STOCKS

News


గ్లోబల్‌ బుల్‌ మార్కెట్‌ మధ్యలో ఉన్నాం!

Monday 18th March 2019
Markets_main1552903430.png-24669

అతుల్‌ సూరి
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పాజిటివ్‌ మూడ్‌ కారణంగా దేశీయ మార్కెట్లో ర్యాలీ ఆరంభమైందని మారథాన్‌ ట్రెండ్స్‌ సీఈఓ అతుల్‌ సూరి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా భారీ బుల్‌ ర్యాలీ మధ్యలో ఉన్నామన్నారు. భారత్‌ ఇప్పుడే ఈ ర్యాలీలో కాలుమోపిందని చెప్పారు. ప్రీఎన్నికల ర్యాలీని చూస్తే ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న ఆశలు సూచీలను ముందుకు నడిపిస్తున్నట్లు కనిపిస్తోందని, కానీ నిజానికి అంతర్జాతీయ లిక్విడిటీ ప్రవాహమే ఈ ర్యాలీకి మూల ఇంధనమని వివరించారు. ఎంఎస్‌సీఐ ప్రపంచ ఇండెక్స్‌ గత మూడు నెలల్లో 9 శాతం లాభపడిందని, అంటే మూడు నెలల్లో ప్రపంచ  మార్కెట్లు దాదాపు 9 శాతం ర్యాలీ జరిపినట్లు తెలుస్తోందని చెప్పారు. మన మార్కెట్లు ఇప్పటివరకు స్తబ్దుగా ఉండి గత రెండు మూడు వారాలుగా పరుగులు ఆరంభించాయన్నారు. ఎన్నికల్లాంటి అంశాలు మార్కెట్‌పై చూపే ప్రభావం తాత్కాలికమని ఆయన చెప్పారు. యూఎస్‌ డౌజోన్స్‌ 26వేల పాయింట్ల పైన స్థిరంగా కొనసాగితే మరో పెద్ద పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించినట్లవుతుందని తెలిపారు. ఇదే జరిగితే అమెరికా మార్కెట్లు మరో కొత్త గరిష్ఠాలను చూస్తాయని అంచనా వేశారు. అయితే ఈ ఏడాదికి మాత్రం సూపర్‌ హీరోలు వర్ధమాన మార్కెట్లేనని తెలిపారు. ప్రస్తుతం మన మార్కెట్లో ఫైనాన్షియల్స్‌ జోరు చూపుతున్నాయన్నారు. బ్యాంకు నిఫ్టీ రికార్డు బ్రేకవుట్‌ సాధించినందున త్వరలో నిఫ్టీ కూడా రికార్డును దాటేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిఫ్టీ త్వరలో 12,000 పాయింట్లను తాకవచ్చని అంచనా వేశారు. ఈ మొత్తం పాజిటివ్‌ పిక్చర్‌కు క్రూడాయిల్‌ ధరలు పెరగడం అనేది మచ్చలాగా మారవచ్చని, అది మినహా వేరే ఇతర రిస్కులేమీ కనిపించడం లేదని తెలిపారు. 



You may be interested

29,650 వద్ద బ్యాంకునిఫ్టీ కన్సాలిడేషన్‌?!

Monday 18th March 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తూ బ్యాంకు నిఫ్టీ అనూహ్య ర్యాలీ జరుపుతోంది. ఈ వారంకూడా బలంగా ఆరంభించి 29500 పాయింట్ల పైన ముగిసింది. ఎఫ్‌పీఐలు మార్కెట్లో అత్యంత చురుగ్గా ఉండడంతో సూచీల్లో బుల్స్‌ కదం తొక్కుతున్నాయి. గత రెండేళ్లుగా ఎఫ్‌ఐఐలు స్తబ్దుగా ఉండడం లేదా నికర అమ్మకాలు జరపడం చేశాయి. కానీ గత 10-12 రోజుల్లో ఎఫ్‌ఐఐలు 25వేల కోట్ల రూపాయలను మార్కెట్లో కుమ్మరించారు. గత అక్టోబర్‌లో ఎఫ్‌ఐఐలు

మిడ్‌టర్మ్‌ కోసం డజన్‌ సిఫార్సులు

Monday 18th March 2019

మిడ్‌టర్మ్‌ కోసం డజన్‌ సిఫార్సులువచ్చే రెండు మూడు వారాల సమయంలో మంచి రాబడినందించే షేర్లను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. ప్రభుదాస్‌ లీలాధర్‌ సిఫార్సులు: 1. భెల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 75. స్టాప్‌లాస్‌ రూ. 63. ఇటీవలే రూ.71 నుంచి రూ. 66 వరకు పతనమైంది. తాజాగా ట్రెండ్‌ రివర్సల్‌ చూపుతోంది. ప్రస్తుతం 34 వారాల మూవింగ్‌ యావరేజ్‌ స్థాయికి పైన క్లోజయి బలంగా కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ సైతం పాజిటివ్‌ సంకేతాలు

Most from this category