STOCKS

News


10,000లోపునకు నిఫ్టీ: చార్ట్‌వ్యూఇండియా

Monday 22nd October 2018
Markets_main1540147700.png-21331

ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి ఇప్పటి వరకు రూ.93,392 కోట్లను వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఇందులో ఈక్విటీల నుంచి వెళ్లిపోయిన మొత్తం రూ.33,343 కోట్లు. వేగవంతమైన వృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థగా ఇంతకాలం విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించిన భారత్‌... చమురు ధరలు పెరుగుదల, రూపాయి పతనం, అమెరికాలో పెరిగిన ఈల్డ్స్‌, వాణిజ్య యుద్ధం వంటి అంశాల కారణంగా ఆకర్షణీయత కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత కరెక్షన్‌ నేపథ్యంలో నిఫ్టీ 10,000లోపునకు దిగిరావచ్చని చార్ట్‌వ్యూఇండియా చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజర్‌ మొహమ్మద్‌ పేర్కొంటున్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు. 

 

బేర్‌ మార్కెట్లో ఉన్నామా...?
బుల్‌ మార్కెట్లను ఆరంభ దశలో గుర్తించడం సులభమే కానీ, బేర్‌ మార్కెట్‌ను గుర్తించడంతోపాటు, అది బేర్‌ మార్కెట్‌ అని అంగీకరించడం కూడా కష్టమేనన్నారు మొహమ్మద్‌. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో గరిష్ట స్థాయి నుంచి 20 శాతం పతనం అయితే దాన్ని బేర్‌ మార్కెట్‌గా గుర్తించే విధానం... భారత్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వర్తించదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉదాహరణకు 2003-2007 బుల్‌ మార్కెట్‌ నుంచి 30 శాతం పడిపోయిన కరెక్షన్లు ఎన్నింటినో చూశామని పేర్కొన్నారు. భారత బుల్‌ మార్కెట్‌ పరిధిలో ఈ స్థాయి పెద్ద కరెక్షన్లు సాధారణమేనని, మరికొన్ని త్రైమాసికాల పాటు ప్రస్తుత కరెక్షన్‌ దశ కొనసాగొచ్చన్నారు.


 
బలమైన డౌన్‌ట్రెండ్‌
‘‘బేర్‌ మార్కెట్లో సాధారణంగా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి పనితీరు ప్రదర్శిస్తూ ఉంటే, స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ మాత్రం పడిపోతూ ఉంటాయి. 2018 ఆరంభం నుంచి మార్కెట్‌ చలనాన్ని గమనిస్తే బేర్‌ మార్కెట్‌ మాదిరే ఉంది. మార్చిలో 9,950 కనిష్ట స్థాయి నుంచి ఆగస్ట్‌లో 11,760 స్థాయి వరకు వెళ్లగా, ఈ కాలంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ప్రతికూల పనితీరునే చూపించాయి. నిఫ్టీ కీలకమైన 200 డీఎంఏ దిగువన ఉండడం, 1274 స్టాక్స్‌ 50 రోజుల చలన సగటు (డీఎంఏ)... వాటి 200 డీఎంఏకు దిగువన ఉండడం బలమైన డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తోంది’’ అని మజర్‌ మొహమ్మద్‌ వివరించారు. నిఫ్టీ మధ్యంతర డౌన్‌ట్రెండ్‌లో ఉందని, ఇది కొన్ని నెలల పాటు కొనసాగుతుందని మొహమ్మద్‌ చెప్పారు. చార్ట్‌ల ప్రకారం చూస్తే ఈ కరెక్షన్‌ 9,950 దిగువన పూర్తవుతుందన్నారు. ప్రస్తుత కరెక్టివ్‌ ప్యాటర్న్‌ను, ఇతర సంప్రదాయ టెక్నికల్‌ టూల్స్‌తో కలిపి చూస్తే నిఫ్టీ టార్గెట్‌ 9,700గా పేర్కొన్నారు. ఒకవేళ 9,950 వద్ద ఆగిపోతే కరెక్షన్‌ సైడ్‌వేస్‌లో కొనసాగుతుందని పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి/మార్చి వరకు ఈ కరెక్షన్‌ కొనసాగొచ్చని విశ్లేషించారు. You may be interested

ఈ మూడు స్టాక్స్‌పై కన్నేయండి!

Monday 22nd October 2018

మధ్యస్థం నుంచి దీర్ఘకాలానికి మంచి రాబడులకు అవకాశం ఉన్న మూడు స్టాక్స్‌ను ఈక్విటీ99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బల్గియాన్‌ సూచించారు.   అమరజ్యోతి స్పిన్నింగ్‌ మిల్స్‌ తిరుపూర్‌ మార్కెట్‌కు మెలాంజ్‌ యార్న్‌ను సరఫరా చేసే అతిపెద్ద కంపెనీ ఇది. డైడ్‌ ఫైబర్‌ యార్న్‌, డైడ్‌ కాటన్‌ యార్న్‌, పీసీ యార్న్‌ రూపంలో మార్కెట్‌ వాటాను పెంచుకుంటోంది. మొదటి త్రైమాసికంలో మంచి ఫలితాలను ప్రకటించింది. విక్రయాలు 7.4 శాతం, నికర లాభం 24 శాతం పెరిగాయి. ఈక్విటీ

సరైన రంగాన్ని ఎంచుకోవడమే కీలకం

Saturday 20th October 2018

ఎంఎఫ్‌ ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఈక్విటీల్లో, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌లో మంచి రాబడులకు సరైన రంగాన్నిఎంచుకోవడమే కీలక సూత్రమని నిపుణుల అభిప్రాయం. మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లకు ఈ రంగాలు సూటవుతాయో కొందరు నిపుణుల సూచనలు చూద్దాం.. - దీర్ఘకాల పెట్టుబడులకు వినిమయం, ఫైనాన్షియల్‌ రంగాలను ఎంచుకోవాలని కెనరా రెబెకో ఏఎంసీ చీఫ్‌ క్రిష్ణ సంఘ్వీ సూచించారు. ముఖ్యంగా ఆటుపోట్ల తరుణంలో కన్జూమర్‌ గూడ్స్‌ థీమ్‌ బాగా వర్కవుటవుతుందని ఆయన చెప్పారు. దేశ

Most from this category