STOCKS

News


పర్యాటక రంగ స్టాకులను పట్టేయండి

Saturday 14th July 2018
Markets_main1531563851.png-18323

దేశీయ ఎకానమీ బలోపేతం కావడంలో, ఉపాధి కల్పనలో టూరిజం కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల కాలంలో దేశంలోకి విదేశీ పర్యాటకుల సంఖ్య క్రమాగనుగత వృద్ధి నమోదు చేస్తోంది. ఇతర దేశాలతో పోటీగా భారత్‌లో సైతం ప్రభుత్వం పలురకాల టూరిజం మోడళ్లను అభివృద్ధి చేస్తోంది. మెడికల్‌ టూరిజం, వెల్‌నెస్‌ టూరిజం, కల్చరల్‌ టూరిజం, అడ్వంచర్‌ టూరిజం, క్రూయిజ్‌ టూరిజం లాంటి పలు మోడళ్లు అమిత జనాకర్షణ చేస్తున్నాయి. పలు పురాతన ప్రదేశాలను టూరిజానికి అనుకూలంగా తీర్చిదిద్దడం జరుగుతోంది. ఈ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 2020 నాటికి ప్రపంచ టూరిజం అరైవల్స్‌లో ఒక శాతం వాటా సాధన దిశగా యత్నిస్తోంది. బడ్జెట్లో సైతం ఇందుకు మంచి కేటాయింపులు చేసింది. వరల్డ్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కౌన్సిల్‌ (డబ్ల్యూటీటీసీ)–2018 నివేదిక ప్రకారం.. 2017లో దేశీయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ట్రావెల్, టూరిజం రంగం వాటా 234 మిలియన్‌ డాలర్లు. 2028 నాటికిది 492 మిలియన్‌ డాలర్లకు చేరుతుందని డబ్ల్యూటీటీసీ అంచనా వేసింది. దేశీయ ఆతిథ్య రంగం ఏటా 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది.డబ్ల్యూటీటీసీ, ట్రావెల్‌పోర్ట్‌ నివేదిక ప్రకారం 2011–16లో ప్రపంచ వ్యాపార ప్రయాణాల్లో మన దేశం 11వ స్థానంలో నిలిచింది. ఇదే కాలంలో ఏటా 16.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2008లో విదేశీ వ్యాపార పర్యాటక వ్యయం 8.2 బిలియన్‌ డాలర్లు. 1995 తర్వాత ఇదే అత్యధికం. కానీ, 2011 నాటికిది 5.2 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. ప్రపంచ ఆర్ధిక మందగమనమే ఇందుకు కారణం. మళ్లీ గత రెండు మూడేళ్లుగా కేంద్రం తీసుకుంటున్న సానుకూల వ్యాపార విధానాలతో మళ్లీ విదేశీ వ్యాపార పర్యాటక వ్యయం 2017లో 11.6 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2028 నాటికిది 24.4 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. 
కేంద్ర పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం.. 2015లో 143 కోట్లు ఉన్న విదేశీ పర్యాటకులు 2016 నాటికి 161 కోట్లకు పెరిగింది. మెడికల్‌ టూరిజం, పర్యాటక కేంద్రాలు, అందుబాటు విమాన చార్జీలు, హోటళ్లు, సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు ఉండటం వంటివి ఈ వృద్ధికి కారణమని నిపుణులు చెబుతున్నారు. మెట్రోలు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో బిజినెస్‌ క్లాస్, బడ్జెట్‌ హోటళ్లు పెరగడంతో దేశీయ పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. 2005లో 82.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దేశీయ పర్యాటక వ్యయం.. 2017 నాటికి 186 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2028 నాటికిది 405 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా.దేశీయ పర్యాటక రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లకు అనుమతి ఉండటంతో భారీగా ఎఫ్‌డీఐలు వస్తున్నాయి. ఏప్రిల్‌ 2000– డిసెంబర్‌ 2017 మధ్య కాలంలో దేశీయ పర్యాటక రంగంలోకి 10.9 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐ నిధులు వచ్చాయి.
ఆధ్యాత్మికత అధికమైన మన దేశంలో పుణ్యస్థలాల దర్శనం అధికం. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వదేశ్‌ దర్శన్‌, ప్రసాద్‌(పిలిగ్రిమేజ్‌ రిజువనేషన్‌ అండ్‌ స్పిరిట్చు‍్యల్‌ అగ్‌మెంటేషన్‌ డ్రైవ్‌) లాంటి కార్యకలాపాలు అమలు చేస్తోంది. ఈ చర్యల ఫలితంగా దేశంలోకి వచ్చే విదేశీ కరెన్సీ(టూరిజం రంగంలో) పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశీయ హోటల్‌ ఆక్యుపెన్సీ రేటు పదేళ్ల గరిష్ఠానికి చేరింది. ఇవన్నీ టూరిజం రంగంలో ఉత్తేజాన్ని చూపుతున్నాయి. దేశీయ కరెన్సీ క్షీణత సైతం విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో టూరిజం రంగానికి చెందిన స్టాకులు సమీప భవిష్యత్‌లో మరింత లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం ప్రత్యక్షంగా పర్యాటకానికి సంబంధించిన కంపెనీలతో పాటు పరోక్షంగా అనుసంధానమైన కంపెనీలు సైతం ఇకమీదట మరింత జోరు చూపవచ్చని అంచనా. వచ్చే పదేళ్లలో భారత్‌ మూడో అతిపెద్ద టూరిజం ఎకానమీగా మారుతుందని ప్రపంచ టూర్స్‌ అండ్‌ ట్రావెల్‌ కౌన్సిల్‌ జోస్యం చెబుతోంది. 
- వీటిని దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలానికి మహీంద్రా హాలిడేస్‌, ఐటీడీసీ, ఇండియన్‌హోటల్స్‌, ఈఐహెచ్‌ షేర్లను కొనొచ్చని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. వీటితో పాటు కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, థామస్‌కుక్‌లాంటి టూర్‌ ఆపరేటర్లు, విమానయాన కంపెనీల షేర్లను సైతం పరిశీలించవచ్చని సూచించారు. You may be interested

