STOCKS

News


లాంగ్‌ టర్మ్‌.. బుల్లిష్‌..

Thursday 16th August 2018
Markets_main1534413631.png-19345

దీర్ఘకాలంలో మార్కెట్లు బుల్లిష్‌గా ఉంటాయని యూఎన్‌ జాయింట్‌ స్టాఫ్‌ సెన్షన్‌ ఫండ్‌ సెక్రటరీ జనరల్‌ సుధీర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. టెక్నాలజీ రంగంలోని బలమైన వృద్ధి దీనికి దోహదపడనుందని పేర్కొన్నారు. అమెరికా ఫెడ్‌ రేట్ల పెంపు ఎక్కువ ప్రభావం చూపబోదని తెలిపారు. రానున్న కాలంలో ఎలాంటి అవరోధాలున్నా.. మార్కెట్లు వాటిని అధిగమిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఫెడరల్‌ రిజర్వు రేట్ల పెంపు అంశాల కారణంగా మార్కెట్లపై ప్రభావం పడిందని తెలిపారు.  వాణిజ్య యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులున్నాయన్నారు. ఈ విషయంపై చర్చల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. వాణిజ్య ఉద్రిక్తతలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని, అయితే వీటి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 
అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగాయని సుధీర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి పరిస్థితులు లేవని గుర్తుచేశారు. వర్ధమాన మార్కెట్లలో కూడా అధిక రేట్ల పెంపు లేదని పేర్కొన్నారు. అమెరికాలో వచ్చే 1-2 ఏళ్ల కాలంలో వడ్డీ రేట్లు పెరుగుతాయని తెలిపారు. భారత్‌ సహా కొన్ని ఇతర ప్రధాన మార్కెట్లలో వడ్డీ రేట్లు స్వల్పంగా పెరగొచ్చని పేర్కొన్నారు. 
ప్రస్తుత సమయంలో గ్లోబల్‌ బాండ్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా ఉందని సుధీర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక రేట్లు సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాలోని దీర్ఘకాలిక రేట్లు మళ్లీ తగ్గే అవకాశం లేదన్నారు. అంతర్జాతీయంగా చూస్తే వడ్డీ రేట్లు కొద్దిగా పెరిగాయని, తాము గ్లోబల్‌ బాం‍డ్లపై అండర్‌వెయిట్‌తో ఉన్నామని పేర్కొన్నారు. 
ఈక్విటీ మార్కెట్‌లో వ్యాల్యుయేషన్స్‌కు సంబంధించి కొన్ని ఆందోళనలు నెలకొని ఉన్న మాట వాస్తవమేనని సుధీర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌, ఈక్విటీకి అధిక ప్రాధాన్యత వంటి అంశాలతో దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్‌ పొందొచ్చని పేర్కొన్నారు. 10-15 ఏళ్ల కాలంలో మార్కెట్‌ ఎలాంటి అవరోధాలొచ్చినా.. వాటిని అధిగమించగలదని ధీమా వ్యక్తంచేశారు. భారత్‌ మార్కెట్‌లు దీర్ఘకాలంలో బుల్లిష్‌గా ఉంటాయని, సరైన ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. పబ్లిక్‌ ఈక్విటీ, ప్రైవేట్‌ ఈక్విటీ, రియల్‌ ఎస్టేట్‌, పెన్షన్‌ ఫండ్‌లలో పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపారు. 
 You may be interested

మోదీ మళ్లీనా?!.. మార్కెట్‌ అంతధీమాగా లేదు!

Thursday 16th August 2018

ప్రభుత్వం ఏర్పడినా మెజార్టీ తగ్గవచ్చు పండితుల అంచనా మరోమారు మోదీ ప్రభుత్వం ఏర్పాటుపై మార్కెట్లేమీ సూపర్‌ బుల్లిష్‌గా లేవని ట్రేడ్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విపక్షాల ఐక్యత, ప్రభుత్వ వ్యతిరేకతలాంటి రిస్కులను ఇప్పటికే మార్కెట్లు పరిగణిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా ఎకానమీలో వచ్చే మెరుగుదలను సైతం సూచీలు క్రమంగా డిస్కౌంట్‌ చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా ఇప్పటినుంచే మార్కెట్లు  ఎన్నికల

ఆర్‌కామ్‌ 14 శాతం పతనం

Thursday 16th August 2018

ముంబై:- పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయి నానావస్థలు పడుతున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ కంపెనీ షేర్లు  నష్టాల బాట పట్టాయి. గురువారం ఇంట్రాడేలో ఆర్‌కామ్‌ షేర్లు 14 శాతం పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఆర్‌కామ్‌ షేర్లు రూ.20.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో  తెలియని కారణాలతో కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా షేరు నేటి ఇంట్రాడేలో 14శాతం నష్టపోయి రూ.17.85ల కనిష్టానికి పతమమయ్యాయి. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గతముగింపు ధర(రూ.20.69)తో

Most from this category