీ ర్యాలీ... ఏమై ఉంటుంది?

Friday 9th August 2019

ఊహించని విధంగా స్టాక్‌ మార్కెట్లు గురు, శుక్రవారాల్లో భారీ ర్యాలీ చేశాయి. కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించడం మంచి లాభాలకు తోడ్పడ్డాయి. దీని వెనుక అంశాలను పరిశీలిస్తే...    ఎఫ్‌ఫీఐలపై సర్‌చార్జీ బడ్జెట్లో అధిక ఆదాయ వర్గాలపై ఆదాయపన్ను సర్‌చార్జీని ప్రభుత్వం భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. రూ.2-5 కోట్ల మధ్య ఆదాయం కలిగిన వారిపై 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్లకుపైగా ఆదాయం కలిగిన వారిపై 15 శాతం

Most from this category