అపోటెక్స్‌ వ్యాపారం అరబిందో చేతికి...

Saturday 14th July 2018

కెనెడాకు చెందిన జెనరిక్స్‌ ఉత్పత్తిదారు అపోటెక్స్‌కు చెందిన ఐదు దేశాల వ్యాపారాన్ని అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. ఈ మేరకు అపోటెక్స్‌తో అరబిందో అనుబంధ సంస్థ ఎగెల్‌ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ 7.4 కోట్ల యూరోలు. ఈ ఆల్‌క్యాష్‌ (ఎటువంటి రుణాలు లేకుండా మొత్తం నగదు రూపంలో అందిచడం)ఒప్పందంలో భాగంగా పోలెండ్‌, చెక్‌, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, బెల్జియం దేశాల్లో అపోటెక్స్‌ వ్యాపారం(వాణిజ్య కార్యకలాపాలు, ఇన్‌ఫ్రా) అరబిందో చేతికి

పసిడి పయనం ఎటువైపు..

Saturday 14th July 2018

అమెరికా బాండ్‌ ఈల్డ్, వడ్డీ రేట్లు, డాలర్‌ పెంపు భయాలు స్వల్పకాలంలో దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లకు విశ్లేషకుల సూచన బంగారంపై ఒత్తిడి నెలకొని ఉంది. ప్రసుత్తం ఔన్స్‌ విలువ 1,250 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పుత్తడి వెలుగు తగ్గడానికి డాలర్‌ బలపడటం ప్రధాన కారణం. మరి గోల్డ్‌ పయనం ఎటువైపు? కరక‌్షన్‌ దిశగా అడుగులు వేస్తోందా? కమోడిటీ నిపుణులు అనిశ్చితి ఇంకా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటాను పెంచుకునే

Most from this category