STOCKS

News


ఈ పతనం ఎటు వైపు...?

Monday 18th February 2019
Markets_main1550514175.png-24251

మార్కెట్లు వరుసగా ఏడు రోజులు నష్టపోయాయి. నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను దిగొచ్చింది. ఈ పతనం ఎంత వరకు...? గత కనిష్టాలకు వెళుతుందా? ఇలా ఎన్నో సందేహాలు ఇన్వెస్టర్లలో ఉన్నాయి. దీనికి నిపుణులు ఏం చెబుతున్నారన్నది చూద్దాం...

 

ప్రస్తుత పరిస్థితి: ఈ ఏడాది ఇప్పటి వరకు చమురు ధరలు 50 శాతం పెరిగాయి. డిసెంబర్‌ 2018 త్రైమాసికం ఫలితాలు నిరాశపరిచాయి. ప్రస్తుత కరెక్షన్‌కు కారణం ఇదే. ఐటీ స్టాక్స్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు 9.5 శాతం పెరిగి మంచి పనితీరు చూపించాయి. మార్కెట్ల పతనాన్ని ఇవి కొంత వరకు నిరోధించాయి. ఫిబ్రవరి 15 నాటికి నిఫ్టీ50 1.3 శాతం నష్టపోయింది. కానీ, ఇదే కాలంలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 9.3 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 11.2 శాతం నష్టపోయాయి. 

 

ఏం జరగొచ్చు: 2018 సెప్టెంబర్‌, అక్టోబర్‌లో వచ్చిన ప్రైస్‌ కరెక్షన్‌, ఆ తర్వాత మూడున్నర నెలలుగా సమయం వారీ దిద్దుబాటుతో మార్కెట్ల కన్సాలిడేషన్‌ ముగిసింది. ఇక్కడి నుంచి బ్రేకవుట్‌ను ఊహించొచ్చు. 10,500 స్థాయి దిగిపోతే సూచీలో బలమైన వెయిటేజీ కలిగిన స్టాక్స్‌లో మరింత పతనం ఉంటుంది. ఎగువ స్థాయిలో 10,900పైన ముగిస్తే నెలవారీ క్యాండిల్‌ సానుకూలంగా మారుతుంది. నష్టాలు రికవరీ అవుతాయి. మార్కెట్లు మరింత పటిష్టంగా మారతాయి. 

 

అనుసరణ: మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో చురుకైన దిద్దుబాటు నాణ్యమైన ‍స్టాక్స్‌ను ప్రస్తుత స్థాయిలో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పీఎస్‌యూ బ్యాంకులు అప్‌మూవ్‌లో ముందుంటాయి. గత రెండు వారాల్లో బ్యాంకు నిఫ్టీ 11 శాతం పడిపోయి కీలక మద్దతు స్థాయిల్లో ఉంది. క్యాపిటల్‌ గూడ్స్‌, ఫార్మా రంగాల పట్ల కూడా సానుకూలంగా ఉన్నాం. 

- వికాస్‌జైన్‌, రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌

 

10,580 కీలకం
సాంకేతికంగా నిఫ్టీ 10,580ను వచ్చే రెండు రోజుల్లో బ్రేక్‌ చేయకూడదు. బ్రేక్‌ అవకపోతే నిఫ్టీ దిగువ స్థాయిల్లోనే కొంత సమయం పాటు చలించి 10,480-10,550 వద్ద మరో కనిష్టాన్ని నమోదు చేయవచ్చు. ఆ తర్వాత సూచీ మరో సారి 10,900 దిశగా ర్యాలీ చేయవచ్చు. వచ్చే రెండు రోజుల్లో ఇండెక్స్‌ 10,580 కోల్పోతే ఆ పతనం మరింత తీవ్రంగా 10,200 లేదా 10,000 వరకు వచ్చే కొన్ని వారాల్లో ఉండొచ్చు.

- శ్రీకాంత్‌ చౌహాన్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

 

10,600 దిగితే కష్టమే
మరీ నిరాశావాదం స్వల్పకాల కనిష్టాన్ని నమోదు చేసింది. 10600 కోల్పోతే నిఫ్టీ 50 మరింత భారీగా పడిపోవచ్చు. 10,600ను బ్రేక్‌ చేస్తే ట్రేడర్లు పెద్ద ఎత్తున షార్ట్‌ పొజిషన్లకు వెళ్లొచ్చు.

- ఉమేష్‌ మెహతా, శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌You may be interested

స్వల్ప లాభాలతో ప్రారంభం

Tuesday 19th February 2019

మిశ్రమ అంతర్జాతీయ ఫలితాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం స్వల్పలాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 55 పాయిం‍ట్ల లాభంతో 35,543 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 10650ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు స్వల్పంగా కొనుగోళ్లకు మొగ్గుచూపుతుండంతో సూచీల లాభాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఐటీ, ఫార్మా తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు జరుగుతున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌ షేర్లు ఎక్కువగా లాభపడుతున్నాయి. ఉదయం గం.9:40ని.లకు సెన్సెక్స్‌ 92 పాయింట్లు

ఈ ఫార్మా కంపెనీలకు ప్రాధాన్యం: సెంట్రమ్‌

Monday 18th February 2019

జనరిక్‌ ఫార్మా కంపెనీల కంటే సముచిత స్థానంలో ఉన్న బహుళజాతి ఫార్మా కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈక్విటీ అడ్వైజరీ హెడ్‌ దేవాంగ్‌ మెహతా తెలిపారు. కన్జ్యూమర్‌ వ్యాపారంలో పెట్టుబడులకు మంచి కంపెనీలు ఉన్నట్టు చెప్పారు. వివిధ అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు.   ఫార్మాలో అవకాశాలు... చాలా వరకు లార్జ్‌క్యాప్‌ ఫార్మా కంపెనీలు గత నాలుగైదేళ్ల కాలంలో లార్జ్‌క్యాప్‌లోనే ఉండిపోలేదు. సన్‌ఫార్మా, లుపిన్‌, డాక్టర్‌

Most from this category